
పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రెవె న్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మంగళవా రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, తదితర అంశాలపై కలెక్టర్‌లతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలన్నారు. బలహీన వర్గాల వారికి ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేయడంకోసం అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇందిరమ్మ ఇళ్లను మంజూ రు చేసి పనులు ప్రారంభించాలన్నారు. భూ భారతిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణలో 25 శాతం రాయితీ గడువును మరోసారి పొడిగించబోమని పేర్కొన్నారు.
జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట్ మండలంలో భూ భారతి అమలు చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలున్నాయని, ఇప్పటివరకు 8 గ్రామాల్లో సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు. భూ సమస్యలపై 810 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎఫ్‌వో నికిత, ఆర్డీవోలు వీణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికలు సిద్ధం చేయాలి
జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడానికి అవసరమైన కట్టడాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీలలో రాబోయే వానాకాలంలో తీసుకునే వర్షపు నీటి సంరక్షణ చర్యల కోసం వెంటనే సర్వే చేపట్టాలన్నారు. ఈ వేసవిలో భూగర్భ జలాల సంరక్షణకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని డీఆర్‌డీవో సురేందర్‌ను ఆదేశించారు. వాగులను గుర్తించి వాటిలో నీటి ప్రవాహానికి అడ్డుగా రాతి కట్టడాలను నిర్మించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. భూగర్బ జలాల సంరక్షణ కోసం ఫాంపాండ్స్, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలు ఎక్కువగా నిర్మించాలన్నారు. వానాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా భూగర్భజల అధికారి సతీశ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్‌లు రాజేందర్, శ్రీహరి, మహేష్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
భూభారతిని పకడ్బందీగా
అమలు చేయాలి
వీసీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సరైన పోషకాహారం తీసుకోవాలి
గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం తీ సుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించా రు. కలెక్టరేట్‌లో మంగళవారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణా పక్షం కార్య క్రమాన్ని నిర్వహించారు. అధికారులు లబ్ధిదారులతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. సామూహిక సీమంతాలు, అన్నప్రసాన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పా టు చేసిన పోషకాహార ప్రదర్శనను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో అంగన్‌వాడి టీచర్లు తయారు చేసిన మునుగ ఆకు ర సం, రాగి జావా, నువ్వుల లడ్లు తదితర పోషకాహారాలను రుచి చూసి వారిని అభినందించారు.

పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి