
కాలేజీలు జూన్ 2న.. స్కూళ్లు 12న పునః ప్రారంభం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ముగియడంతో వేసవి సెలవులు ప్రకటించారు. జూనియర్ కాలేజీలు జూన్ 2న, పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం అవుతాయి. అయితే, అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 6న విధుల్లో చేరాలని విద్యా శాఖ ఆదేశించింది.