
విజయకాంత్ వివాహానంతరం వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో దూరం పెరిగింది. విజయకాంత్ ఆయన పార్థివ దేహంపై పడి బోరున ఏడ్చేశారు. అంతటి స్నేహబంధం వారిది. ఇక తొలి రోజుల్లో తన సరసన నటించడానికి నిరాకరించి అవమాన పరిచిన పలువురు నటీమణులకు ఆ తరు
స్నేహానికి విలువనిచ్చిన నటుడు విజయకాంత్. ఈయన, నిర్మాత ఇబ్రహిం రావుత్తర్ చిన్ననాటి నుంచే మంచి మిత్రులు. ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకున్న వాళ్లు. అలా వీరి మధ్య స్నేహం చిత్ర పరిశ్రమ వరకూ చేరి 50 ఏళ్లు కొనసాగింది. విజయకాంత్ హీరోగా ఇబ్రహిం రావుత్తర్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయనకు సలహాదారుడిగానూ ఉన్నారు. విజయకాంత్ వివాహానంతరం వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో దూరం పెరిగింది.
అయితే ఇబ్రహిం రావుత్తర్ మరణించినప్పుడు విజయకాంత్ వెంటనే వెళ్లి ఆయన పార్థివ దేహంపై పడి బోరున ఏడ్చేశారు. అంతటి స్నేహబంధం వారిది. ఇక తొలి రోజుల్లో తన సరసన నటించడానికి నిరాకరించి అవమాన పరిచిన పలువురు నటీమణులకు ఆ తరువాత విజయకాంతే అవకాశాలు కల్పించడం విశేషం. ఇక శరత్‌కుమార్, మన్సూర్ అలీఖాన్, పొన్నంబలం వంటి పలువురు నటులకు తన చిత్రాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించి తన మంచి మనసు చాటుకున్నాడు.