తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు

Published Fri, Apr 25 2025 11:33 AM | Last Updated on Fri, Apr 25 2025 11:52 AM

తప్పు

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు

మనోహరాబాద్‌(తూప్రాన్‌): తప్పుడు వార్తలు రాసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన హనోహరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ కథనం ప్రకారం... మండలంలోని కాళ్లకల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అక్రమంగా అనుమతులు ఇచ్చిందని, రెచ్చగొట్టేలా, ఓ యూట్యూబ్‌ చానల్‌లో పార్ట్‌ 1, పార్ట్‌ 2 పేరిట ఓబులేసు లింగంగౌడ్‌ అనే వ్యక్తి టెలికాస్ట్‌ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నీటి సంపులో పడి వ్యక్తి మృతి

ములుగు(గజ్వేల్‌): ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం తున్కిబొల్లారంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బద్దం బలవంతరెడ్డి(34)వ్యవసాయం చేస్తున్నాడు. గురువారం ఉదయం వ్యవసాయ పొలం వద్దగల నీటి సంపులో బోరు మోటరు నడవక పోవడంతో సంపులోకి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. ఇది గమనించిన తమ్ముడు కోటిరెడ్డి విషయాన్ని తన తండ్రి బుచ్చిరెడ్డికి తెలుపగా వారిరువురు కలిసి బలవంతరెడ్డిని నీటి సంపులోనుంచి పైకి తీసి చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య అనూష ఇద్దరు పిల్లలున్నారు.

పిట్టగోడ కూలి గర్భిణి మృతి

వర్షం వస్తుందని దాబా దగ్గర

ఆగిన భార్యాభర్తలు..

టీ తాగుతుండగా గోడ కూలి ప్రమాదం

మునిపల్లి(అందోల్‌): పిట్టగోడ కూలడంతో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని పొల్కంపల్లికి చెందిన మన్నె విజయ్‌, ఆయన భార్య శ్రావణి (గర్భిణి) సదాశివపేట ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. బుదేరా గ్రామానికి సమీపంలోకి రాగానే ఈదురు గాలులు, వర్షం రావడంతో భార్యాభర్తలు ఓ దాబా దగ్గర ఆగి టీ తాగుతున్నారు. అదే సమయంలో దాబా రేకుల షేడ్డు ముందు భాగంతో పాటు పిట్టగోడ కూలి శ్రావణిపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలొదిలింది. కేసు దర్యాప్తులో ఉంది.

మద్యం తాగి కిందపడి వ్యక్తి మృతి

పటాన్‌చెరు టౌన్‌: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కోటేశ్వరరావు వివరాల ప్రకారం... నాగర్‌ కర్నూలు జిల్లా అంబటిపల్లికి చెందిన ఊషయ్య(45) తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామం ఇంద్రపురి కాలనీలో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. ఈనెల 13న మద్యం తాగి కింద పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. పక్కనే ఉన్న మేస్త్రి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అనంతరం అతనికి తల నొప్పి రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్‌ చేసి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టిందని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో 23న ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): కౌడిపల్లి అటవీశాఖ రేంజ్‌ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎఫ్‌ఆర్‌ఓ అర్చన, సిబ్బంది గురువారం సీజ్‌ చేశారు. జలాల్‌పూర్‌, జాకంపల్లి తండాల్లోని అడవిలోని వాగుల నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సీజ్‌చేసి రేంజ్‌ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు  1
1/2

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు  2
2/2

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement