
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) సినిమా మొదటిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మూవీని తెరకెక్కించాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చని అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు.
బింబిసార సినిమా తర్వాత కల్యాణ్‌రామ్ మరో రెండు చిత్రాలు చేశారు. కానీ, వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అయితే, అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రానికి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వినిపిస్తుంది. దీంతో మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.15 కోట్లు రాబట్టింది. బింబిసార ఫస్ట్ డే నాడు రూ. 6.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఏ రెండు సినిమాలు కూడా మొదటిరోజు రూ. 5 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. అయితే, అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఇప్పుడు రూ. 5.15 కోట్లు రాబట్టి ఆ లోటును భర్తి చేసింది.

ఈ సినిమాకు ప్రధాన బలయం విజయశాంతి, కల్యాణ్ రామ్ అని చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ వారిద్దరూ పోటీపడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో విజయశాంతి దుమ్మురేపారు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్‌ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్ బలం ఎమోషన్.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' కట్టిపడేస్తుంది.