పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా! | Jr NTR Fans Thrilled To See Sri Lankan President Use Devara Movie BGM In Video With Pm Modi Goes Viral | Sakshi
Sakshi News home page

Jr NTR: దేవర సాంగ్ బీజీఎం.. ఏకంగా ఆ దేశాధ్యక్షుడికే నచ్చేసింది!

Published Sun, Apr 13 2025 8:28 PM | Last Updated on Mon, Apr 14 2025 10:04 AM

Jr NTR fans thrilled to see Sri Lankan President use BGM score from Devara

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం గతేడాది దసరా కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవర సినిమాతో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు.

అయితే ఈ సినిమాలోని సాంగ్స్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. ముఖ్యంగా చుట్టమల్లే, ఆయుధపూజ సాంగ్స్‌ అయితే సూపర్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. దేవర పాటలకు రీల్స్‌ చేస్తూ ఫ్యాన్స్‌ అలరించారు. ‍అయితే ఈ సినిమాలోని రెడ్ సీ సాంగ్‌ బీజీఎం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఎర్ర సముద్రం బీజీఎం స్కోర్‌ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది.

అయితే తాజాగా దేవర మూవీ రెడ్ సీ సాంగ్‌ను ఏకంగా  శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిసానాయకే తన సోషల్ మీడియాలో వినియోగించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి స్వాగతం పలుకుతూ చేసిన ఓ వీడియోను ఆయన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోకు దేవర రెడ్ సీ సాంగ్ ‍బీజీఎంను జత చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ సీన్‌కు సరిగ్గా సరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మీకు ‍‍అద్భుతమైన ఎడిటర్ ఉన్నారు సార్ అంటూ శ్రీలంక అధ్యక్షుడిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా మీ ఎడిటర్‌కు శ్రీలంక కరెన్సీ కాకుండా యూఎస్ డాలర్లలో చెల్లించండి అంటూ ఫ్యాన్స్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

కాగా.. దేవర పార్ట్-1 బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్‌ ఉంటుందని డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. దేవర సీక్వెల్‌ అప్‌డేట్స్‌ కోసం యంగ్ టైగర్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement