ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్‌ లేఖ | Mallikarjun Kharge And Rahul Gandhi Special Parliament Request To Modi On Pahalgam Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్‌ లేఖ

Published Tue, Apr 29 2025 10:31 AM | Last Updated on Tue, Apr 29 2025 11:13 AM

Kharge Rahul Special Parliament Request to Modi on Pahalgam

న్యూఢిల్లీ: పహల్గాం దాడి నేపథ్యంతో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వేర్వేరు ఈ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)కి లేఖలు రాశారు.

2025 ఏప్రిల్ 22న పహల్గాం ఘటన(Pahalgam Incident)లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్‌ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే(Kharge) తన లేఖలో ప్రస్తావించారు.

ఇక తన లేఖలో రాహుల్‌ గాంధీ.. ప్రియమైన ప్రధానిగారూ.. పహల్గాం ఉగ్రదాడితో ప్రతీ భారతీయుడు రగిలిపోతున్నాడు. ఇలాంటి క్లిష్టతరుణంలో ఉగ్రవాదానికి మనమెంత వ్యతిరేకమో చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఐక్యత ప్రదర్శించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. అది పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల మాత్రమే సాధ్యపడుతుందని ప్రతిపక్షంగా మేం భావిస్తున్నాం. ఇక్కడే ప్రజాప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలరు. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అని రాహుల్‌ గాంధీ(Rahul gandhi) రాశారు.  

ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం  ఎలా స్పందిస్తుందో చూడాలి.

పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement