
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) కొత్త సినిమా 'జాట్'(Jaat) నుంచి థీమ్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichandh Malineni) తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే, తెలుగు వర్షన్ సినిమా విడుదలకు ఇంకాస్త టైమ్ పడొచ్చని సమాచారం. టీజర్, ట్రైలర్, ఊర్వశి రౌతేలా ప్రత్యేకమైన సాంగ్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. జాట్ సినిమాలో రణదీప్ హుడా విలన్‌గా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు.