
మూడుచోట్ల ఫారెస్ట్ టోల్‌గేట్లు
నాగార్జునసాగర్: అడవిలో నుంచి వెళ్లే నాగార్జునసాగర్–హైదరాబాద్–నల్లగొండ రహదారిపై అటవీ శాఖ మూడు చోట్ల ఫాస్టాగ్‌లతో కూడిన టోల్‌గేట్‌లను ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ముందు ఒకటి, పెద్దవూర నుంచి నాగార్జునసాగర్‌కు వచ్చే రహదారిలో బెట్టెలతండా సమీపంలో మరొకటి, హాలియా నుంచి నాగార్జునసాగర్‌కు వచ్చే దారిలో కుంకుడుచెట్టుతండా(సమ్మక్క–సారక్క గుడి) సమీపంలో మూడోవది ఏర్పాటు చేశారు. ఆయా టోల్‌గేట్ల గుండా వెళ్లే చిన్న వాహనాలకు రూ.50లు, పెద్ద వాహనాలకు రూ.80 చార్జీలు వసూలు చేసేలా ఫాస్టాగ్‌లను ఏర్పాటు చేశారు. నిత్యం రెండు మూడు సార్లు ఈ రోడ్లపై తిరిగే స్థానికులు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో ఆధార్‌కార్డు, వాహనానికి సంబంధించిన పేపర్లు ఇస్తే వారికి మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా గురువారం వీటిని అధికారులు పరిశీలించారు.
ఫ సాగర్– హైదరాబాద్ రూట్‌లో ఏర్పాటు
ఫ అన్నిచోట్లా ఫాస్టాగ్ సౌకర్యం