
రమణ(ఫైల్)
కరీంనగర్: కుమారుడికి సరైన ఉద్యోగం లేదనే బెంగతో ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఏఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాలు. మండలంలోని తెర్లుమద్దికి చెందిన పల్లె రమణ(40) ఈనెల 10న ఇంట్లో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న రమణను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. రమణ కుమారుడు నిఖిల్‌కు సరైన ఉద్యోగం లేదని తరచూ బాధపడుతుండేది. ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడని మదనపడేది. ఈక్రమంలోనే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి కుమారుడు నిఖిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.