
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
● సన్నబియ్యం సరఫరాపై పటిష్ట నిఘా ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,41,795 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, స్థానిక అవసరాలు, విత్తనాలు, రైస్‌మిల్లర్ల కొనుగోలు పోను పౌ ర సరఫరాల సంస్థ ద్వారా 3,31,395 మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, 321 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2,19,106 రేషన్‌కార్డులు ఉన్నాయని, 4,143 మెట్రిక్ టన్నుల ధా న్యం పంపిణీకి కేటాయించగా.. ఇప్పటివరకు 82.05 శాతంతో 3,400 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని తెలిపారు. సన్నబియ్యం పక్కదారి పట్ట కుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోషణ పక్షం పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా మహిళ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు పోషణ పక్షం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి జిల్లా సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తంనాయక్, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావులో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీడీపీవోలు విజయలక్ష్యి, రేష్మ, మనోరమ, జిల్లా సమన్వయకర్త రజిత, ప్రాజెక్టు సహాయకురాలు శ్యామల పాల్గొన్నారు.
గీత కార్మికుల సంక్షేమం దిశగా చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: గీత కార్మికుల సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ.పురుషోత్తంనాయక్‌తో కలిసి గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు.
తాగునీటి సమస్య లేకుండా చర్యలు
తీసుకోవాలి
నస్పూర్/మంచిర్యాలటౌన్: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చున్నంబట్టివాడ, నస్పూర్‌లోని 23వ వార్డు, శ్రీరాంపూర్, ఆర్‌కే–6, శ్రీరాంపూర్ బస్టాండ్, సీతారాంపల్లి ప్రాంతాల్లో అమృత్2.0 పనులు పరిశీలించారు. కాలేజీరోడ్డులో మహాప్రస్థానం సందర్శించి సౌకర్యాలు, పనులను పరిశీలించి మిగతా పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ శివాజీ పాల్గొన్నారు.