
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేత కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా వరుడి ఇంటిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత సుంకర వెంకటరమణ కుమార్తె శివలీల, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వరుడు వెంకటేశ్వర్లుపై వెంకటరమణ, ఆయన మద్దతు దారులు కక్ష పెంచుకున్నారు. దీంతో, వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, రాడ్లతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది.
