
సాక్షి, చిలకలూరిపేట: ఆస్తి కోసం సొంత అక్క, తల్లిపైనే టీడీపీ యువనాయకుడు కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం జరిగినదిగా తెలుస్తున్న ఈ ఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిలకలూరిపేట పట్టణ పోలీసులను ఆశ్రయించినా నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు అనుంగ అనుచరుడు కావడంతో పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
ఈ ఘటనపై బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని పండరీపురానికి చెందిన టీడీపీ యువనాయకుడు చుండూరి ఉదయ్ వడ్డీ వ్యాపారం చేస్తాడు. రూ.3కోట్ల విలువ చేసే ఆస్తి వ్యవహారానికి సంబంధించి తల్లి, అక్క నాగలక్షి్మతో ఉదయ్‌కు వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అతని తల్లి నాగలక్ష్మికి డబ్బు చెల్లించాలని అడిగారు. దీనికి ఉదయ్ అంగీకరించకపోవడంతోపాటు తల్లి, అక్కను కిందపడేసి కాళ్లతో కర్రలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితురాలు నాగలక్ష్మి ఉదయ్ దాడికి పాల్పడిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.
పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తమ ప్రాణాలు కాపాడాలని సోషల్‌మీడియా వేదికగా వేడుకున్నారు. ఈ విషయంపై అర్బన్ సీఐ పి.రమేష్‌ను ఫోన్లో వివరణ కోరగా బాధితులు పోలీసు స్టేషన్‌కు వచి్చన మాట వాస్తవమేనని అయితే, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వ్యవహారం మాట్లాడి రాజీ చేసుకుంటామని వెళ్లిపోయారని వివరించారు. బాధితులు కేసు నమోదు చేయమంటే నమోదు చేస్తామని వివరించారు.