Basara IIIT: వాడు లేని జీవితం నాకొద్దు! | IIIT Basar Student Dies By Suicide Due To Death Of Her Brother-In-Law In Nirmal - Sakshi

బాసర ట్రిపుల్‌ ఐటీ: వాడు లేని జీవితం నాకొద్దు!

Published Fri, Feb 23 2024 4:50 AM | Last Updated on Fri, Feb 23 2024 10:46 AM

A student committed suicide in Basara Triple IT - Sakshi

వాడు నన్ను ప్రాణంగా ప్రేమించాడు. మీ కంటే బాగా.. 

భైంసా: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ ఫస్టియర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రాణంగా ప్రేమించిన బావ మృతిని తట్టుకోలేకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు లేఖ రాసింది. 

వర్సిటీ అధికారుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన తెనుగు శిరీష(17) గురువారం తన ఇంటి నుంచి వర్సిటీకి వచ్చింది. గంగా హాస్టల్‌లోని తన 117 గదిలోనే సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది క్యాంపస్‌ హెల్త్‌సెంటర్‌కి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు.

శిరీష మృతదేహాన్ని నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు క్యాంపస్‌ వర్గాలు చెబుతున్నాయి.  తల్లిదండ్రులకు ఆమె రాసిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె బావ ఈ మధ్యే మృతి చెందగా.. అది తట్టుకోలేకే శిరీష బలన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శిరీష మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement