
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నైసూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం(ఏప్రిల్ 5) చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సీఎస్‌కేకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది.
గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైక్వాడ్ కుడి మోచేయికి గాయమైంది. దీంతో అతడు అప్పటి నుంచి నెట్‌ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు. తాజాగా రుతురాజ్ అందుబాటుపై సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ రుతురాజ్ దూరమైతే అతడి స్ధానంలో ఎంఎస్ ధోని సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముందని హస్సీ తెలిపాడు.
"రేపటి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. అతడు ఎంపిక అనేది కోలుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా అతడు నొప్పితో బాధపడుతున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తను ఆడకపోతే, ఎవరు నాయకత్వం వహిస్తారో మేము ఇంకా నిర్ణయించలేదు. కానీ యువ వికెట్ కీపర్ ధోని కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు" అని హస్సీ పేర్కొన్నాడు. కాగా రుతురాజ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్‌పై ఓటమి పాలైనప్పటికి రుతు 61 పరుగులతో రాణించాడు.
కాగా ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌కు సీఎస్‌కే చాలా కీలకం.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), జామీ ఓవర్‌టన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, షేక్‌రన్ కాన్‌వే, షేక్‌రాన్ కాన్‌వే, సమ్‌కో కాన్‌వే శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి, దీపక్ హుడా
చదవండి: IPL 2025: ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం