
సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..
బ్యాంక్ చార్జీలు
ఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.
డబ్బు వృధా
బ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.
ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీ
మోసాలకు అవకాశం
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.
సిబిల్ స్కోరుపై ప్రభావం
బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి.