
'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ముత్తయ్య'. ఇదివరకే పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు కూడా దక్కించుకుంది. ఇప్పుడు దీన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ట్రైలర్ ని రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం)
భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధాకర్ రెడ్డితో పాటు అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఓ తెలుగు ఓటీటీ యాప్ లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ బట్టి చూస్తే.. నటుడు కావాలనేది 60 ఏళ్ల ముత్తయ్య కల. తన ఊరు చెన్నూరుకు ఏ సినిమా షూటింగ్ వాళ్లు వచ్చినా తనకో క్యారెక్టర్ ఇమ్మని అడుగుతుంటాడు. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ చేస్తాడు. నాటకాల్లో మంచి ప్రతిభ ఉంది. కుటుంబం, స్నేహితుల నుంచి సరైన ప్రోత్సాహం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ముత్తయ్య నటుడు అయ్యాడా లేదా అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)