
ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి
తొర్రూరు రూరల్: ప్రభుత్వ బడుల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అ న్నారు. బుధవారం మండలంలోని చెర్లపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝూన్సీరెడ్డి, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, ఫౌండేషన్ ప్రతినిధులు బాకి శ్రీనివాస్, నాగరాజు, నాగిరెడ్డి, యాకుబ్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, బీరెల్లి లావణ్య, రామచంద్రు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి