
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన టాలీవుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్'. గతేడాది మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించారు.
అయితే ఈ సూపర్ హిట్ మూవీఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ టాలీవుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ దాదాపు ఏడాది తర్వాత మరో ఓటీటీలో సందడి చేయనుంది. మే నెల 2వ తేదీ నుంచి సింప్లీ సౌత్ అనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం ఈ ఓటీటీలో విదేశాల్లో నివసించే వారు మాత్రమే చూడొచ్చు. ఇండియాలో ఉండే వారికి సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ కాదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
#OmBheemBush, streaming in Telugu, Tamil and Malayalam on Simply South from May 2 worldwide, excluding India., pic.twitter.com/km7om16Zlf
— Simply South (@SimplySouthApp) April 29, 2025