
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే సిగి్నటీ టెక్నాలజీస్‌కు ఐడీసీ మార్కెట్‌స్కేప్ అధ్యయనంలో దిగ్గజ సంస్థగా గుర్తింపు లభించింది. వెండార్ల సేవలను మదింపు చేసే ఈ నివేదికలో.. కస్టమర్లు సిగి్నటీకి అత్యధిక రేటింగ్ ఇచ్చారు. వినూత్న సరీ్వసులను అందించడంలోనూ, తమ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ సేవల ప్రమాణాలు, వ్యాపా రాలపై వాటి సానుకూల ప్రభావాల గురించి అర్థమయ్యేలా వివరించడంలోనూ సంస్థ సమర్ధమంతంగా పనిచేస్తోందని కస్టమర్లు అభిప్రాయపడ్డారు.
కస్టమర్లు తమ వెండార్ల నుంచి నాణ్యత, నైపుణ్యాలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని ఆశించడంతో పాటు వారు తమ వ్యాపార వృద్ధికి ఎలా దోహదపడగలరనేది ఆలోచిస్తారని, తదనుగుణంగా వ్యవహరించే సంస్థలే అధిక వృద్ధి సాధించగలవని ఐడీసీ రీసెర్చ్ రీసెర్చ్ వీపీ ముకేశ్ దయలానీ తెలిపారు. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి, వారి వ్యాపారాలకు ఉపయోగపడే సేవలందించడంలో తమ సామరŠాధ్యలకు ఐడీసీ మార్కెట్‌స్కేప్ గుర్తింపు నిదర్శనమని సిగి్నటీ టెక్నాలజీస్ సీఈవో శ్రీకాంత్ చక్కిలం తెలిపారు.