
తాడేపల్లి,సాక్షి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యంగ విరుద్ధమైన విధానాలకు తెగబడింది. సీఎం చంద్రబాబు ఆర్థిక విధానాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా.. అందకారంగా రాష్ట్ర భవిష్యత్ అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ‘వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు. 436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబు. ఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు. ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టి. రూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పు. భవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు కట్టబెడుతూ నిర్ణయం. రుణాలిచ్చే సంస్థలు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వాయిదాలు తీసుకునే అవకాశం. రుణ సంస్థలకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా నిలిచిన చంద్రబాబు సర్కారు. చరిత్రలో ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం తొలిసారి. వినాశ ఆర్థిక విధానాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అంటూ’ పేర్కొంది.
.@ncbn వినాశకర ఆర్థిక విధానాలు అప్పులకోసం రాజ్యాంగ ఉల్లంఘనలు
436 గనులను తాకట్టు పెట్టిన చంద్రబాబు
ఈ గనులన్నీ ఏపీ ఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు
ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టి
రూ.1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టుపెట్టి రూ.9వేల కోట్ల అప్పు
భవిష్యత్తు ఆదాయాలను రుణ సంస్థలకు… pic.twitter.com/ET5g0nWA2J— YSR Congress Party (@YSRCParty) April 24, 2025