రాణా ప్రతాప్, శివాజీ మన హీరోలు.. ఔరంగజేబ్‌ కాదు: రాజ్‌నాథ్‌  | Rana Pratap, Shivaji Maharaj are national heroes, not Aurangzeb | Sakshi
Sakshi News home page

రాణా ప్రతాప్, శివాజీ మన హీరోలు.. ఔరంగజేబ్‌ కాదు: రాజ్‌నాథ్‌ 

Published Sat, Apr 19 2025 6:22 AM | Last Updated on Sat, Apr 19 2025 9:09 AM

Rana Pratap, Shivaji Maharaj are national heroes, not Aurangzeb

ఛత్రపతి శంభాజీ నగర్‌: రాణా ప్రతాప్‌ సింగ్, ఛత్రపతి శివా­జీ మహారాజ్‌లు మన జాతి హీరోలని, మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నా­రు. మేవాడ్‌ పాలకుడు మహారాణా ప్రతాప్‌ విగ్రహాన్ని శుక్రవారం ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఆయన ఆవిష్కరించారు. జౌరంగజేబ్, బాబర్‌లను శ్లాఘించడం దేశంలోని ముస్లింలను అగౌరవపర్చడమే అవుతుందని చెప్పారు. ‘ధైర్యసాహసాలు, దేశ భక్తికి ప్రతిరూపం మహారాణా ప్రతాప్‌..ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు ముఖ్యంగా గెరిల్లా యుద్దతంత్రంలో ఆయనే స్ఫూర్తి’అని రాజ్‌నాథ్‌ తెలిపారు. 

ఔరంగజేబ్‌ను పొడిగేవారు అతడి గురించి పండిట్‌ నెహ్రూ ఏం రాశారో తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్య్రానంతరం వామపక్ష అనుకూల భావాలు కలిగిన కొందరు చరిత్రకారులు రాణా ప్రతాప్, శివాజీలకు తగు ప్రాధాన్యం ఇవ్వలేదు సరికదా, ఔరంగజేబ్‌ను కీర్తించారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఉపనిషత్తులను అనువదించిన దారా షికోను ఔరంగజేబ్‌ చంపించాడన్నారు. మొఘలులతో జరిగిన మల్దిఘాటి యుద్దంలో రాణా ప్రతాప్‌ సైన్యాధికారి హకీంఖాన్‌ సూరి ప్రాణత్యాగం చేశాడని చరిత్రను మంత్రి గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement