ఆస్ట్రేలియాను వీడనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు.. కారణమిదే? | BCCI releases these three pacers from BGT squad: Reports | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియాను వీడనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు.. కారణమిదే?

Published Sun, Dec 15 2024 9:59 AM | Last Updated on Sun, Dec 15 2024 10:43 AM

BCCI releases these three pacers from BGT squad: Reports

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టులో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. తొలి రోజు వ‌ర్షం కార‌ణంగా కేవ‌లం 13 ఓవ‌ర్ల ఆట మాత్రమే సాధ్య ప‌డ‌గా.. రెండో రోజు మాత్రం వ‌రుణుడు క‌ర‌ణించాడు. 

రెండో రోజు ఆట తొలి సెష‌న్‌లో భార‌త్ పై చేయి సాధించ‌గా.. రెండో సెష‌న్‌లో ఆసీస్ తిరిగి పుంజుకుంది. 62 ఓవ‌ర్ల‌కు ఆసీస్ 3 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. మ‌రోసారి ట్రావిస్ హెడ్‌(71 నాటౌట్‌) సెంచ‌రీ వైపు దూస‌కుపోతున్నాడు. కాగా ఓ వైపు ఈ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా.. మ‌రోవైపు భార‌త క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ ముగ్గురు రిలీజ్‌..?
ఆసీస్‌తో సిరీస్ కోసం ఎంపిక చేసిన భార‌త జ‌ట్టు నుంచి ముగ్గురు పేస‌ర్ల‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ట్రావెలింగ్ రిజర్వ్‌లలో భాగమైన ముఖేష్ కుమార్, యశ్ దయాల్, నవదీప్ సైనీలు ఆసీస్ నుంచి స్వ‌దేశానికి ప‌య‌నం కానున్న‌ట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21 నుంచి మొదలుకానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు భాగం కానున్నారు. 

కాగా తొలుత ముకేశ్ కుమార్‌, నవదీప్ సైనీ, ఖాలీల్ ఆహ్మద్‌లను మాత్రమే సెలక్టర్లు  రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. అయితే నెట్స్‌లో ఖాలీల్ గాయపడటంతో అతడి స్ధానాన్ని యశ్‌దయాల్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. అయితే ఇప్పుడు భారత ప్రధాన జట్టులో బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణల రూపంలో ఐదు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. 

ప్రస్తుతం పరిస్థితులు బట్టి భారత్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌లతో పెద్దగా పనిలేదు. ఈ క్రమంలోనే ఈ పేస్‌ త్రయాన్ని జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరి స్వదేశానికి వచ్చి విజయ్ హజారే ట్రోఫీకి సిద్దం కానున్నారు. ఈ టోర్నీలో దయాల్ ఉత్తరప్రదేశ్ తరపున ఆడనుండగా.. ముఖేష్‌, సైనీలు బెంగాల్‌,  ఢిల్లీ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement