
వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా లారీ ఢీకొని
నర్సంపల్లి గ్రామంలో రైతు మృతి
తూప్రాన్: లారీ కింద పడి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని నర్సంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి నడిమి తండాకు చెందిన కట్రోత్ గోపాల్(55) అనే రైతు టీవీఎస్ వాహనంపై శనివారం నర్సంపల్లి తండాలోని బంధువుల ఇంటికి వివాహానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో వెనుకాల నుంచి లారీ ఢీకొట్టింది. గోపాల్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.
పాముకాటుతో వ్యక్తి..
గజ్వేల్‌రూరల్: పాముకాటు తో వ్యక్తి మృతి చెందిన ఘట న మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పాండవుల శ్రీనివాస్(35)కు భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజు మాదిరిగానే శనివారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా శ్రీనివాస్‌ను పాముకాటు వేసింది. అపస్మారకస్థితిలోకి వెళ్తున్నట్లు గుర్తించి అక్కడే ఉన్న స్థానికులకు సమాచారం అందించాడు. వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం ఆర్‌వీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా లారీ ఢీకొని