
టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో నటించే ఛాన్స్ వస్తే ఏ నటులైనా ఎగిరి గంతేస్తారు. అలా ఆయన డైరెక్షన్‌లో హీరామండి (Heeramandi: The Diamond Bazaar) వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసే అవకాశం హీరోయిన్ అదితిరావు హైదరి (Aditi Rao Hydari)కి వచ్చింది. సెకండ్ థాట్ లేకుండా వెంటనే ఓకే చేసింది. హీరామండి: ద డైమండ్ బజార్ సిరీస్‌లో బిబ్బోజాన్‌గా నటించింది. అందులో ఆమె గజగామిని నడక సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే!
అవకాశాలు జలపాతంలా కురుస్తాయనుకున్నా..
అయితే ఈ సిరీస్ తర్వాత తనకు మంచి అవకాశాలే రావడం లేదంటోంది బ్యూటీ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితిరావు హైదరి మాట్లాడుతూ.. హీరామండి సిరీస్‌లో నన్ను ఎంతగానో ఆదరించారు. దీని తర్వాత నాకు అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకున్నాను. కానీ ఆ ఊహలో నుంచి త్వరగానే బయటపడ్డాను. ఎందుకంటే అవకాశాలు జలపాతంలా కురవడం కాదు కదా.. ఏకంగా కరువే ఏర్పడింది. ఆ సిరీస్ తర్వాత ఏ ప్రాజెక్టుకూ నన్ను సంప్రదించలేదు. ఛాన్సులు లేవని పెళ్లి చేసుకోలేదు కానీ... సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాను.

అందుకే పెళ్లి చేసుకున్నా..
ఎలాగోలా ఖాళీ సమయం దొరికింది కాబట్టి సిద్దార్థ్‌తో మూడు ముళ్లు వేయించుకున్నాను. సిద్దార్థ్ చాలా మంచి మనిషి. పెళ్ల ప్రస్తావన తెచ్చినప్పుడు సెకను ఆలోచించకుండానే ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. సిద్దార్థ్, అదితి రావు హైదరి గతేడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక అదితి రావు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో భాగం కానుంది. ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో అవినాష్ తివారితో కలిసి నటించనుంది. ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం 9000 కి.మీ పర్ హవర్, వి, మహాసముద్రం చిత్రాలు చేసింది.
చదవండి: పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానన్నా.. కానీ తనే..: జెనీలియా