
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం పశువులకు, గేదెల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచితంగా టీకాలు వేయనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి వైద్య బృందాలు గ్రామాలకు వెళ్లి టీకాలు వేస్తాయి. ఆయా గ్రామాలకు వచ్చినప్పుడు బృందాలకు రైతులు సహకరించి పశువులకు టీకాలను వేయించుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా టీకాల వేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ జీవీ రమేష్, జిల్లా పశువైద్యాధికారి
ఫ బృందాలను ఏర్పాటు చేసిన
పశు సంవర్థక శాఖ
ఫ పశు వైద్యశాలలకు టీకాలు సరఫరా
నల్లగొండ అగ్రికల్చర్ : పశువుల్లో వ్యాప్తి చెందే గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశు సంవర్థక శాఖ టీకాలు వేయనుంది. ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా వేసే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కోసం జిల్లా పశుసంవర్థక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. టీకాలను వేయడానికి జిల్లా వ్యాప్తంగా 90 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పశు వైద్యుడితో పాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పశు వైద్యశాలలకు టీకాలను సరఫరా చేసింది. ఈ నెల 15న మంగళవారం టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మే 15వ తేదీ వరకు నెల రోజుల పాటు (సెలవు దినాలు మినహా) పశువులు, గేదెలకు టీకాలను వేయనున్నారు.
ఉదయం 8 గంటల నుంచే..
జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షలకుపైగా తెల్ల, నల్ల పశువులు ఉన్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది ప్రతి గ్రామానికి ఉదయం 8 గంటలకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు టీకాలు ఉచితంగా వేయనున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లే ముందు రైతులకు ముందస్తుగా సమాచారం అందించనున్నారు. ప్రతి పశువుకూ టీకా వేసేలా పశుసంవర్థక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు