
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమాల విడుదలైంది. ఈనెల 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
తాజాగా ఈ మూవీ వసూళ్లను మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ విడుదలైన 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్వీట్ చేసింది. ఈ మార్క్ చేరుకునేందుకు దాదాపు 11 రోజులు పట్టింది. తొలిరోజు కేవలం రూ.11 కోట్లకే పరిమితమైన జాట్ .. నాలుగు రోజులైనా యాభై కోట్ల మార్క్ దాటలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో కేవలం రూ.32.20 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో కేవలం రూ.49.3 కోట్లకు పైగా వసూళ్లకే పరిమితమైంది. కాగా.. ఈ చిత్రం విలన్‌గా రణ్‌దీప్ హుడా నటించారు.
The celebration of mass commercial cinema. A feast for the Single Screens continues 💥💥#JAAT collects 102.13 CRORES GROSS WORLDWIDE ❤🔥
Book your tickets for the MASS FEAST now!
▶️ https://t.co/sQCbjZ5zOE
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand… pic.twitter.com/akWwV9tApq— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025