
నిఖిల్ మళియక్కల్ (Nikhil Maliyakkal).. సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఇతడు తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొన్నాడు. ఈ షోలో టాస్కులతో అదరగొట్టిన ఇతడు సీజన్ విజేతగా నిలిచాడు. షోలో ఉన్నప్పుడు తన ప్రేమ కావ్యాన్ని చెప్తూ ఎమోషనలయ్యాడు. నటి కావ్య (kavyashree)ను తలుచుకుంటూ తమకు బ్రేకప్ అయిందన్న విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఎప్పటికైనా తనే భార్య అని.. కాళ్లు పట్టుకుని బతిమాలైనా సరే తన జీవితంలోకి తిరిగి రమ్మంటానని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సీరియల్‌లో ఎంట్రీ
కట్ చేస్తే షో అయిపోయాక కావ్య తనపై ఎంత కోపంగా ఉందో గ్రహించాడు. తను ఎదురుపడితే చాలు ఆగ్రహంతో భగభగా మండిపోతున్నట్లు తెలుసుకున్నాడు. తను తిరిగి జీవితంలోకి రాదని అర్థమై.. ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్‌లో నిఖిల్ ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఎపిసోడ్లలో కనిపించి తర్వాత కనుమరుగయ్యాడు. మరోపక్క అభిమానులేమో నిఖిల్, కావ్యను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు.
మీ ప్రేమ మర్చిపోలేను
ఈ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు నిఖిల్. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో.. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే నాదో చిన్న విన్నపం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. ఎవరి జీవితాలు వాళ్లు గడిపేస్తున్నాం. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. మీ ప్రేమ, సపోర్ట్ నాకెప్పటికీ ఇలాగే కావాలి.
నన్ను వేరేవాళ్లతో లింక్ చేయొద్దు
నేను చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. పని పరంగా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే.. నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి, ఎవరి పోస్టులకూ నన్ను ట్యాగ్ చేయకండి. మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఐ లవ్యూ ఆల్.. అని రాసుకొచ్చాడు. మరి ఇప్పటికైనా నిఖిల్, కావ్య అభిమానులు ఈ జంటను బలవంతంగా కలపడం మానేస్తారేమో చూడాలి!
చదవండి: ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?