
ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిగా ప్రభాకరరావు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఇంట ర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా బి.ప్రభాకరరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో కొనసాగిన సి.ఎస్.ఎస్.ఎన్.రెడ్డి కడపకు బదిలీపై వెళ్లారు. పాయకాపురం ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రెడ్డికి జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ప్రమోషన్‌పై కడప అధికారిగా నియమితులయ్యారు. ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రభాకరరావుకు ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సి. ఎస్.ఎస్.ఎన్.రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు.