
బాలీవుడ్ కొత్త డాన్ రణ్‌వీర్ సింగ్ సరసన కృతీసనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ ‘డాన్ ’ ఫ్రాంచైజీలో రూపొందనున్న కొత్త చిత్రం ‘డాన్ 3’. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించను న్నారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్న ఈ మూవీని 2023 ఆగస్టులోనే ప్రకటించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ వేసవి నుంచి షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. కానీ, ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉండటంతో ఈ మూవీలో హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ‘డాన్ 3’ కోసం కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు ఫర్హాన్ అక్తర్. అందులో భాగంగా ఇటీవల శర్వారీ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా కృతీసనన్ పేరు బాలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి.. ‘డాన్ 3’ లో రణ్‌వీర్ సింగ్ సరసన కృతీసనన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. కాగా హిందీలో వచ్చిన ‘డాన్ ’ (2006), ‘డాన్ 2’ (2011) సినిమాల్లో షారుక్ ఖాన్ హీరోగా, 1978లో వచ్చిన
‘డాన్ ’లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.