
వారణాసి/భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకకవర్గం వారణాసిలో రూ3,880 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 130 తాగునీటి పథకాలు, 100 అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ వివరించారు. మెహెందీగంజ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారన్నారు. వారణాసిలో సుమారు రెండున్నర గంటలు ప్రధాని గడుపుతారు.