
అప్పుడు యోగా చేసి ఆశ్చర్యపరిచిన టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు డ్యాన్స్ ఇరగదీస్తోంది. గుడ్లు చకాచకా ఉడకబెట్టేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ సరికొత్తగా ఆవిష్కరించిన హ్యుమనాయిడ్ రోబో డెమో వీడియోను మస్క్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2' (Optimus Gen-2) ను ఆవిష్కరించింది. ఇది ఏమేమి పనులు చేయగలదో మస్క్ షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు. ఇది అచ్చం మనిషిలాగే వివిధ పనులు చేస్తోంది. టెస్లా కొన్ని నెలల క్రితం ఆవిష్కరించిన 'ఆప్టిమస్ జెన్ 1'ను మరింత మెరుగుపరిచి ఈ 'ఆప్టిమస్ జెన్ 2' రూపొందించింది. ఇది మునుపటి రోబో కంటే 10 కేజీలు తేలికైనది. 30 శాతం వేగవంతమైనది. దీనికి మరింత సామర్థాన్ని జోడించారు. నడక వేగం, చేతి కదలికలు, వేళ్లపై స్పర్శ సెన్సింగ్ తదితర అన్ని అంశాల్లోనూ మెరుగుదలను ప్రదర్శిస్తోంది.
ఇది కూడా చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్
ఎలాన్ మస్క్ తాజాగా ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోకు "ఆప్టిమస్" అని క్యాప్షన్ పెట్టారు. టెస్లా ఫ్యాక్టరీలో చుట్టూ సైబర్ ట్రక్‌ల మధ్య షైనీ వైట్ కలర్ బాడీలో ఆప్టిమస్ జెన్2 రోబో మెరిసిపోతూ కనిపిస్తోంది. వీడియో చివర్లో రెండు రోబోలు డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. కాగా 2022లో మొదటిసారిగా హ్యూమనాయిడ్ రోబో కాన్సెప్ట్ గురించి వెల్లడించారు.
Optimuspic.twitter.com/nbRohLQ7RH
— Elon Musk (@elonmusk) December 13, 2023