
మలయాళ సూపర్ స్టార్ నటించిన చిత్రం ఎల్2 ఎంపురాన్. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా ఎంపురాన్ నిలిచిందని ట్వీట్ చేశారు. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ప్రథమ స్థానంలో మంజుమ్మెల్ బాయ్స్ ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా ఆల్‌టైమ్ కలెక్షన్స్ రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ జాబితాలో ఎంపురాన్ రెండోస్థానంలో కొనసాగుతోంది.
వివాదంలో ఎంపురాన్..
ఇటీవల ఎంపురాన్ మూవీపై వివాదం తలెత్తింది. గుజరాత్ అల్లర్ల సీన్స్ ఈ మూవీ ఉంచడంపై కొందరు విమర్శలు చేశారు. ఎంపురాన్‌ను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత అభ్యంతరం ఉన్న సన్నివేశాలు తొలగిస్తామని మేకర్స్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 31, 2025
🙂❤️❤️❤️ https://t.co/QpRIuhJ9oQ
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 31, 2025