ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు | Bombay HC asks railway minister to sympathetically decide on Rs 5 crore for woman in vegetative state | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు

Published Mon, Mar 17 2025 4:26 PM | Last Updated on Tue, Mar 18 2025 4:59 PM

Bombay HC asks railway minister to sympathetically decide on Rs 5 crore for woman in vegetative state

ఆమెకు, ఇన్నేళ్ల నరకం చాలు ఇకనైనా డిసైడ్‌ చేయండి రైల్వే మంత్రిని కోరిన హైకోర్టు 

రూ.5 కోట్లు మంజూరు చేయాలని రైల్వే మంత్రినికోరిన బాంబే హైకోర్టు

ఏనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతికి  నష్ట పరిరహారం చెల్లింపు విషయంలో నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. బాధిత మహిళకు  రూ.5 కోట్ల తుది సెటిల్‌మెంట్ క్లెయిమ్‌ను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు  రైల్వే మంత్రిని కోరింది. ఇన్నేళ్లుగా బాధితురాలు నిధి,  ఆమె కుటుంబం పడిన బాధను, ఏ విధంగానూ భర్తీ చేయలేం. అందుకే  మానవతా దృక్పథంలో ఆలోచించి ఇక దీనికి ముగింపు పలకడం సముచితమని కోర్టు  పేర్కొంది. అసలేంటి కేసు? వివరాలు తెలుసుకుందాం ఈ  కథనంలో.

2017,  మే 28 నిధి రాజేష్ జెఠ్మలానీ  (వయసు అప్పటికి 17) మెరైన్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ దాటుతుండగా రోడ్డు  ప్రమాదం చోటు చేసుకుంది. 12వ తరగతిలో అడ్మిషన్ కోసం కేసీ కాలేజీకి వెళుతుండగా, పశ్చిమ రైల్వేకు చెందిన కారు ఆమెను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో నిధి మెదడు తీవ్రంగా దెబ్బతింది.  దాదాపు కోమా(vegetative state) లాంటి పరిస్థితిలో మంచానికే పరిమితమై పోయింది. 

ఈ కేసు ముంబైలోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఫిబ్రవరి 2021లో ఆమెకు రూ.69.92 లక్షలు వడ్డీతో పాటు రూ.1.5 కోట్ల కార్పస్‌ను మంజూరు చేసింది. వడ్డీని ఆమె భవిష్యత్తు వైద్య , ఇతర ఖర్చులకు ఉపయోగించాలి తీర్పుచెప్పింది. అయితే దీనిపై    రైల్వే శాఖ అప్పీలుకు వెళ్లింది. ఈ అప్పీల్ పెండింగ్‌లో  ఉన్న నేపథ్యంలో2022లో పశ్చిమ రైల్వే కోర్టులో డిపాజిట్ చేసిన రూ. 1.15 కోట్లను ఉపసంహరించుకోవడానికి హైకోర్టు తండ్రికి అనుమతి ఇచ్చింది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ కింద బాదిత ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. 

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిధి జెఠ్మలానీకి రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఆమె పరిస్థితి తీవ్రత దృష్ట్యా కోర్టు దీనిని 'చాలా అరుదైన' కేసుగా పేర్కొంది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ కింద  ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. మార్చి6న దీనిని  అరుదైన కేసుగా పేర్కొంటూ,  న్యాయమూర్తులు గిరీష్ కులకర్ణి , అద్వైత్ సేథ్నా మాట్లాడుతూ, "ఈ ప్రభావం చాలా భయంకరమైనది. సంతోషంగా, ఎన్నో ఆశలతో ఉన్న అమ్మాయి ఫోటోలు, ప్రస్తుత స్థితి ఎవరికైనా చాలా దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. ఇక తల్లిదండ్రులు/కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏమిటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిధి బాధ,  తల్లిదండ్రుల కష్టాలను డబ్బు తీర్చలేదు. నిజానికి  వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటే, ఇది ఖచ్చితంగా సరిపోదు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిధి పరిస్థితిని దివంగత అరుణ షాన్‌బాగ్ పరిస్థితితో  పోల్చారు. 

చదవండి: మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్‌ వైరల్‌

బాధితురాలు మాత్రమే కాకుండా ఆమె కుటుంబం మొత్తం అనుభవించిన బాధ ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఈ విషయంలో ప్రతివాది (WR) సంబంధిత అధికారులు మంత్రిత్వ శాఖ (రైల్వే మంత్రి) అత్యున్నత స్థాయిలో ఆలోచించి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు అభ్యర్థించారు. తదుపరి విచారణను మార్చి 20కి  వాయిదా వేశారు. మరోవైపు నిధి తండ్రి గతంలో చెల్లించిన మొత్తాలను మినహాయించి రూ. 5 కోట్లకు సెటిల్మెంట్ చేసుకునేందుకు అంగీకారం తెలిపారు.

చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్‌ కమెంట్లు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement