
ప్రేమికుల రోజు(Valentine's Day)ను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ తన 'వాలెంటైన్స్ డే సేల్ 2025'ని ప్రారంభించింది. ఇందులో యాపిల్ ఐఫోన్‌ల మీద గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి మొదలైన ఈ సేల్స్ 14 వరకు కొనసాగుతుంది.
ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ 2025లో.. డిస్కౌంట్స్ లభిస్తున్న ఐఫోన్‌లలో.. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వంటివి ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు రూ. 11,000 తగ్గింపుతో.. రూ. 78,999 వద్ద లభిస్తుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 5,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే రూ. 74000కు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఇంకా తగ్గింపు లభిస్తుంది.
ఐఫోన్ 15 ధర రూ.64,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఐఫోన్ 15 ప్లస్ రూ.68,999 కు లభిస్తుంది. ఐఫోన్ 14 మోడల్ రూ.53,999 ధరకు లభిస్తుంది. కేవలం ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాకుండా.. వివిధ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లు కూడా కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తుల మీద మంచి ఆఫర్స్ అందిస్తాయి. ఇందులో కేవలం మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఇతర వస్తువులు ఉంటాయి.