Ruturaj Gaikwad
-
IPL 2025: రాయల్స్ చేతిలో పరాజయం.. సెంచరీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల సెంచరీని పూర్తి చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో సీఎస్కే ఈ ల్యాండ్ మార్కును తాకింది. తద్వారా ఐపీఎల్లో 100 పరాజయాలు పూర్తి చేసుకున్న ఏడో జట్టుగా నిలిచింది. సీఎస్కేకు ముందు ఢిల్లీ (134), పంజాబ్ (133), ఆర్సీబీ (128), కేకేఆర్ (118), ముంబై ఇండియన్స్ (117), రాజస్థాన్ రాయల్స్ (108) 100 పరాజయాల మార్కును తాకాయి. మధ్యలో రెండు సీజన్లు మినహా ఐపీఎల్ మొత్తంలో పాల్గొన్న సీఎస్కే ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడి 139 విజయాలు, 100 పరాజయాలను ఎదుర్కొంది. ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. ముంబై (142) టాప్‌లో ఉండగా.. సీఎస్కే (139), కేకేఆర్ (131), ఆర్సీబీ (123), ఢిల్లీ (114), రాజస్థాన్ (111), పంజాబ్ (110) వరుస స్థానాల్లో ఉన్నాయి.కాగా, ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచిన ఆ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో నితీశ్‌తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్), జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), ధోని (11 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) పోరాడినా లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాయల్స్ బౌలర్లలో హసరంగ (4-0-35-4), ఆర్చర్ (3-1-13-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్లో సీఎస్కే గెలుపుకు అవసరం కాగా.. సందీప్ శర్మ 13 పరుగులకే ఇచ్చి రాయల్స్‌కు ఈ సీజన్లో తొలి గెలుపును అందించాడు. -
RR VS CSK: మేము చరుగ్గా లేము.. అందుకు సంతోషమే: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాయల్స్ కీలకమైన క్షణాలన్నిటినీ అధిగమించి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో రాయల్స్‌కు ఇది తొలి విజయం.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాయల్స్ ఊహించిన దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో నితీశ్‌తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నితీశ్‌ను ఔట్ చేశాక సీఎస్కే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకుంది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసింది. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను ఈ సీజన్లో చెత్త ఫామ్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. సీఎస్కే గెలుపుకు చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండింది. ధోని, జడ్డూ క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నిలబడితే సీఎస్కే ఎలాగైనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే తీక్షణ మ్యాజిక్ చేశాడు. 18వ ఓవర్లో అతను కేవలం 6 పరుగులే ఇచ్చి సీఎస్కేకు లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో జడ్డూ, ధోని చెలరేగగా (బౌండరీ, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో సీఎస్కే లక్ష్యం 20 పరుగులుగా మారింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్‌కు (3-1-13-1) చివరి ఓవర్ ఇవ్వకుండా రాయల్స్ కెప్టెన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్‌కు బదులుగా సందీప్ శర్మను నమ్ముకోగా.. అతను కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే ధోని వికెట్ తీసి ఆతర్వాత రెండు బంతులను సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే గెలుపుకు చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు అవసరమయ్యాయి. అక్కడికీ ఓవర్టన్ నాలుగో బంతికి సిక్సర్ బాది సీఎస్కే గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే ఐదో బంతికి రెండు పరుగులే రావడంతో సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. చివరి ఓవర్‌ను సందీప్ శర్మకు ఇవ్వడంతో టెన్షన్ పడ్డ రాయల్స్ అభిమానులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు (రెండు మ్యాచ్‌ల తర్వాత) రియాన్ పరాగ్ కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపు సొంత అభిమానుల మధ్య దక్కడం అతనికి మరింత స్పెషల్.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతని ఆటతీరు అమోఘం. నితీశ్ ఎక్కువగా వెనుక భాగంలో షాట్లు ఆడుతున్నాడని తెలిసి కూడా మేము చురుగ్గా లేము. అతన్ని వికెట్‌కు ముందు ఆడించే ప్రయత్నం చేసుండాల్సింది. మిస్ ఫీల్డ్‌ల ద్వారా అదనంగా 8-10 పరుగులు సమర్పించుకున్నాము. ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి. ఈ వికెట్‌పై 180 పరుగులు ఛేదించదగ్గ టార్గెటే. ఇన్నింగ్స్ బ్రేక్‌లో సంతోషపడ్డాను. వారు 210 పరుగులకు పైగా స్కోర్ చేస్తారని అనుకున్నాను. మా బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. జరగాల్సిన నష్టం ఆదిలోనే జరిగిపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత కొన్ని సీజన్లలో రహానే 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాయుడు మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకునేవాడు. నేను కూడా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని భావించాము. అయితే అది వర్కౌట్ కాలేదు. మూడు మ్యాచ్‌ల్లోనూ ఆట ప్రారంభంలోనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. వేలం సమయంలోనే నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని నిర్ణయించబడింది. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు ఈ సీజన్లో మాకు మంచి ఆరంభాలు లభించడం లేదు. ఒక్కసారి మా ఓపెనర్లిద్దరూ టచ్‌లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఎప్పటిలాగే నూర్ బాగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, జడ్డూ కూడా సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో కొంత ఊపు అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా రాణిస్తే మా జట్టుకు తిరుగుండదు. -
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
ఐపీఎల్-2025లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) రాణించారు.ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. Back 2️⃣ back wins! 🔥Chat, how are we feeling? 🤩pic.twitter.com/8xT6VaS7hf— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025 చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.జడేజాతో ముచ్చట్లుఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. ఇంతలో అక్కడికి చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ రాగానే కోహ్లి మరింత సీరియస్ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్‌రూమ్ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’కాగా చెన్నై బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఖలీల్.. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ కూడా తానే వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) చేసినట్లుగా భావించిన ఖలీల్.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.అయితే, అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్ అంపైర్ తీర్పు వచ్చింది. బంతి లెగ్ స్టంప్ ఆవలి దిశగా పిచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్ అవ్వగా.. సీఎస్కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్‌తో సీరియస్‌గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! Kohli mere bacche shant hoja 😭😭 pic.twitter.com/yGITzOsOXr— n (@humsuffer_) March 29, 2025 -
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కంచుకోటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్ సేన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడింది. చెపాక్‌లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపులుతాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.ధోని ధనాధన్ సరిపోలేదుమిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అవుట్‌డేటెడ్ అంటూ సెటైర్లుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.మీ బ్రాండ్ క్రికెట్ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్ క్రికెట్ అంటే ఏమిటి? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.మమ్మల్ని తక్కువ చేయకండితొలి బంతి నుంచే మేము స్వింగ్ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్) అంటారు.మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. చెపాక్‌లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
ఈ పిచ్‌పై 170 పరుగులే ఎక్కువ.. ఇంకా భారీ తేడాతో ఓడిపోనందుకు సంతోషించాలి: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ప్రారంభించింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం సీఎస్కే బొక్క బోర్లా పడింది. నిన్న (మార్చి 28) సొంత మైదానం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ సేన ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని (50 పరుగుల తేడాతో) ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన సీఎస్కే స్థాయి తగ్గట్టుగా ఆడలేకపోయింది. తొలుత బౌలింగ్‌లో పట్టులేక ప్రత్యర్ధిని 196 పరుగులు చేయనిచ్చింది. ఆతర్వాత ఛేదనలో కనీస పోరాటం కూడా ప్రదర్శించలేక 146 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌తో పోలిస్తే సీఎస్కే బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే కాస్త పోరాడే ప్రయత్నం చేశాడు. చివర్లో ధోని (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించినా అప్పటికే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్‌లోనూ దారుణంగా విఫలమైంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడంతో పాటు లేని పరుగులు సమర్పించుకుంది.మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వాస్తవానికి ఈ వికెట్‌పై 170 పరుగులే చాలా ఎక్కువ. అలాంటిది ఆర్సీబీ 196 పరుగులు చేసి, మా బ్యాటింగ్‌ను మరింత సంక్లిష్టం చేసింది. వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు ఫీల్డింగ్‌లోనూ మేము గొప్పగా లేము. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులను ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లేలో మా బ్యాటింగ్ స్టయిల్ భిన్నంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. తొలి ఐదు ఓవర్లు కొత్త బంతి కూడా ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. రాహుల్ త్రిపాఠి, నేను చాలా కాన్ఫిడెంట్‌గా షాట్లు ఆడాము. కానీ వర్కౌట్ కాలేదు. మా స్పిన్ త్రయాన్ని ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేశాము. అది కూడా మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్ కోసం మానసికంగా సిద్దంగా ఉండాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెడు రోజు ఉంటుంది. మేము ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి.రచిన్ సరిగ్గా ముందుకు సాగలేకపోయాడు. హుడా పరిస్థితి కూడా అలాగే ఉండింది. దూబే నుంచి ప్రామిసింగ్ ఇన్నింగ్స్ ఆశించాము. యశ్ దయాల్ డబుల్ స్ట్రయిక్ (ఒకే ఓవర్లో 2 వికెట్లు) మా ఓటమిని ఖరారు చేసింది. చివర్లో జడేజా, ధోని భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్‌గా ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది. -
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఈసారి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వినికిడి.అదేవిధంగా ఏ కేటగిరీలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను A+ కేటగిరీకి బీసీసీఐ ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టీ20లకు విడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు A+ కేటగిరీలు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే A+ కేటగిరీలో కొనసాగాలంటే మూడు ఫార్మాట్లో ఆడాల్సిందే. రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రుతురాజ్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడికి వచ్చిన అవకాశాలను కూడా గైక్వాడ్ సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతేడాది అతడు భారత్ తరపున కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. చివరగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున రుతురాజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 133 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా గైక్వాడ్ తన కెరీర్లో ఇప్పటివరకు భారత్ తరపున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. కాగా గైక్వాడ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ముంబై ఇండియన్స్ (MI)మధ్య పోరు అని చెప్పవచ్చు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్-2025లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన తీరు ఇందుకు నిదర్శనం.ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే స్టార్లు రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53)ల మెరుపులు.. మహేంద్ర సింగ్ ధోని మెరుపు స్టంపింగ్‌లతో పాటు.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ కుర్రాడు హైలైట్‌గా నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ధోని చేత ప్రశంసలు అందుకున్నాడు.ఇంతకీ ఎవరా ప్లేయర్?అతడిపేరు విఘ్నేశ్ పుతూర్. లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ కుర్ర బౌలర్ స్వస్థలం కేరళలోని మలప్పురం. పదకొండేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన విఘ్నేశ్.. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దృష్టిని ఆకర్షించాడు.అతడి ప్రతిభకు ఫిదా అయిన ముంబై యాజమాన్యం.. ఇంతవరకు కేరళ తరఫున కనీసం దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టకపోయినప్పటికీ... ఐపీఎల్ కాంట్రాక్టు ఇచ్చింది. రూ. 30 లక్షలకు ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసింది.ఈ క్రమంలో పద్దెనిమిదవ ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా సీఎస్కేతో పోరు సందర్భంగా విఘ్నేశ్‌ను బరిలోకి దించింది. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన ఈ స్పిన్ బౌలర్.. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే (9), దీపక్ హుడా (3) రూపంలో మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.చెన్నై చేతిలో ముంబై సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందా? అనే పరిస్థితి నుంచి .. చివరి ఓవర్ దాకా మ్యాచ్ సాగేలా చేయడంలో విఘ్నేశ్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అతడి భుజం తట్టి శెభాష్ అంటూ తలా.. ఈ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.The men in 💛 take home the honours! 💪A classic clash in Chennai ends in the favour of #CSK ✨Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/ZGPkkmsRHe— IndianPremierLeague (@IPL) March 23, 2025 తండ్రి ఆటో డ్రైవర్.. కొడుకు ఐపీఎల్ స్టార్అన్నట్లు విఘ్నేశ్ పుతూర్ తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే ఆయన.. కొడుకులోని ప్రతిభను గుర్తించి క్రికెట్ ఆడేలా ప్రోత్సహించాడు. కేరళ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో మీడియం పేసర్ బౌలర్ నుంచి స్పిన్నర్‌గా మారిన విఘ్నేశ్ ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. కలకాలం గుర్తుండిపోతుంది!‘‘ధోని.. విఘ్నేశ్ పుతూర్ భుజం తట్టి అభినందించాడు. నాకు తెలిసి తన జీవితకాలం ఈ కుర్రాడు ఈ సంఘటనను గుర్తుంచుకుంటాడు’’- కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును.. విఘ్నేశ్ పుతూర్‌కు ఇది లైఫ్‌టైమ్ మొమరీగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, ఈ సీజన్లో బౌలర్‌గా తనదైన ముద్ర వేయగలిగితే.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాలో చోటు సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో.. త్వరలోనే విఘ్నేశ్ కూడా చేరే అవకాశాలను కొట్టిపారేయలేము!! ఏమంటారు?!ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై👉టాస్: చెన్నై.. తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 155/9 (20)👉చెన్నై స్కోరు: 158/6 (19.1)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/18).చదవండి: జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి? -
IPL 2025: ఈ ఏడాది ధోని మరింత ఫిట్‌గా ఉన్నాడు.. యవ్వనంగా కనిపిస్తున్నాడు: రుతురాజ్
ఐపీఎల్-2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడటం ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా 13వ సారి. ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ నుంచి ఇప్పటివరకు ముంబైతో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఏడింట విజయాలు సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో సీఎస్కేను అరంగేట్రం ఆటగాడు నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనలతో గెలిపించారు.తొలుత నూర్ (4-0-18-4) తన మాయాజాలం ప్రదర్శించి ముంబైని 155 పరుగులకే పరిమితం చేయగా.. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ బ్యాటింగ్ విన్యాసాలతో సీఎస్కేను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ (4-0-29-3) కూడా రాణించాడు. ధోని మెరుపు స్టంపింగ్ (సూర్యకుమార్ యాదవ్) చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.ఈ మ్యాచ్‌లో ముంబై స్వల్ప స్కోర్‌కే పరిమితమైనా.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ముంబై బౌలర్లు సీఎస్కేను అంత ఈజీగా గెలవనివ్వలేదు. రుతురాజ్ క్రీజ్‌లో ఉన్నంత సేపు సీఎస్కే వైపే ఏకపక్షంగా సాగిన మ్యాచ్.. ఆతను ఔటయ్యాక మలుపులు తిరిగింది. ఓ దశలో ముంబై అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) రెచ్చిపోవడంతో సీఎస్కే కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (17) రనౌట్ కావడంతో ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. ధోని బ్యాటింగ్‌కు దిగినా పరుగులేమీ చేయలేదు (2 బంతులు ఎదుర్కొని). ధోని రాకతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను తెగ ఇబ్బంది పెట్టారు. అంతకుముందు ముంబై బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటై నిరాశపర్చగా.. విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. మరింత క్లినికల్‌గా ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ ఆట ఇలాగే సాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో రావడంపై స్పందిస్తూ.. అది జట్టు అవసరం. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. నా స్థానాన్ని మార్చుకోవడం (గతంలో ఓపెనర్‌గా వచ్చే వాడు) పట్ల నాకు ఎలాంటి బాధ లేదు. వాస్తవానికి ఇంకా సంతోషంగా ఉంది.స్పిన్నర్లు సరైన పాయింట్‌పై ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వారు ముగ్గురు (నూర్, అశ్విన్, జడేజా) మంచి లయతో బౌలింగ్ చేశారు. ఇది మాకు శుభసూచకం. ఖలీల్ అనుభవజ్ఞుడు. అతని అనుభవం మాకు కలిసొచ్చింది. నూర్ ఓ ఎక్స్ ఫ్యాక్టర్, అందుకే అతన్ని జట్టులో చేర్చుకోవాలనుకున్నాము. అశ్విన్ జట్టులో ఉండటం మాకు బలాన్ని ఇస్తుంది. ధోని ఈ సంవత్సరం మరింత ఫిట్‌గా ఉన్నాడు. అతను ఇప్పటికీ యవ్వనంగా కనిపిస్తున్నాడు. -
వరుసగా 13వ ఏడాది...
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై... బౌలింగ్‌లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చెన్నై: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. 2012 ఐపీఎల్లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ యువతార ఠాకూర్ తిలక్ వర్మ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) దూబే (బి) ఖలీల్ 0; రికెల్టన్ (బి) ఖలీల్ 13; జాక్స్ (సి) దూబే (బి) అశ్విన్ 11; సూర్యకుమార్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 29; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) నూర్ 31; రాబిన్ (సి) జడేజా (బి) నూర్ 3; నమన్ (బి) నూర్ 17; సాంట్నర్ (ఎల్బీ) (బి) ఎలీస్ 11; దీపక్ చాహర్ (నాటౌట్) 28; బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–36, 4–87, 5–95, 6–96, 7–118, 8–128, 9–141. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–29–3; స్యామ్ కరన్ 1–0–13–0; ఎలీస్ 4–0–38–1; అశ్విన్ 4–0– 31–1; జడేజా 3–0–21–0; నూర్ అహ్మద్ 4–0– 18–4. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (నాటౌట్) 65; రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) చాహర్ 2; రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53; దూబే (సి) తిలక్ వర్మ (బి) విఘ్నేశ్ 9; దీపక్ హుడా (సి) సత్యనారాయణ (బి) విఘ్నేశ్ 3; కరన్ (బి) జాక్స్ 4; జడేజా (రనౌట్) 17; ధోని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–95, 4–107, 5–116, 6–152. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–0; చాహర్ 2–0–18–1; సత్యనారాయణ 1–0–13–0; సాంట్నర్ 2.1–0–24–0; జాక్స్ 4–0–32–1; విఘ్నేశ్ 4–0–32–3; నమన్ 3–0–12–0. ఐపీఎల్లో నేడుఢిల్లీ X లక్నో వేదిక: విశాఖపట్నంరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్-2025లో బోణీ కొట్టిన సీఎస్కే.. ముంబైపై విక్టరీ
ఐపీఎల్-2025ను చెన్నై సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ఆరంభించింది. చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓ దశలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి.. రవీంద్ర మాత్రం ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను ముగించాడు.ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జాక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ(0) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఇక సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: IPL 2025: వారెవ్వా ధోని.. కేవలం 0.12 సెకన్లలోనే! వీడియో వైరల్ -
IPL 2025: స్పిన్-టు-విన్ వ్యూహం.. ఆరో టైటిల్‌కు గురి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). రికార్డు స్థాయిలో ఆరవ టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈసారి బరిలోకి దిగుతోంది. 2024లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన బాధ ఇంకా చెన్నై ఆటగాళ్ల మనసులో కదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి పూర్వ వైభవం సాధించాలని సీఎస్కే పట్టుదలతో ఉందనడంలో సందేహం లేదు.యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌కు ముందు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంత అనుభవం గడించిన నేపథ్యంలో ఈ సీజన్లో కొత్త కెప్టెన్ మరింత మెరుగ్గా వ్యవహరించే అవకాశముందని భావిస్తున్నారు. కాగా.. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ స్థానాన్ని కూడా సాధించలేకపోయింది.7 విజయాలు, 7 ఓటములతో కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించి గత సీజన్లో పేలవంగా ఐదో స్థానం తో ముగించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న చెన్నైలోని ఎం ఎ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.స్పిన్-టు-విన్ వ్యూహంఈ నేపథ్యంలో ఈ సారి భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరియు చెన్నై అభిమానుల ఫేవరెట్ ఆటగాడు సామ్ కుర్రాన్‌తో సహా అనేక సుపరిచితమైన ఆటగాళ్లను చెన్నై మళ్ళీ జట్టులోకి తీసుకుంది. భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెనుక నుంచి తన వ్యూహరచనలో జట్టును ముందుండి నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇక జట్టును చూస్తే, గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చిన 'స్పిన్-ట్రిక్' కు కట్టుబడి ఉండాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రవీంద్ర జడేజా, న్యూజిలాండ్‌కు చెందిన భారత్ సంతతి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రతో పాటు నూర్ అహ్మద్, అశ్విన్‌లను చేర్చడం, ముఖ్యంగా సొంత గడ్డ పై గరిష్ట ప్రభావాన్ని చూపడానికి టర్నర్లను ఉపయోగించాలనే వారి ధోరణిని గుర్తుచేస్తుంది.అశ్విన్, నూర్ లతో పాటు జడేజా ఎడమచేతి ఫింగర్స్పిన్, గోపాల్ లెగ్‌స్పిన్, ఇంకా దీపక్ హుడా పార్ట్-టైమ్ ఆఫ్‌స్పిన్ వంటి బౌలర్లు చెన్నై స్పిన్ బౌలింగ్ కి వెరైటీ సమకూరుస్తున్నారు. ఇది చెపాక్‌లో స్పిన్-టు-విన్ వ్యూహానికి సరిగ్గా సరిపోతుంది.బలీయంగా కనిపిస్తున్న బ్యాటింగ్ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, న్యూ జిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి బ్యాటింగ్‌ను ప్రారంభించే అవకాశముంది. ఈ జంట 2023 సీజన్లో చాలా విజయవంతమైంది. కానీ గత సీజన్లో గాయం కారణంగా కాన్వే ఆడలేక పోయాడు. ఈ సీజన్లో ఈ ఇద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో చెన్నై మళ్ళీ పుంజుకోవాలని భావిస్తోంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజృంభించిన ఆడిన రచిన్ రవీంద్రను మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది.కీలకమైన నాల్గవ స్థానంలో దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి లేదా విజయ్ శంకర్ ఒకరు వచ్చే అవకాశముంది. ఆ తర్వాత హార్డ్ హిట్టింగ్ శివమ్ దూబేను ఐదవ స్థానంలో, ఆ తర్వాత ఆరో స్థానంలో వచ్చే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ తన నైపుణ్యంతో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. జడేజా తర్వాత, ఎంఎస్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో గత సీజన్లో కీలక పాత్ర పోషించిన ధోని మరోసారి ప్రభావం చూపే అవకాశం ఉంది.జట్టులో ప్రధాన ఆటగాళ్ళు:రుతురాజ్ గైక్వాడ్: గత కొన్ని సీజన్లగా చెన్నై తరఫున నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నవారిలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. రుతురాజ్ తన జట్టు బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలిచాడు, 41.75 సగటుతో మరియు 136.86 స్ట్రైక్ రేట్‌తో 2380 పరుగులు సాధించాడు. అతని నాయకత్వంలో పసుపు బ్రిగేడ్ గత సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయినా, గైక్వాడ్ ఈ సీజన్లో మెరుగైన ఆటతీరుతో చెన్నై ని ముందుకు నడిపించాలని పట్టుదలతో ఉన్నాడు.రవిచంద్రన్ అశ్విన్: అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్, తన కెరీర్ ప్రారంభ దశలో తనను వెలుగులోకి తెచ్చిన ఫ్రాంచైజీ అయిన చెన్నై కి ఐపీఎల్ టైటిల్‌ను అందించాలని భావిస్తున్నాడు. 212 మ్యాచ్‌ల్లో 7.12 ఎకానమీ రేటుతో 180 వికెట్ల తో అశ్విన్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఆఫ్ స్పిన్నర్ తాను బ్యాట్‌తో దూకుడుగా ఉండగలనని మరియు అవసరమైనప్పుడు ఫ్లోటర్‌గా వ్యవహరించగలనని చూపించాడు.నాథన్ ఎల్లిస్: వేగంగా బౌలింగ్ చేయగల మరియు తన వైవిధ్యాలను చాలా చక్కగా ఉపయోగించుకునే సామర్థ్యంతో, నాథన్ ఎల్లిస్ చెన్నై జట్టులో కీలకమైన బౌలర్‌గా రాణిస్తాడని భావిస్తున్నారు.శివం దూబే: దూకుడుతో బ్యాటింగ్ చేసే శివం దూబే చెన్నై జట్టుకు మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు. సూపర్ కింగ్స్ తరఫున 39 ఇన్నింగ్స్‌లలో 34.47 సగటు మరియు 159.16 స్ట్రైక్ రేట్‌తో 1103 పరుగులు చేశాడు. చెన్నై జట్టుకి మిడిల్ ఓవర్లలో శివం దూబే ను గేమ్-ఛేంజర్ గా భావించవచ్చు.రాహుల్ త్రిపాఠి: డైనమిక్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడు లేక నాలుగో స్థానంలో ఆడే అవకాశముంది. త్రిపాఠి ఐపీఎల్లో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 27.27 సగటుతో, 139.3 స్ట్రైక్ రేట్‌తో 2236 పరుగులు చేశాడు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్.చదవండి: అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే: సీఎస్కే మాజీ స్పిన్నర్ -
కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెమినిదవ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శనివారం (మార్చి 22) ఐపీఎల్-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్‌కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్ స్టార్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?కోల్‌కతా నైట్ రైడర్స్2012, 2014 2024లో చాంపియన్‌గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది.మెగా వేలం-2025లో తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్ అయ్యర్ జీతం రూ.23.75 కోట్లు.సన్‌రైజర్స్ హైదరాబాద్గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈసారీ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడం గమనార్హం.రాజస్తాన్ రాయల్స్ఐపీఎల్ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ను తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ఈసారి కెప్టెన్‌ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్‌కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.గుజరాత్ టైటాన్స్అరంగేట్ర సీజన్లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్‌ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.ముంబై ఇండియన్స్ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని.. గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్‌ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్ పాటిదార్‌ను సారథిగా నియమించింది. విరాట్ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది. అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’!
క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రూపంలో మెగా ఈవెంట్ సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నమెంట్ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొనున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... అదే విధంగా గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలు వెల్లడించింది.అయితే, టీమిండియాలో ప్రతిభ గల ఆటగాళ్లకు కొదవలేదు. కానీ కొన్ని సందర్భాల్లో తుదిజట్టు కూర్పు, పిచ్ స్వభావం, టోర్నీకి ముందు ప్రదర్శన.. తదితర అంశాల ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికకాని స్టార్లు చాలా మందే ఉన్నారు. మరి వారితో కూడిన భారత జట్టు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూద్దామా?..ఓపెనర్లుగా ఆ ఇద్దరురుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)లను ఓపెనర్లుగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. రుతు లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో 56.15 సగటు కలిగి ఉండి.. ఫార్మాట్ చరిత్రలోనే అత్యధిక యావరేజ్ కలిగిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.మరోవైపు జైస్వాల్ బ్యాటింగ్ సగటు కూడా ఇందులో 52.62గా ఉంది. 33 మ్యాచ్‌లు ఆడిన అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి ఇక వీరిద్దరికి అభిషేక్ శర్మను బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకోవచ్చు.వికెట్ కీపర్‌గా ఇషాన్మరో ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేయవచ్చు. వన్డేల్లో అతడి ఖాతాలో ఏకంగా ద్విశతకం ఉంది. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్-2023లోనూ ఆడిన అనుభవం కూడా పనికి వస్తుంది.శతకాల ధీరుడు లేకుంటే ఎలా?ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. కరుణ్ నాయరే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అతడు పరుగుల వరద పారించాడు. తాజా సీజన్లో ఏకంగా ఐదు శతకాలు బాది 750కి పైగా పరుగులు చేశాడు. కానీ అతడిని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు.ఏదేమైనా మిడిలార్డర్లో తిలక్ వర్మతో కలిసి కరుణ్ నాయర్ ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక ఆల్రౌండర్లుగా శివం దూబే, రియాన్ పరాగ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. వీరిద్దరు గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడారు.బౌలర్ల దళంచాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు దుబాయ్ వేదికగా కాబట్టి పరాగ్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకుంటే బెటర్. యుజువేంద్ర చహల్‌తో పాటు ఆర్. సాయికిషోర్ ఇక్కడ మన ఛాయిస్. ఈ ముగ్గురు మూడు రకాల స్పిన్నర్లు.పరాగ్ రైట్, కిషోర్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయితే.. చహల్ మణికట్టు స్పిన్నర్.. వీరికి బ్యాకప్‌గా రవి బిష్ణోయి ఉంటే సానుకూలంగా ఉంటుంది.ఇక పేసర్ల విషయానికొస్తే.. ముగ్గురు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. మహ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ కృష్ణ.. వీరికి బ్యాకప్‌గా ఆవేశ్ ఖాన్. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇక యశస్వి జైస్వాల్‌తో పాటు శివం దూబే చాంపియన్స్ ట్రోఫీ నాన్- ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక కాని, అత్యుత్తమ భారత తుదిజట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, కరుణ్ నాయర్, శివమ్ దూబే*, రియాన్ పరాగ్, ఆర్. సాయి కిషోర్, యుజువేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్*, ప్రసిద్ కృష్ణ.బెంచ్: అభిషేక్ శర్మ, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
బరోడాను చిత్తు చేసిన రుతురాజ్ టీమ్.. ఏకంగా 439 పరుగులతో
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా నాసిక్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 439 పరుగుల తేడాతో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. 617 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి 5 వికెట్లు పడగొట్టగా.. రజనీష్ గుర్బానీ మూడు వికెట్లు, రామక్రిష్ణ రెండు వికెట్లు సాధించారు.బరోడా బ్యాటర్లలో అతి సేథ్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..జ్యోత్స్నిల్ సింగ్(40) పరుగులతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా(12, 6) తీవ్ర నిరాశపరిచాడు. కాగా మహారాష్ట్ర జట్టు 464/7 వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహారాష్ట్ర బ్యాటర్లలో సౌరభ్ నవలే(126) సెంచరీతో మెరవగా..రామక్రిష్ణ(99), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(89) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 152 పరుగుల ఆధిక్యాన్ని జోడించి బరోడా ముందు 617 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని బరోడా చేధించడంలో చతకలపడింది. కాగా మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా..బరోడా 145 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా -
జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?: అశ్విన్
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సెలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతలు చేపట్టబోనని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉండటం తలనొప్పితో కూడిన పని అని అశూ వ్యాఖ్యానించాడు.ఆచితూచి...భారత్‌లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని.. అయితే, వారిలో ఎవరిని జట్టుకు ఎంపిక చేయాలనేది ఎల్లప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఓ ఆటగాడి వైపు మొగ్గు చూపేటపుడు ప్రదర్శన, ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగానే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.కాగా ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్లను ప్రకటించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించే ఎక్కువగా చర్చముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కని సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో వన్డేల్లోనైనా అవకాశం ఇవ్వాల్సిందని కొంతమంది అభిప్రాయపడగా.. సంజూ శాంసన్‌కు ఈసారీ అన్యాయం జరిగిందంటూ సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.వన్డేల్లో రిషభ్ పంత్ కంటే మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్ కోటాలో చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టీ20లకి తిరిగి వస్తే.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ పరిస్థితి ఏమిటి?వీరే కాకుండా ఓపెనింగ్ కోటాలో రుతురాజ్ గైక్వాడ్‌కు దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? దేశవాళీ క్రికెట్ వన్డే ఫార్మాట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్‌ను సెలక్టర్లు కనికరించకపోవడానికి కారణం? .. ఇలాంటి చర్చలు భారత క్రికెట్ వర్గాల్లో జరుగుతున్నాయి.జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంతర్జాతీయ టీ20లలోకి యశస్వి జైస్వాల్ తప్పక తిరిగి రావాలి. అతడు వరల్డ్ కప్ జట్టులో ఉన్న వ్యక్తి. మొదటి ప్రాధాన్యం కలిగిన ఓపెనర్.ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్లో శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భారీగా పరుగులు చేస్తే.. సెలక్టర్లకు తలనొప్పి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా లేదంటే.. టీమ్ మేనేజర్‌గా.. అదీ కాదంటే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందంలో ఉండే అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు తీసుకోను.ప్రతిభ ఉన్న క్రికెటర్లకు కొదువలేకపోవడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, సెలక్టర్లకు మాత్రం ఇది ఒక సమస్య. ఏదేమైనా.. పోటీలో ఉన్న ఆటగాళ్లందరి ప్రదర్శన, ప్రధాన టోర్నమెంట్లో ఒత్తిడిని ఏమేరకు జయించగలరన్న అంశాల ఆధారంగా ఎంపిక చేస్తే బాగుంటుంది.క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించగలిగే వాళ్లకే పెద్దపీట వేయాలి. ఎవరు గొప్ప ఆటగాడు అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చే కొలమానాలు ఏవీ లేవు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, అరుదైన నైపుణ్యాలు, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.ఈ సిరీస్‌తో షమీ రీఎంట్రీఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.స్టార్ క్రికెటర్లు దూరంవన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20లకు యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.శివం దూబేకు దక్క ని చోటుఅయితే, ఈ జట్టులో భారత ఆల్‌రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.అలాగే రజత్ పాటిదార్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 ప్రపంచకప్ చాంపియన్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు. అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత.. విధ్వంసకర శతకం! సెలక్టర్లకు మెసేజ్
విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారీ శతకం(Ruturaj Gaikwad Century) బాదాడు. సర్వీసెస్ జట్టు బౌలింగ్‌పై విరుచుకుపడుతూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి మహారాష్ట్రను విజయతీరాలకు చేర్చాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ(Vijay Hazare Trophy 2024-25)లో భాగంగా మహారాష్ట్ర.. సోమవారం సర్వీసెస్‌తో తలపడింది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది.రాణించిన సర్వీసెస్ కెప్టెన్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు సర్వీసెస్ 204 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మోహిత్ అహ్లావత్(61) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్ సూరజ్ వశిష్ట్(22), మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పలివాల్(22), అర్జున్ శర్మ(24), పూనం పూనియా(26) ఫర్వాలేదనిపించారు.మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ దాధే, సత్యజీత్ బచ్చవ్ మూడేసి వికెట్లు కూల్చగా.. ముకేశ్ చౌదరి రెండు, అజిమ్ కాజీ, రజ్నీశ్ గుర్బానీ ఒక్కో వికెట్ తీశారు. వీరి దెబ్బకు 48 ఓవర్లలోనే సర్వీసెస్ బ్యాటింగ్ కథ ముగిసింది.57 బంతుల్లోనే రుతు శతకంఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 20.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విశ్వరూపం ప్రదర్శించాడు. 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రుతు.. మొత్తంగా 74 బంతుల్లో 16 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 148 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఓం భోస్లే(24) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ 22 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇక మహారాష్ట్రను ఒంటి చేత్తో గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మెగా టోర్నీకి రెడీఇక ఈ టోర్నీలో మహారాష్ట్రకు ఇది రెండో విజయం. తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్ర రాజస్తాన్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు రుతురాజ్ బ్యాట్ ఝులిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఫామ్ కొనసాగిస్తే మెగా టోర్నీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా తన భారీ సెంచరీతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడని పేర్కొంటున్నారు.చదవండి: నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. సుడిగాలి ఇన్నింగ్స్!
భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్ అవుట్ కావడం దురదృష్టకరం.కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్‌క్లాస్ క్రికెట్)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.48 బంతుల్లోనే 97 పరుగులుఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్‌తో మ్యాచ్ సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.ఇక 202కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ మోహిత్ రాఠీ బౌలింగ్‌లో వికాస్ హథ్వాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి విఫలంమిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32), ధన్‌రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
మహారాష్ట్ర కెప్టెన్‌గా రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 కోసం మహారాష్ట్ర జట్టును నిన్న (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల మేళవింపుగా ఉంది. అంకిత్ బవానే, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ చౌదరీ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. నిఖిల్ నాయక్, ధన్‌రాజ్ షిండే వికెట్కీపర్లుగా ఎంపికయ్యారు. రాజవర్ధన్ హంగర్గేకర్, ప్రశాంత్ సోలంకి బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉంటారు.ఈ టోర్నీలో మహారాష్ట్ర గ్రూప్-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళ, ముంబై, ఆంధ్రప్రదేశ్, గోవా, సర్వీసెస్, నాగాలండ్ లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆనుంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సేన నాగాలాండ్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర గతేడాది నాకౌట్ దశకు చేరలేకపోయింది. ఈసారి పటిష్ట జట్టు ఉండటంతో పాటు రుతురాజ్ సారథ్యం తోడవ్వడంతో మహారాష్ట్ర టైటిల్‌పై కన్నేసింది.కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఈసారి రసవత్తరంగా మారనుంది. ఈ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు జట్లను ముందుండి నడిపించనున్నారు. మహారాష్ట్రకు రుతురాజ్ సారథ్యం వహిస్తుండగా.. ముంబైకు శ్రేయస్ అయ్యర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు భువనేశ్వర్ కుమార్, కేరళకు సంజూ శాంసన్, బరోడాకు కృనాల్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్) లాంటి టీమిండియా స్టార్లు కూడా పాల్గొననున్నారు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగనున్నాయి.మహారాష్ట్ర జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అంకిత్ బవానే, అర్షిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్‌కీపర్), ధన్‌రాజ్ షిండే (వికెట్‌కీపర్), దివ్యాంగ్ హింగనేకర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అథర్వ కాలే, సిద్ధార్థ్ మాత్రే, సత్యజీత్ బచ్చవ్, రాజవర్ధన్ హంగర్గేకర్, అజీమ్ కాజీ, రుషబ్ రాథోడ్, సన్నీ పండిట్ -
సిక్సర్ల వర్షం కురిపించిన రుతురాజ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్, భారత్-ఏ మధ్య వాకా వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రెండు.. మానవ్ సుతార్, హర్షిత్ రాణా బౌలింగ్‌లో తలో సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో గంటకు పైగా బ్యాటింగ్ చేసిన రుతురాజ్ ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. రుతురాజ్ ఇటీవలే ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌లో రుతురాజ్ ఆశించిన మేరకు రాణించకపోయినప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రుతురాజ్ టీమిండియా మేనేజ్మెంట్ను మెప్పించి తుది జట్టులో (ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు) చోటు దక్కించుకుంటాడేమో వేచి చూడాలి.🚨 Updates from Perth 4 Sixes from Ruturaj Gaikwad - 2 Vs Ashwin 1 Vs Sutar and one vs Rana - After playing for more than an hour made his way to Sarfaraz Khan.#AUSvsIND pic.twitter.com/yGMIjk4Wzp— RevSportz Global (@RevSportzGlobal) November 16, 2024చెమటోడ్చిన విరాట్, యశస్వి, గిల్రుతురాజ్ విషయాన్ని పక్కన పెడితే, టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెమటోడ్చారు. ఈ ముగ్గురు ఈ మ్యాచ్‌లో తలో రెండుసార్లు బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆశాజనకమైన ప్రదర్శన చేశాడు. యశస్వి జైస్వాల్ షార్ట్ బాల్స్‌ను మంచి టెక్నిక్‌తో ఎదుర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తడబడినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్థాయి మేరకు రాణించాడు. బౌలర్లలో ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముకేశ్ ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. అయితే అతను భారత మెయిన్ జట్టులో లేని విషయం తెలిసిందే. భారత సెలెక్టర్లు ముకేశ్‌ను ట్రావెలింగ్ రిజర్వగా ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’.. మండిపడ్డ రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సహనం కోల్పోయాడు. అంపైర్ల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్‌ను అవుట్ చేసేందుకు మరీ ఇంత దిగజారాలా అంటూ సర్వీసెస్ జట్టు తీరును విమర్శించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? రుతురాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనభారత్-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఆస్ట్రేలియా-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. అక్కడ రుతు స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలబడ్డాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు. ఆసీస్-‘ఎ’ జట్టుతో నాలుగు ఇన్నింగ్స్‌లో రుతురాజ్ చేసిన పరుగులు వరుసగా 0, 5, 4 ,11.దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్గాఇక రుతురాజ్ సారథ్యంలో భారత్-‘ఎ’ జట్టు ఇప్పటికే తొలి టెస్టులో ఓడి.. రెండో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా పయనిస్తోంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర జట్టు తమ నాలుగో మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడుతోంది. పుణె వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సర్వీసెస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ అయింది. 185 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 185 పరుగులకే కుప్పకూలింది. నిజానికి మహారాష్ట్ర ఈ మేర కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేయడానికి కారణం ఆ జట్టు కెప్టెన్ అంకిత్ బావ్నే. రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో మహారాష్ట్ర టీమ్‌ను ముందుకు నడిపిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అర్ధ శతకంతో మెరిశాడు.సర్వీసెస్‌తో మ్యాచ్‌లో తమ మొదటి ఇన్నింగ్స్‌లో 104 బంతులు ఎదుర్కొన్న అంకిత్.. 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, అతడు అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. వివాదాస్పద రీతిలో అంకిత్ అవుట్క్రీజులో పాతుకుపోయిన అంకిత్ వికెట్ తీయాలన్న పట్టుదలతో ఉన్న సర్వీసెస్.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న తమ పేసర్ అమిత్ శుక్లాను రంగంలోకి దించింది.అతడి బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అంకిత్ విఫలమయ్యాడు. అంకిత్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభం రోహిలా చేతిలో పడ్డట్లు కనిపించింది. దీంతో సర్వీసెస్ అప్పీలు చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, రీప్లేలో మాత్రం.. ఫీల్డర్ చేతిలో పడే కంటే ముందే బాల్ నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.అయినప్పటికీ అంకిత్ బావ్నేను అవుట్‌గా ప్రకటించడంతో మహారాష్ట్ర కీలక వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో అంకిత్ అవుటైన తీరుపై రుతురాజ్ ఘాటుగా స్పందించాడు. ‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘లైవ్ మ్యాచ్‌లో.. దీనిని ఎలా అవుట్‌గా ప్రకటిస్తారు? అసలు అది క్యాచ్ అవుట్ అని అప్పీలు చేయడం కూడా నిజంగా సిగ్గుచేటు’’ అని మహారాష్ట్ర రెగుల్యర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మండిపడ్డాడు.ఇక రంజీ తాజా సీజన్లో ఎలైట్ గ్రూప్-ఎ మ్యాచ్‌లలో భాగంగా తొలుత కశ్మీర్‌తో మ్యాచ్ డ్రా చేసుకున్న మహారాష్ట్ర.. ఆ తర్వాత ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. మేఘాలయపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి గెలుపుబాట పట్టింది.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య Ruturaj Gaikwad was fuming with Ankit Bawne's controversial dismissal against Services #RanjiTrophy2024 Source: Gaikwad's Instagram story pic.twitter.com/HParORg3YQ— Vijeet Rathi (@vijeet_rathi) November 7, 2024 -
Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రుతురాజ్ సేన ఓటమి దిశగా పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు భారత్-‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది.రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో.. బీజీటీకి ఎంపికైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ తదితరులు ముందుగానే భారత్-‘ఎ’ జట్టుతో చేరగా.. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా కంటే ముందే ఆసీస్‌కు వచ్చారు.తొలిరోజు ఇలాఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుకాగా.. భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (4), అభిమన్యు ఈశ్వరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) అందివచ్చిన చక్కని అవకాశాన్ని అందుకోలేక మరోసారి చేతులెత్తేశాడు. ఒకే ఒక్కడు ధ్రువ్ జురేల్ (186 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ ‘ఎ’ జట్టును ఆదుకున్నాడు.ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అభిమన్యుతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (0)లను జట్టు ఖాతా తెరవకముందే నెసర్ తొలి ఓవర్ వరుస బంతుల్లోనే అవుట్ చేశాడు. రెండో ఓవర్లో రాహుల్, మూడో ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ (4) నిష్క్రమించడంతో 11 పరుగులకే టాప్–4 బ్యాటర్లను కోల్పోయింది. ఈ దశలో దేవ్‌దత్ పడిక్కల్ (26; 3 ఫోర్లు)కు జతయిన జురేల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలకుండా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాక పడిక్కల్‌ను నెసర్ అవుట్ చేశాడు. జురెల్ ఈసారి నితీశ్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో వెబ్‌స్టర్ ఒకే ఓవర్లో నితీశ్, తనుశ్ (0), ఖలీల్ అహ్మద్ (1)లను అవుట్ చేసి భారత్‌ను ఆలౌట్‌కు సిద్ధం చేశాడు. ప్రసిద్ కృష్ణ (14) సహకారంతో జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ (4/27), వెబ్‌స్టర్ (3/19) భారత్‌ను దెబ్బ కొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.ఆసీస్ 223 ఆలౌట్‌ఈ క్రమంలో 53/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత బౌలర్లు 223 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించాడు.మరోసారి విఫలమైన భారత బ్యాటర్లుఈ నేపథ్యంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(17), కేఎల్ రాహుల్(10) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 3 పరుగులకే నిష్క్రమించాడు.ఇక కెప్టెన్ రుతురాజ్(11) మరోసారి దారుణంగా విఫలం కాగా.. దేవ్‌దత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగలిగాడు. ధ్రువ్ జురెల్ మరోసారి పోరాటం చేస్తుండగా.. నితీశ్ రెడ్డి అతడికి తోడుగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్-‘ఎ’ 31 ఓవర్లు ఆడి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 73 పరుగులు చేసింది. ఆట పూర్తయ్యేసరికి జురెల్ 19, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ, బ్యూ వెబ్స్టర రెండేసి వికెట్లు తీయగా.. కోరే రొచిసియోలి ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య -
అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య
యువ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత్- ప్రొటిస్ జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా.. పరాభవాల నుంచి కోలుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రశ్న ఎదురైంది. అతడిని సౌతాఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని విలేఖరులు అడుగగా.. ‘‘రుతు అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు.అతడి కంటే ముందు చాలా మందే ఉన్నారుఇక అతడి కంటే ముందు చాలా మంది ఆటగాళ్లు కూడా ఇలాగే అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆడించాలో మేనేజ్మెంట్కు బాగా తెలుసు. యాజమాన్యం నిర్ణయాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. రుతు ఇంకా యువకుడే. అతడికీ ఏదో ఒక రోజు టైమ్ వస్తుంది’’ అని సూర్య కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానమిచ్చాడు.కొత్త జోడీకాగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే, టీ20 ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అతడి బ్యాటింగ్ స్థానమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా టీ20లలో యశస్వి జైస్వాల్- శుబ్‌మన్ గిల్ జోడీ ఓపెనర్లుగా పాతుకుపోగా.. వారి గైర్హాజరీలో కొత్తగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీని బీసీసీఐ పరిశీలిస్తోంది.కెప్టెన్‌గా అవకాశాలుఅయితే, సౌతాఫ్రికాతో సిరీస్ కంటే ముందే భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు ప్రొటిస్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ రుతు చివరగా జింబాబ్వే పర్యటనలో టీమిండియా తరఫున టీ20 సిరీస్ ఆడాడు. ఆ టూర్లో 158కి పైగా స్ట్రైక్‌రేటుతో 133 పరుగులు సాధించాడు.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆసీస్ గడ్డపై విఫలంఅంతేకాదు.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న రుతు.. అక్కడ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో 0, 5 పరుగులు చేసిన రుతు.. రెండో టెస్టులో 4, 11 రన్స్ చేశాడు. ఇక తొలి టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఓడిన భారత్-ఎ.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే' -
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్‌కు గత మ్యాచ్‌లో శతకం బాదిన వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్‌కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్‌దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
Aus A vs Ind A: శతక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆసీస్ టార్గెట్?
Australia A vs India A, 1st unofficial Test Day 3: ఆస్ట్రేలియా ‘ఎ’తో మొదటి అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. మెక్కే వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన రుతురాజ్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పట్టుదలగా నిలబడింది. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా 312 పరుగులు చేయగలిగింది.సాయి సుదర్శన్ 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం సాధించగా.. దేవ్‌దత్ పడిక్కల్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 199 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 88 పరుగులు రాబట్టాడు. వీరితో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32) రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.💯 for Sai Sudharsan Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSvIND pic.twitter.com/xIWxfavDFh— cricket.com.au (@cricketcomau) November 2, 2024ఆసీస్ టార్గెట్?ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసిన భారత్-ఎ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యం సాధించింది. తద్వారా ఆసీస్‌కు 225 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో టీ సమయానికి ఆసీస్ జట్టు 21 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. తన బ్యాటింగ్ తీరుతో జూనియర్ రికీ పాంటింగ్‌గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్(16) మరోసారి విఫలమయ్యాడు. మార్కస్ హ్యారిస్ 29, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.First runs for Australia A from Sam Konstas 👀Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSAvINDA pic.twitter.com/an2oO9LPH9— cricket.com.au (@cricketcomau) November 2, 2024తొలి ఇన్నింగ్స్‌లో మూకుమ్మడిగా విఫలంకాగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 64 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. గురువారం మొదటి రోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 47.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (36; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, ఆసీస్ ‘ఎ’ బౌలర్ బ్రెండన్ డగెట్ 6 వికెట్లు తీశాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 62.4 ఓవర్లలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. ముకేశ్ కుమార్ (6/46), ప్రసిధ్ కృష్ణ (3/59) ఆసీస్‌ను 136/7 స్కోరు వద్ద కట్టడి చేసినప్పటికీ మర్ఫీ (33), ఓనీల్ (13) ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం రెండో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), అభిమన్యు ఈశ్వరన్ (12) వికెట్లను కోల్పోయింది. ఆ దశలో సుదర్శన్, పడిక్కల్ జట్టును ఒడ్డున పడేసే ఆట ఆడారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. తుదిజట్లుభారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.ఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హ్యారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ జట్టుకు శుభారంభం లభించలేదు. ఆసీస్‌తో గురువారం మొదలైన అనధికారిక టెస్టు తొలి రోజు ఆటలోనే రుతురాజ్ సేనకు గట్టి షాక్ తగిలింది. కంగారూ బౌలర్ల విజృంభణ నేపథ్యంలో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.బ్యాటర్లు విఫలంఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(7), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) సహా బాబా ఇంద్రజిత్(9), వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4), నితీశ్ కుమార్ రెడ్డి(0), టెయిలెండర్లు మానవ్ సుతార్(1), ప్రసిద్ కృష్ణ(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(21)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్(36), టెయిలెండర్ నవదీప్ సైనీ(23) ఓ మోస్తరుగా రాణించడంతో భారత్ వంద పరుగులు దాటగలిగింది. 47.4 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో సత్తా చాటగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ తలా ఒక వికెట్ పడగొట్టారు. Buckingham's got two! Watch #AUSAvINDA live: https://t.co/XcQLyyTDJ5 pic.twitter.com/RccWM8CX5R— cricket.com.au (@cricketcomau) October 31, 2024 ఆసీస్‌కూ ఆదిలోనే షాక్.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆదిలోనే షాకిచ్చాడు. తన అద్భుత ఆట తీరుతో ‘జూనియర్ రికీ పాంటింగ్’గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కన్‌స్టాస్(Sam Konstas)ను డకౌట్ చేశాడు. Mukesh gets Konstas in the first over! #AUSAvINDA pic.twitter.com/8E61yX0zTM— cricket.com.au (@cricketcomau) October 31, 2024మొత్తంగా మూడు బంతులు ఎదుర్కొన్న స్యామ్ ముకేశ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.టీమిండియాతో టెస్టుకు ఆసీస్ ఓపెనర్ల పోటీలో కాగా 19 ఏళ్ల స్యామ్ ఇప్పటి వరకు ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి రెండు శతకాలు బాదడం సహా సగటు 45.70గా నమోదు చేశాడు. భారత్-ఎ జట్టుతో మ్యాచ్‌లో గనుక రాణిస్తే తదుపరి టీమిండియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అతడు ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ లేకపోలేదు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ముకేశ్ రూపంలో స్యామ్‌కు గట్టి షాక్ తగిలింది.పాతుకుపోయిన కెప్టెన్ఇదిలా ఉంటే.. ప్రసిద్ కృష్ణ సైతం అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలుత కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను డకౌట్ చేసిన ప్రసిద్.. తర్వాత ఆసీస్-ఎ మరో ఓపెనర్ మార్కస్ హ్యారిస్(17) వికెట్ పడగొట్టాడు. ఇలా టాపార్డర్‌ను భారత బౌలర్లు కుదేలు చేసినా.. మిడిలార్డర్లో వచ్చిన కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ క్రీజులో పాతుకుపోయి ఇబ్బంది పెట్టాడు.అతడికి తోడుగా బ్యూ వెబ్‌స్టర్(33) రాణించాడు. అయితే, ముకేశ్ కుమార్ ఈ జోడీని విడదీయగా.. నాథన్‌కు జతైన కూపర్ కానొలీ సైతం పట్టుదలగా నిలబడ్డాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ 39 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం ఆట ముగిసే సరికి నాథన్ 29, కూపర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆస్ట్రేలియా- ‘ఎ’ వర్సెస్ భారత్- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టు(డే-1)👉వేదిక: గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎరీనా, మెక్కే👉టాస్: ఆస్ట్రేలియా-ఎ.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 107👉ఆసీస్ స్కోరు: 99/4 (39).. తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు భారత్ కంటే ఎనిమిది పరుగుల వెనుకంజతుదిజట్లుఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డోగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.భారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.చదవండి: IPL 2025: షాకింగ్.. అతడి కోసం జడ్డూను వదులుకున్న సీఎస్కే! -
Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. మూకుమ్మడిగా విఫలంకాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటి టీమ్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్‌కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.దేశవాళీల్లో సత్తా చాటి... 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్‌లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్‌గా ఈశ్వరన్కే తొలి ప్రాధాన్యత ఉంది. గాయాల నుంచి కోలుకునిఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను అందుకోవడంతో పాటు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్‌కు ఇది సరైన వేదిక కానుంది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తోఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్‌పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.అయినా సరే శార్దుల్ ఠాకూర్‌లాంటి ఆల్‌రౌండర్‌ను కాదని నితీశ్‌ను సెలక్టర్ల టెస్టు టీమ్‌కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్‌కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్‌లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్పైనే ఉంది. టెస్టు క్రికెటర్లు కూడా... భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్‌కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.ఆసీస్ క్రికెటర్లకూ పరీక్షఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్‌కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు. మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్‌తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2— Div🦁 (@div_yumm) October 31, 2024 -
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. ఆంధ్ర ప్లేయర్లకు చోటు
ఆస్ట్రేలియా గడ్డపై జరిగే రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇద్దరు ఆంధ్ర ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రికీ భుయ్‌లకు ఇందులో చోటు లభించింది.భారత సీనియర్ టీమ్‌లో స్థానం కోల్పోయిన ఇషాన్ కిషన్‌కు ఈ జట్టులో అవకాశం దక్కడం విశేషం. ఈ టూర్లో భాగంగా ఆ్రస్టేలియా ‘ఎ’తో మెకే, మెల్బోర్న్లలో భారత్ ‘ఎ’ నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడుతుంది. ఆ తర్వాత టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న భారత సీనియర్ టీమ్‌తో పెర్త్‌లో మూడు రోజుల మ్యాచ్‌లో కూడా తలపడుతుంది. ‘ఎ’ జట్టు ప్రదర్శన ద్వారా కూడా బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం కూడా ఒకరిద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారత ‘ఎ’ జట్టు వివరాలు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయిసుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, దేవ్‌దత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, అభిషేక్ పొరేల్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాళ్, నవదీప్ సైనీ, మానవ్ సుథార్, తనుశ్ కొటియాన్.చదవండి: అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం -
IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) రిటెన్షన్స్‌కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.కాగా ఐపీఎల్ పాలక మండలి రిటెన్షన్ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్టీఎమ్) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్ స్లాబ్‌లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్‌కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్క్యాప్డ్) చెల్లించాల్సి ఉంటుంది.సీఎస్కే రిటైన్ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లుఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్కే తమ టాప్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్క్యాప్డ్ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.సీఎస్కే అంటే ధోనినిజానికి ధోని అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోని. ధోని బ్రాండ్ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.PC: BCCIఇద్దరు శిష్యులుచెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ 2019లో సీఎస్కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్‌క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్కే పగ్గాలు చేపట్టాడు.ఇక రవీంద్ర జడేజాకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
సూర్యకుమార్ మళ్లీ ఫెయిల్.. రుతురాజ్ సూపర్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. తొలుత జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో 86 పరుగులతో రాణించిన ఈ మహారాష్ట్ర కెప్టెన్.. ముంబైతో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. తద్వారా తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో ఏడో సెంచరీని నమోదు చేశాడు.కాగా రంజీ టోర్నీలో భాగంగా ముంబై- మహారాష్ట్ర మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీలో వేదికగా టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రుతురాజ్ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కావడం ప్రభావం చూపింది.సూర్యకుమార్ మళ్లీ ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే ఓపెనర్ పృథీ షా(1) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ(176)తో రాణించాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(142) కూడా శతక్కొట్టాడు. అయితే, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరోసారి రెడ్‌బాల్ క్రికెట్లో విఫలమయ్యాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.రుతురాజ్ సూపర్ సెంచరీఅయితే, ఆయుశ్, శ్రేయస్‌ల భారీ సెంచరీల వల్ల ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఓపెనర్ సచిన్ దాస్(98) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 171 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 145 రన్స్ సాధించాడు.మూడో రోజు ఆటలో భాగంగా ఆదివారం రుతుతో పాటు అంకిత్ బావ్నే తన సూపర్ హాఫ్ సెంచరీని శతకం దిశగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 377 రన్స్ స్కోరు చేసింది. కాగా ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌కు ప్రకటించిన భారత్-‘ఎ’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగి కేవలం ఐదు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.మహారాష్ట్ర వర్సెస్ ముంబై తుదిజట్లుమహారాష్ట్రరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్ కీపర్), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్ఎస్ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్.ముంబైపృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్Ruturaj Gaikwad reaches a brilliant hundred and is still going strong! 💯🔥 Leading Maharashtra’s charge against Mumbai with his classy batting, more runs to come!#RuturajGaikwad #CenturyInProgress #RanjiTrophy2024 #MaharashtraCricket pic.twitter.com/J6EwHQPZtC— Maharashtra Cricket Association (@MahaCricket) October 20, 2024 -
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు?
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆసీస్-ఎ జట్టుతో భారత్ రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు పంపే జట్టును సెలక్టర్లు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన భారత్-ఎ జట్టుకు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నట్లు సమాచారం. రుతురాజ్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ క్రికెట్లో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మహారాష్ట్రకు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు వినికిడి.కిషన్‌కు చోటు?అదేవిధంగా ఆసీస్ టూర్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన కిషన్.. ప్రస్తుతం రంజీల్లో జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో కిషన్ పర్వాలేదన్పిస్తున్నాడు. అంతకముందు దులీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడిని ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టులో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రికీ భుయ్ కూడా చోటు సంపాదించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ టూర్‌కు భారత్- ఎ జట్టు(అంచనా)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్,సాయి సుదర్శన్, బి ఇంద్రజిత్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, రికీ భుయ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవ్‌దీప్ సైనీ, ఖాలీల్ అహ్మద్, తనుష్ కోటియన్, యశ్ దయాళ్చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
సెంచరీ చేజార్చుకున్న రుతురాజ్
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్, టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రుతు 86 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ పక్క రుతురాజ్ సెంచరీ చేజార్చుకోగా సహచరుడు సిద్దేశ్ వీర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మూడో రోజు టీ విరామం సమయానికి మహారాష్ట్ర స్కోర్ 3 వికెట్ల నష్టానికి 221 పరుగులుగా ఉంది. సిద్దేశ్ వీర్ (100), అంకిత్ బావ్నే (9) క్రీజ్‌లో ఉన్నారు. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌లో ముర్తజా ట్రంక్వాలా (0), సచిన్ దాస్ (10) నిరాశపరిచారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో రసిక్ దార్ సలామ్ రెండు వికెట్లు పడగొట్టగా.. యుద్ద్‌వీర్ సింగ్ చరక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్ర జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 298 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభమ్ ఖజూరియా డబుల్ సెంచరీతో (255), శివాంశ్ శర్మ (106 నాటౌట్) అజేయ సెంచరీతో విజృంభించారు. వీరిద్దరు మినహా జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శుభమ్ పుండిర్ 37, డోగ్రా 30, ఆబిద్ ముస్తాక్ 29 (నాటౌట్) పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో హితేశ్ వలుంజ్ 4 వికెట్లు పడగొట్టగా.. అర్షిన్ కులకర్ణి, ముకేశ్ చౌదరీ, రజినీష్ గుర్బానీ తలో వికెట్ దక్కించుకున్నారు. -
‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అభిమానులు రుతు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, భారత టెస్టు జట్టుకు ఎంపిక కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.కాగా రంజీ చాంపియన్ ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతోంది. లక్నో వేదికగా అక్టోబరు 1న మొదలైన ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.సర్ఫరాజ్ డబుల్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (276 బంతుల్లో 221 బ్యాటింగ్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 237/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై రెండో రోజంతా అదే జోరు కనబర్చింది.కెప్టెన్ అజింక్య రహానే, షమ్స్ ములానీ (5) త్వరగానే ఔటైనా... తనుశ్ కోటియాన్ (124 బంతుల్లో 64; 6 ఫోర్లు)తో కలిసి సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 183 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ముంబై ఆటగాడిగా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు.భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!ఇలా... టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న సర్ఫరాజ్ దేశవాళీల్లో భీకర ఫామ్ కొనసాగిస్తూ చెలరేగగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వద్ద ఉండగా.. ముంబై ప్లేయర్ జునైద్ ఖాన్ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆదిలోనే రెస్ట్ ఆఫ్ ఇండియాకు షాక్ తగిలింది.అయితే, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకంతో అదరగొట్టి సెంచరీ దిశగా పయనిస్తుండగా.. సాయి సుదర్శన్(32) అతడికి సహకారం అందించాడు. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆటలో 36 ఓవర్లు ముగిసేసరికి రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై కంటే 396 పరుగులు వెనుకబడి ఉంది.సెలక్టర్లు మాత్రం ఏం చేస్తారు?కాగా టీమిండియా టెస్టు ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ పాతుకుపోయిన విషయం తెలిసిందే. రోజురోజుకూ బ్యాటింగ్ మెరుగుపరచుకుంటూ ఈ యంగ్‌స్టర్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో బ్యాకప్ ఓపెనర్‌గా అయినా స్థానం దక్కించుకునేందుకు రుతు ప్రయత్నిస్తున్నాడు.ఈ క్రమంలో.. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టు సారథిగా వ్యవహరించిన రుతురాజ్.. మూడు మ్యాచ్‌లలో కలిపి 232 పరుగులు చేయగలిగాడు. అయితే, తాజాగా ఇరానీ కప్ మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. కాగా టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రుతురాజ్ కూడా జట్టుకు ఎంపికవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి ఆట తీరుతో అతడు సెలక్టర్లను ఆకట్టుకోవడం కష్టమేనని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ Maiden First-Class wicket for Mohammad Juned Khan on debut 🙌What a way to get off the mark! He gets the big wicket of captain Ruturaj Gaikwad 👌#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/KvUOFHK6Nx— BCCI Domestic (@BCCIdomestic) October 3, 2024 -
రుతురాజ్ గైక్వాడ్‌కు బంపరాఫర్.. టీమిండియా ఓపెనర్‌గా!?
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్‌కు విశ్రాంతి ఇచ్చినప్పటకి రుతురాజ్ వైపు మాత్రం సెలక్టర్లు మొగ్గు చూపలేదు.దీంటో టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి రుతుకు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు. అయితే బంగ్లాతో టీ20 సిరీస్‌కు గైక్వాడ్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.ఆసీస్ టూర్‌కు రుతురాజ్..రుతురాజ్ గైక్వాడ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. ఆసీస్ టెస్టు సిరీస్‌కు రుతురాజ్‌ను టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడిని బంగ్లాతో టీ20లకు ఎంపిక చేయకుండా, ఇరానీ కప్‌లో ఆడేందుకు సెలక్టర్లు అవకాశమిచ్చినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంటుంది.ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు గైక్వాడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆసీస్ సిరీస్‌కు ముందు అతడిని వీలైనన్ని ఎక్కువ రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడనమని సెలక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత భారత జట్టులో మూడో ఓపెనర్ కోసం ఎక్కువ మంది ఆటగాళ్లు లేరు. ఒకవేళ రోహిత్, జైశ్వాల్ గాయపడితో వారికి బ్యాకప్‌గా రుతురాజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నవంబర్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం.. -
'అతడేం తప్పు చేశాడు.. నిజంగా సిగ్గు చేటు'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.టీమిండియా తరపున అవకాశం వచ్చినప్పుడల్లా ఆకట్టుకున్న రుతురాజ్‌కు చోటు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అతడి అభిమానులు భారత సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు అంటూ తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు.రుతురాజ్ గైక్వాడ్ టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. జింబాబ్వే పర్యటనలో అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏ స్ధానంలో నైనా బ్యాటింగ్ చేస్తే సత్తా రుతుకు ఉంది. అటువంటి ఆటగాడి ఎందుకు పక్కన పెడుతున్నారు. నిజంగా సిగ్గు చేటు అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.భీకర ఫామ్‌లో రుతు..రుతురాజ్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు టీమిండియా తరపున కూడా తాను ఏంటో నిరూపించుకున్నాడు. భారత్ తరఫున 23 టీ20లు ఆడిన రుతురాజ్ 39.56 యావరేజ్ 633 రన్స్ చేశాడు. అటువైపు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ రుతురాజ్ తన ప్రదర్శనలతో అకట్టుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో కూడా గైక్వాడ్ దమ్ములేపాడు. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే తరపున 14 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ ఏకంగా 583 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ సత్తాచాటాడు. ఆ తర్వాత అతడికి వరుసగా శ్రీలంక, బంగ్లాతో సిరీస్‌లకు సెలక్టర్లు చోటు ఇవ్వలేదు. బంగ్లాతో టీ20లకు ఓపెర్లు జైశ్వాల్, గిల్‌కు విశ్రాంతి ఇచ్చినప్పటికి.. రుతురాజ్ వైపు మాత్రం సెలక్టర్లు మొగ్గు చూపలేదు. ఇక ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.బంగ్లాతో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా . -
Ind vs Ban: గిల్, జైస్వాల్‌లకు రెస్ట్.. వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!
టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలోనే జట్టును ప్రకటించనుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ పొట్టి సిరీస్‌కు శుబ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా సొంతగడ్డపై నవంబరులో టీమిండియా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్‌కు ఈ సిరీస్ కీలకం.గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండాఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండా చూసుకునేందుకు.. మేనేజ్మెంట్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. గిల్- జైస్వాల్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా ప్రధాన ఓపెనింగ్ జోడీగా మారారు.వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!అయితే, కివీస్‌తో సిరీస్ కారణంగా వీరిద్దరు గనుక దూరమైతే.. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే! వీరిద్దరు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే, రుతురాజ్ ఇరానీ కప్-2024 మ్యాచ్ కారణంగా తొలి టీ20కి దూరం కానున్నాడని.. అందుకే జైస్వాల్ ఆ ఒక్కమ్యాచ్కి అందుబాటులో ఉంటాడనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘సి’ కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ అక్టోబరు 1-5 వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక కానుండగా.. జితేశ్ శర్మను అతడికి బ్యాకప్‌గా సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.విధ్వంసకర సెంచరీ హీరో అభిషేక్ శర్మటీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో స్థానం దక్కించుకున్న పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తొలిటీ20 సందర్భంగా అరంగేట్రం చేశాడు.అయితే, తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయి విమర్శపాలైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టీ20లో శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకుని.. ఆ తర్వాత అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు అతడికి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఇక టీమిండియా విషయానిస్తే.. బంగ్లాతో తొలి టెస్టు గెలిచి.. శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్ -
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దులీప్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌కు మాత్రం బీసీసీఐ సెలక్టర్లు మొండి చేయిచూపించింది. అతడికి ఇరానీ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వలేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత క్రికెటర్లు ధ్రువ్ జురెల్, యష్ దయాల్‌ను ఈ జట్టులో సెలెక్టర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. మరోవైపు ఈ ఇరానీ కప్‌లో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.ఇరానీ ట్రోఫీకి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్చదవండి: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్ -
ఆవేశ్‌ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్‌తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. నిరాశపరిచిన స్కై, రుతు, ఇషాన్
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్‌లో ఈశ్వరన్ 116 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (39), రాహుల్ చాహర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, ఆధిత్య థాకరే 2, సౌరభ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇండియా-డి తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 139 పరుగులు వెనుకపడి ఉంది.సూర్యకుమార్ యాదవ్ విఫలంఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎన్ జగదీషన్ (13), సుయాశ్ ప్రభుదేశాయ్ (16), ముషీర్ ఖాన్ (5), నితీశ్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు.సంజూ మెరుపు సెంచరీసంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవ్‌దీప్ సైనీ ఐదు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్ కిషన్అనంతపురంలోనే జరుగుతున్న మరో మ్యాచ్‌లో (ఇండియా-ఏతో) ఇండియా-సి ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.రాణించిన అభిషేక్ పోరెల్ఇండియా-సి ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (82) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. పుల్కిత్ నారంగ్ (35 నాటౌట్), విజయ్ కుమార్ వైశాఖ్ (14 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-ఏ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇండియా-సి ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకిబ్ ఖాన్ 3, షమ్స్ ములానీ 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.శాశ్వత్ రావత్ సెంచరీ.. హాఫ్ సెంచరీ చేసిన ఆవేశ్ ఖాన్శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. ఆవేశ్ ఖాన్ (51 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. టెయిలెండర్లు షమ్స్ ములానీ (44), ప్రసిద్ద్ కృష్ణ (34) పర్వాలేదనిపించారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: IND VS BAN 1st Test: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర.. అగ్రస్థానంలోకి ‘సి’ జట్టు
దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్‌గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్‌కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్‌కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్‌గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు.ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లుఇండియా-‘బి’- 332 ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.చదవండి: మూడు వందల వికెట్ల క్లబ్‌కు చేరువలో కుల్దీప్ -
భారత్ ‘సి’తో మ్యాచ్.. ఇండియా ‘బి’ దీటైన జవాబు
సాక్షి, అనంతపురం: టాపార్డర్, లోయర్ ఆర్డర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యాట్‌కు పని చెప్పడంతో... అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో పరుగుల వరద పారుతోంది. భారత్ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్‌లో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘బి’ 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు సాధించింది. కెప్టెన్అభిమన్యు ఈశ్వరన్ (91 బంతుల్లో 51 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జగదీశన్ (126 బంతుల్లో 67 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్ ‘బి’ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 401 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 357/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘సి’ 124.1 ఓవర్లలో 525 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ (156 బంతుల్లో 82; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఆఖర్లో అన్షుల్ కంబోజ్ (27 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ (బి) ముకేశ్ 58; సాయి సుదర్శన్ (సి) నవ్‌దీప్ సైనీ (బి) ముకేశ్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్‌దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ 12; మానవ్ సుతార్ (బి) రాహుల్ చహర్ 82; మయాంక్ మార్కండే (బి) నితీశ్ కుమార్ రెడ్డి 17; అన్షుల్ (బి) రాహుల్ చహర్ 38; విజయ్ కుమార్ వైశాఖ్ (సి) ఈశ్వరన్ (బి) రాహుల్ చహర్ 12; సందీప్ వారియర్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు: 23; మొత్తం (124.1 ఓవర్లలో ఆలౌట్) 525. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345, 6–382, 7–406, 8–461, 9–489, 10–525, బౌలింగ్: ముకేశ్ కుమార్ 32–4–126–4; సైనీ 23–3–101–1; వాషింగ్టన్ సుందర్ 18–1–67–0; నితీశ్ కుమార్ రెడ్డి 17–2–69–1; సాయికిశోర్ 18–2–78–0; రాహుల్ చహర్ 16.1–2–73–4. భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటింగ్) 51; జగదీశన్ (బ్యాటింగ్) 67; ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: (36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 124. బౌలింగ్: సందీప్ వారియర్ 1.1–0– 8–0; విజయ్ వైశాఖ్ 10–2–29–0; అన్షుల్ 8.5–2–30–0; మయాంక్ మార్కండే 5–0–18–0; మానవ్ సుతార్ 10–0–34–0.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
రీఎంట్రీ ఇచ్చిన రుతురాజ్
ఇండియా-బితో జరుగుతున్న రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతను ఇన్నింగ్స్ ఆరంభంలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సింగిల్ తీసే క్రమంలో రుతురాజ్ కాలి మడమ మెలిక తిరగడంతో పెవిలియన్‌కు చేరాడు. అయితే, సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ఔటయ్యాక రుతురాజ్ తిరిగి క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం అతను 46 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రుతురాజ్‌తో పాటు మానవ్ సుతార్ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా-సి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40, ఇషాన్ కిషన్ 111, బాబా ఇంద్రజిత్ 78, అభిషేక్ పోరెల్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్‌దీప్ సైనీ, రాహుల్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.ఇషాన్ సూపర్ సెంచరీఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్‌కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు.ఆదుకున్న ములానీఇవాళే మొదలైన మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53), ప్రసిద్ధ్ కృష్ణ (8) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (88), ఖలీల్ అహ్మద్ (15) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత రాణా తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్‌కు గాయం -
ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్‌కు గాయం
దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అనంతపురం వేదికగా ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్, భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు క్రీజులోకి వచ్చాడు. తొలి బంతికే ఫోర్ కొట్టి మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. కానీ రెండో బంతికే గాయపడి గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అయితే రుతురాజ్ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఈ మ్యాచ్ టెలికాస్ట్ లేనందున అతడికి ఏమైందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఆదిలోనే గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో ఇండియా-సి జట్టు బాధ్యతను పాటిదార్, సాయిసుదర్శన్ తమ భుజాలపై వేసుకున్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి ఇండియా-సి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. సుదర్శన్(39), రజిత్ పాటిదార్(35) పరుగులతో ఆజేయంగా ఉన్నారు.తుది జట్లుఇండియా సి: అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్‌కుమార్, సందీప్ వారియర్ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ముఖేష్ కుమార్, ముషీర్ అహ్మద్ ఖాన్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రింకు సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే జట్టులో విరాట్ కోహ్లి, బాబర్ ఆజం? -
మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితి: బీసీసీఐపై ట్రోల్స్
రుతురాజ్ గైక్వాడ్.. దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్‌గా సత్తా చాటుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలుత అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన అతడు.. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఆరు వన్డేలు, 23 టీ20లు ఆడాడు.వన్డేల్లో 73.25 స్టైక్‌రేటుతో 115 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. పొట్టి ఫార్మాట్లో 143.54 స్టైక్‌రేటుతో 633 రన్స్ చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ సగటు 42.69. ఇప్పటి వరకు 29 ఇన్నింగ్స్ ఆడి 2092 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి.అయితే, రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం ఇంతవరకు టెస్టుల్లో అవకాశం రాలేదు. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్‌గా అతడి పేరును ప్రకటించగానే.. త్వరలోనే రుతు టెస్టు అరంగేట్రం ఖాయమని అభిమానులు సంతోషపడిపోయారు. బ్యాటర్‌గా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఈ మహారాష్ట్ర ఆటగాడిని బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపిక చేస్తారని ఆశించారు.ఎందుకు అవకాశాలు ఇవ్వరు?కానీ.. తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో రుతుకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లను ట్రోల్ చేస్తూ నెట్టింట విమర్శలకు దిగాను రుతు ఫ్యాన్స్. వన్డే, టీ20 వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పోలుస్తూ రుతురాజ్‌కు తీరని అన్యాయం జరుగుతోందంటూ మండిపడుతున్నారు. ఇరవై ఐదేళ్ల గిల్‌కు లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చారని.. అదే 27 ఏళ్ల రుతు విషయంలో మాత్రం ఎందుకు వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా పాతుకుపోగా.. గిల్‌ను మూడో స్థానంలో ఆడిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితివన్డౌన్లో గిల్ విఫలమవుతున్నా అతడికి ఛాన్సులు ఇస్తున్న మేనేజ్మెంట్.. కనీసం బ్యాకప్ ఓపెనర్‌గా అయినా రుతురాజ్‌ను ఎందుకు ఎంపికచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ మాదిరే.. రుతుపై వివక్ష చూపుతున్నారని.. మహారాష్ట్ర శాంసన్ అంటూ రుతు పేరును ట్రెండ్ చేస్తున్నారు. కాగా దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్ ఇండియా-డితో మ్యాచ్‌లో 5, 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ఇండియా- ఎ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 25, 21 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాతో తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం రాత్రి ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రుతురాజ్‌కు చోటు దక్కలేదు.చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!Squad is out. Shubman Gill makes the cut, but Ruturaj Gaikwad doesn't! Honestly, isn't this BCCI politics at play!? No matter how well guy performs and wins, he can never find a place in Rohit Sharma's team!What partiality, Mann.#INDvBAN #RuturajGaikwad #BCCI— Sharon Solomon (@BSharan_6) September 8, 2024 -
శ్రేయస్ సేనపై రుతురాజ్ టీమ్ ఘన విజయం
దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురం వేదికగా ఇండియా-డితో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-సి టీమ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి.. అక్షర్ పటేల్ (86) ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 చేసింది. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ తలో 2, మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ చెరో వికెట్ పడగొట్టారు.THUMPING WIN FOR INDIA C...!!!!- Well lead by Ruturaj Gaikwad & important score in the run chase in 4th innings. ✅ pic.twitter.com/08Lr2r8pb3— Johns. (@CricCrazyJohns) September 7, 2024అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి.. బాబా ఇంద్రజిత్ (72) మినహా ఎవరూ రాణించకడంతో 168 పరుగులు చేయగలిగింది. హర్షిత్ రాణా (4/33), అక్షర్ పటేల్ (2/46), సరాన్ష్ జైన్ (2/16), అర్ష్‌దీప్ సింగ్ (1/29), ఆదిత్య థాకరే (1/33) ఇండియా-సిని దెబ్బకొట్టారు.దీని తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-డి.. శ్రేయస్ అయ్యర్ (54), దేవ్‌దత్ పడిక్కల్ (56), రికీ భుయ్ (44) రాణించడంతో 236 పరుగులకు ఆలౌటైంది. మానవ్ సుతార్ 7 వికెట్లు తీసి ఇండియా-డిని దారుణంగా దెబ్బతీశాడు. విజయ్‌కుమార్ వైశాఖ్ 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. రుతురాజ్ గైక్వాడ్ (46), సాయి సుదర్శన్ (22), ఆర్యన్ జుయెల్ (47), రజత్ పాటిదార్ (44), అభిషేక్ పోరెల్ (35 నాటౌట్) తలో చేయి వేయడంతో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సరాన్ష్ జైన్ 4, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇండియా-సికి రుతురాజ్.. ఇండియా-డికి శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
గ్రౌండ్లోకి దూసుకెళ్లిన ఫ్యాన్! రుతు కాళ్ళు మొక్కి
దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా అనంతపూర్‌లోని ఆర్డీటీ స్టేడియం వేదికగా భారత్-సి, భారత్-డి జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన సదరు అభిమాని.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత యువ ఓపెనర్, ఇండియా-సి టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు పాదాభివందనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా గైక్వాడ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరు. అతడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో ధోని వారుసుడిగా సీఎస్కే సారథ్య బాధ్యతలు రుతురాజ్ చేపట్టాడు.అప్పటి నుంచి రుతురాజ్‌కు మరింత ఆదరణ పెరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా సి జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు ఆలౌటైంది. సి బ్యాటర్లలో బాబా ఇంద్రజిత్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డి జట్టు బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తాచాటగా.. అక్షర్ పటేల్, జైన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్-డి జట్టు 164 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సి జట్టుకు 4 పరుగుల ఆధిక్యంలో లభిచింది.చదవండి: కుల్దీప్ భాయ్‌తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ షురూ.. తుది జట్లు ఇవే
దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2024 ప్రారంభమైంది. తొలి రౌండ్లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బి, ఇండియా జట్లు తలపడతుండగా.. అనంతపురం వేదికగా భారత్-డి, భారత్-సి జట్లు ఆడుతున్నాయి. బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ఎ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. బి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. మరోవైపు అనంతపూర్ ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా సి జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా 'ఎ' జట్టుకు శుబ్‌మన్ గిల్, బి జట్టుకు అభిమన్యు ఈశ్వరన్, సి జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్, డి జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నారు.తుది జట్లు: ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్ఇండియా ఎ: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ఇండియా డి: దేవదత్ పడిక్కల్, యశ్ దూబే, రికీ భుయ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైదే(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, సరన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య ఠాకరేఇండియా సి:రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, విజయ్‌కుమార్ వైషాక్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, హిమాన్షు చౌహాన్ -
అనంతపురంలో ఆడటం సంతోషంగా ఉంది: శ్రేయస్ అయ్యర్
దేశవాళీ క్రికెట్లో పాల్గొనటం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చని టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఈ టోర్నీల్లో ఆడటం వల్ల యువతలో స్ఫూర్తినింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా జాతీయ విధుల నుంచి విరామం లభించినపుడు.. ఫిట్‌గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీ-2024లో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు పాల్గొనున్నారు. ఇండియా-ఏ, ఇండియా-బి- ఇండియా-సి, ఇండియా-డి జట్ల తరఫున ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ రెడ్‌బాల్ టోర్నీ పోటీలు అనంతపురం వేదికగా గురువారం ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రికెటర్లంతా అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనంతపురం లో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోర్-డే టోర్నీలో ఆడటం ద్వారా నైపుణ్యాలను పదునుపెట్టుకునే అవకాశం దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు.దులిప్ ట్రోఫీ- 2024 జట్లుఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: సెంచరీ హీరో’కు గాయం.. సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్! -
Duleep Trophy 2024: అనంతపూర్‌కు స్టార్ క్రికెటర్ల కళ..
దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఆరంభానికి సమయం అసన్నమైంది. ఈ టోర్నీకి బెంగళూరుతో పాటు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ దేశీవాళీ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది.అందులో 6 మ్యాచ్ లకు గాను.. అనంతపురంలో 5 మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే ఈసారి టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రికెటర్లు భాగం కానున్నారు. దీంతో ఈ టోర్నీకి స్టార్ కళ వచ్చింది.స్టార్లు వచ్చేశారు..ఈ క్రమంలో దులీప్ ట్రోఫీలో పాల్గోనేందుకు భారత స్టార్ క్రికెటర్లు అనంతపురానికి వచ్చేశారు. పలువురు క్రికెటర్లు సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. వీరిలో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. క్రికెటర్లు బసచేస్తున్న హాటల్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని సందడి చేశారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, పంత్, సిరాజ్, గిల్ సైతం త్వరలోనే అనంతపుర్‌కు రానున్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రాలకు బీసీసీఐ సెలెక్టర్లు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించారు.సరికొత్త మార్పులతో..అయితే ఈసారి టోర్నీ గతం కంటే భిన్నంగా జరగనుంది. గతంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ మొత్తం ఆరు జోన్లు తలపడేది. ఇప్పుడు వాటిని ఎ, బి, సి, డి జట్లుగా మార్చారు. ఇండియా ‘ఎ’ జట్టుకు శుభ్‌మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ‘బీ’ జట్టుకు అభిన్యు ఈశ్వరన్, ‘సి’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ లు కెప్టెన్లుగా ఉండనున్నారు.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
దులీప్ ట్రోఫీ జట్ల ప్రకటన.. కెప్టెన్లుగా గిల్, రుతురాజ్, శ్రేయస్.. సీనియర్లకు విశ్రాంతి
సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను (టీమ్ ఏ, బి, సి, డి) ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్లకు శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొననున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ మినహా టీమిండియా మొత్తం ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తుంది.టీమ్ ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.టీమ్ బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , ఎన్ జగదీసన్ (వికెట్‌కీపర్).టీమ్ సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, బాబా ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, ఆర్యన్ జుయల్ (వికెట్‌కీపర్), సందీప్ వారియర్.టీమ్ డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), సౌరభ్ కుమార్.షెడ్యూల్..సెప్టెంబర్ 5-8: తొలి మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ బిరెండో మ్యాచ్- టీమ్ సి వర్సెస్ టీమ్ డిసెప్టెంబర్ 12-15: మూడో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ డినాలుగో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ సిసెప్టెంబర్ 19-22: ఐదో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ డిఆరో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి -
గిల్ కంటే అతడే బెటర్.. ఇద్దరినీ ఆడిస్తే తప్పేంటి?
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు వరుస అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. శుబ్‌మన్ గిల్ జట్టులో ఉన్నాడనే కారణంతో రుతును పక్కనపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. గిల్‌తో పోలిస్తే రుతురాజ్ ఆటలో నిలకడ ఎక్కువని పేర్కొన్నాడు. కాబట్టి అతడిపై కూడా సెలక్టర్లు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు.ఇద్దరికీ ఆ అర్హతస్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వారసులు కాగల అర్హత ఈ ఇద్దరికీ ఉందని ఊతప్ప పేర్కొన్నాడు. కాగా పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టుకు గిల్ సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు.ఈ క్రమంలో టీమిండియా భవిష్య కెప్టెన్‌గా ప్రశంసలు అందుకుంటున్న గిల్‌కు శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్‌గా అవకాశమిచ్చింది. టీ20లలో సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించింది. ఇక టీ20లలో గిల్ యశస్వి జైస్వాల్‌తో పాటు ఓపెనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓపెనర్లుగా టీ20లలో ఈ జోడీ ఫిక్సయిపోయినట్లే!.. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కెరీర్ ప్రమాదంలో పడింది. రుతు కూడా ఓపెనరే కావడంతో ఇప్పటికే జట్టులో పాతుకుపోయిన గిల్- యశస్వితో పోటీలో అతడు వెనుకబడ్డాడు. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ రుతురాజ్‌కు అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు.ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే‘‘గిల్, రుతు.. ఇద్దరూ మంచి ప్లేయర్లే. టీ20 క్రికెట్లో తమకు తామే సాటి. వారి బ్యాటింగ్ గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. వీరిద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కష్టం. అయితే, ఆటలో నిలకడ పరంగా చూస్తే గిల్ కంటే రుతురాజే ముందున్నాడని చెప్పవచ్చు. ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇచ్చే బదులు ఇద్దరినీ జట్టులో ఆడిస్తే తప్పేంటి. ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే. అలాంటపుడు ఇద్దరికీ సమాన అవకాశాలు ఇస్తే బాగుంటుంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. అయితే, ఊతప్పతో పాటు ఈ షోలో పాల్గొన్న శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ మాత్రం.. తాను ఈ విషయంలో గిల్‌కే ఓటు వేస్తానని చెప్పడం విశేషం.గిల్, రుతు కెరీర్ ఇలాకాగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్.. ఇప్పటి వరకు 25 టెస్టులు, 44 వన్డేలు, 20 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1492, 2271, 539 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ, ఒక టీ20 సెంచరీ ఉన్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్.. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 6 వన్డే, 23 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 115, 633 పరుగులు సాధించాడు. టీ20లలో రుతు కూడా శతకం బాదడం విశేషం. ఇక శ్రీలంక పర్యటనలో గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. రుతును ఈ టూర్‌కు ఎంపిక చేయలేదు సెలక్టర్లు.చదవండి: భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్.. తొలి బ్యాటర్‌గా రికార్డుManu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం.. -
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం కెప్టెన్‌గా ఎంపిక! ఎవరంటే?
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు 28 మంది సభ్యులతో కూడిన తమ జట్టును మహారాష్ట్ర క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంసీఏ నియమించింది. గత సీజన్లో మహారాష్ట్ర జట్టుకు సారథ్యం వహించిన కేదార్ జాదవ్.. ఈ ఏడాది జూన్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. గత రంజీ సీజన్లో మహారాష్ట్ర జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో ఈ ఏడాది సీజన్లో కొత్త కెప్టెన్, కోచ్‌తో మహారాష్ట్ర బరిలోకి దిగనుంది. మహారాష్ట్ర హెడ్‌కోచ్‌గా సులక్షణ కులకర్ణి వ్యవహరించనున్నాడు.గతంలో తమిళనాడు జట్టుకు సులక్షణ కోచ్‌గా పనిచేశాడు. ఇక రుతురాజ్ కెప్టెన్‌గా అనుభవం ఉంది. అతడు ఇప్పటికే మహారాష్ట్ర జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కూడా రుతురాజ్ ఉన్నాడు. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే భారత జట్టు ఆసియాక్రీడల్లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. రుతురాజ్ చివరగా భారత తరపున జింబాబ్వే సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటకి.. శ్రీలంక పర్యటనకు అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అతడిని కాదని రియాన్ పరాగ్, శివమ్ దూబే వంటి వారికి చోటు ఇవ్వడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. ఇక రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ఆక్టోబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు మహారాష్ట్ర జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సౌరభ్ నవాలే, అంకిత్ బవానే, మందార్ భండారీ, నిఖిల్ నాయక్, హితేష్ వాలుంజ్, సిద్ధేష్ వీర్, విక్కీ ఓస్త్వాల్, సచిన్ దాస్, సత్యజీత్ బచావ్, హర్షల్ కేట్, తరంజిత్‌సింగ్ ధిల్లాన్, యశ్ క్షీర్హన్కర్ సోలంకి, ప్రశాంత్ రాజ్కర్ సోలంకి, రాజ్కర్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, రామకృష్ణ ఘోష్, దిగ్విజయ్ పాటిల్, ముఖేష్ చౌదరి, అజీమ్ కాజీ, ప్రదీప్ దధే, సిద్ధార్థ్ మ్హత్రే, మనోజ్ ఇంగాలే, మెహుల్ పటేల్, రజనీష్ గుర్బానీ, ముర్తాజా ట్రంక్వాలా, వైభవ్ గోసావి. -
రుతురాజ్, అభిషేక్‌లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్
త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.ఇరు జట్లకు వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.వన్డే జట్టుకు హర్షిత్ రాణా కొత్తగా ఎంపిక కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20 వరల్డ్‌కప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి వన్డేల్లో కొనసాగనుండగా.. హార్దిక్ పాండ్యాకు వన్డే జట్టులో చోటు దక్కలేదు.రుతురాజ్, అభిషేక్‌లకు మొండిచెయ్యి.. వన్డేల్లో సంజూను నో ఛాన్స్తాజాగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో మెరిసిన అభిషేక్ శర్మ.. గత ఏడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో 70కి పైగా సగటుతో పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ రెండు జట్లలో (టీ20, వన్డే) చోటు దక్కించుకోలేకపోయారు. టీ20ల్లో ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. తానాడిన చివరి వన్డేలో (సౌతాఫ్రికా) సెంచరీ చేసిన సంజూ శాంసన్ వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన గిల్.. జింబాబ్వే టార్గెట్ 183
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
టాప్ ర్యాంక్ కోల్పోయిన హార్దిక్.. ఏడో స్థానానికి ఎగబాకిన రుతురాజ్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ సత్తా చాటారు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సుడిగాలి శతకంతో ఇరగదీసిన అభిషేక్.. ఎంట్రీలోనే అదుర్స్ అనిపించుకోగా.. అదే మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన రుతు.. 13 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. అభిషేక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లిస్ట్ అయిన తొలిసారే 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్ నుంచి టాప్-10 రుతురాజ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. గత వారమే అగ్రపీఠాన్ని కోల్పోయిన స్కై.. రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ టీ20 బ్యాటర్‌గా ట్రవిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్, రుతురాజ్, బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్, మార్క్రమ్ వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, హసరంగ టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, అకీల్ హొసేన్, ఆడమ్ జంపా, ఫజల్హక్ ఫారూఖీ, అక్షర్ పటేల్, తీక్షణ నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ మినహా టాప్-10లో ఎవరూ లేరు. కుల్దీప్ 11, బుమ్రా 14, భిష్ణోయ్ 16, అర్ష్‌దీప్ 19 స్థానాల్లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండిన హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి పడిపోయాడు. హసరంగ టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ 12వ స్థానంలో ఉన్నాడు.టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా టాప్-5లో ఉన్నాయి. -
దెబ్బకు దెబ్బ.. టీమిండియా చేతిలో జింబాబ్వే చిత్తు
జింబాబ్వేతో రెండో టీ20లో యువ టీమిండియా అదరగొట్టింది. ఆతిథ్య జట్టును వంద పరుగుల తేడాతో మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.దెబ్బకు దెబ్బ కొట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ గెలుపు ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఖాతాలో కెప్టెన్‌గా తొలి విజయం నమోదైంది.దుమ్ములేపిన అభిషేక్.. రాణించిన రుతురాజ్హరారే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.తొలి టీ20లో విఫలమైన ఈ పంజాబీ బ్యాటర్ తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసి తన విలువ చాటుకున్నాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.అభిషేక్ శర్మకు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అర్థశతకం (47 బంతుల్లో 77 పరుగులు) తో అజేయంగా నిలిచాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రింకూ సింగ్ (22 బంతుల్లో 48 పరుగులు నాటౌట్, ఫోర్లు 2, సిక్సర్లు 5) రుతురాజ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో యువ భారత జట్టు కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 234 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.జోరుగా హుషారుగా వికెట్లు...ఓపెనర్ ఇన్నోసెంట్ కయా (4)ను ముకేష్‌కుమార్ ఆదిలోనే వెనక్కి పంపించాడు. అయితే, రెండో వికెట్ తీయడానికి భారత బౌలర్లు కాస్త శ్రమించాల్సి వచ్చింది. మరో ఓపెనర్ వెస్లే మెదెవెరె(43), వన్‌డౌన్ బ్యాటర్ బ్రియాన్ బ్యానెట్ (26) తేలికగా తలొగ్గలేదు.బ్యానెట్‌ను ముకేష్‌కుమార్ ఔట్ చేయగా.. రవి బిష్ణోయ్ వెస్లే పని పట్టాడు. ఇదే జోరును భారత బౌలర్లు కొనసాగించడంతో జింబాబ్వే మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఈక్రమంలో లోయర్ ఆర్డర్లో వచ్చిన ల్యూక్ జాంగ్వే 33 పరుగులు చేసి కాసేపు పోరాడాడు. ముకేష్ దెబ్బకు అతడుకూడా పెవిలియన్ చేరక తప్పలేదు.ఈక్రమంలో 18.4 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 134 పరుగులు మాత్రమే చేసి 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.టీమిండియా బౌలర్లలో ముకేష్‌కుమార్, ఆవేశ్‌ఖాన్ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. రవి బిష్ణోయ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. భారత్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. -
అభిషేక్, రుతురాజ్, రింకూ ఊచకోత.. జింబాబ్వే టార్గెట్ 235 పరుగులు
హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.జింబాబ్వే బౌలర్లకు అభిషేక్ చుక్కలు చూపించాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ 47 బంతుల్లో 11 ఫోర్లు,1 సిక్స్‌తో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రింకూ సింగ్( తన బ్యాట్‌కు పనిచెప్పాడు. రింకూ కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 పరగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజుబ్రానీ,మసకజ్డా తలా వికెట్ సాధించారు. -
పాపం రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో ఇలా ఎవరూ రనౌటై ఉండరు..!
టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ వినూత్న రీతిలో రనౌటై వార్తల్లో నిలిచాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో పుణేరీ బప్పా టీమ్‌కు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 7) రత్నగిరి జెట్స్తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా రనౌటయ్యాడు. పుణేరీ బప్పా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రుతు రెండు పరుగులు రాబట్టే ప్రయత్నంలో బాధాకరమైన రీతిలో రనౌటయ్యాడు. రుతు రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీజ్‌లోకి చేరకముందే బ్యాట్‌కు అతని చేతికి కనెక్షన్ కట్టైంది. రుతురాజ్ బ్యాట్ క్రీజ్‌లోకి చేరినా అది అతని చేతిలో నుంచి జారిపోయింది. ఈ లోపు వికెట్‌కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. రీప్లేలో రుతురాజ్ బ్యాట్ క్రీజ్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా బ్యాట్ అతని చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ రనౌట్ డ్రామాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.Ruturaj Gaikwad was dismissed in a bizarre fashion during Maharashtra Premier League (MPL).pic.twitter.com/zQHMxWt1kX— OneCricket (@OneCricketApp) June 7, 2024కాగా, ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సారథ్యం వహిస్తున్న పుణేరీ బప్పా జట్టు ప్రత్యర్థి రత్నగిరి జెట్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుణేరీ టీమ్ 19.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. రత్నగిరి బౌలర్లలో సత్యజిత్ (4-0-24-4) పుణేరీ టీమ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. పుణేరీ ఇన్నింగ్స్‌లో పవన్ షా (32), రుతురాజ్ (29), యశ్ సాగర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రత్నగిరి టీమ్.. 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ధీరజ్ (25), అజిమ్ ఖాజీ (31), నిఖిల్ నాయక్ (27 నాటౌట్), సత్యజిత్ (17 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రత్నగిరి జెట్స్‌ను గెలిపించారు. -
ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించిన రుతురాజ్.. మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభణ
యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2024 ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ లీగ్‌లో పూణేరీ బప్పాకు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 4) కొల్హాపూర్ టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్దశతకం (35 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఫలితంగా పూణేరీ బప్పా 22 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. రుతు ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఈగల్ నాసిక్ టైటాన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతు.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లోనూ తన జట్టుకు (పూణేరీ బప్పా) నాయకత్వం వహిస్తున్నాడు. అయితే రుతు ఐపీఎల్లోలా ఎంపీఎల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అతను మిడిలార్డర్లో బరిలోకి దిగాడు.మ్యాచ్ విషయానికోస్తే.. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణేరీ బప్పా 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పూణేరీ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. RUTURAJ GAIKWAD SHOW...!!!!- Captain Ruturaj smashed 61*(35) in 14 over game while batting in the middle order in the Maharashtra Premier League. 🔥🌟 pic.twitter.com/dumVXn87br— Johns. (@CricCrazyJohns) June 4, 2024శుభమ్ తైస్వాల్ (10), సూరజ్ షిండే (24), రాహుల్ దేశాయ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కొల్హాపూర్ టస్కర్స్ బౌలర్లలో నిహాల్ తుసామద్ 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్ చవాన్ 2, యశ్ కలాద్కర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టస్కర్స్ 14 ఓవర్లు బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూణేరీ బౌలర్లు పియుశ్ సాల్వీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టారు. హర్ష్ సాంగ్వి (38), అంకిత్ పోర్వాల్ (28), అంకిత్ బావ్నే (21) ఓ మోస్తరు పరుగులు చేసినా టస్కర్స్‌కు ఓటమి తప్పలేదు. కాగా, కొద్ది రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ 2024లో రుతురాజ్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 14 మ్యాచ్‌ల్లో సెంచరీ, నాలుగు అర్దసెంచరీల సాయంతో 583 పరుగులు చేశాడు. 15 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్దసెంచరీల సాయంతో 741 పరుగులు చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి సీజన్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. -
MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2024లో వికెట్ కీపర్‌గా కళ్లు చెదిరే క్యాచ్‌లతో అదరగొట్టిన తలా.. లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గానూ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు.వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పవర్ఫుల్ సిక్సర్లతో విరుచుకుపడుతూ కావాల్సినంత వినోదం పంచాడు. అయితే, ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో అభిమానులు నిరాశ చెందారు.లీగ్ దశలోనే ముగిసిన ప్రయాణంచావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సేన ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిపోయింది.అయితే, ఈ మ్యాచ్‌లో ధోని మెరుపులు మెరిపించడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. 13 బంతుల్లో 3 ఫోర్లు, ఓ భారీ సిక్సర్ సాయంతో తలా 25 పరుగులు సాధించాడు. ఇక 42 ఏళ్ల ఈ ‘జార్ఖండ్ డైనమైట్’కు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ధోని ఫిట్నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెటర్‌గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాలియువ ఆటగాళ్లతో పోటీ పడటం అంత తేలికేమీ కాదని.. క్రికెటర్‌గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘నేను ఏడాదంతా క్రికెట్ ఆడుతూనే ఉండను.కేవలం లీగ్ క్రికెట్ కోసమే మైదానంలో దిగుతాను. అయినా ఎల్లప్పుడూ ఫిట్‌గానే ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్న యువ ఆటగాళ్లను ఎదుర్కోవాలి కాబట్టి నేనూ వారిలాగే ఫిట్‌గా ఉండాలి.వయసును సాకుగా చూపలేంఎందుకంటే ప్రొఫెషనల్ క్రికెట్లో వయసు కారణంగా ఎవరూ మనకు డిస్కౌంట్ ఇవ్వరు. ఒకవేళ మనం ఆడాలని నిర్ణయించుకుంటే కచ్చితంగా అందుకు తగ్గట్లుగా ఫిట్నెస్ మెయింటెన్ చేయాలి.వయసును సాకుగా చూపి మనం ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. అందుకే ఆహారపుటలవాట్లు మొదలు వ్యాయామం, ప్రాక్టీస్ వంటి విషయాల్లో కచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందే’’ అని ధోని పేర్కొన్నాడు. దుబాయ్ ఐ 103.8 చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది సీఎస్కేను చాంపియన్‌గా నిలిపిన ధోని.. ఈ ఏడాది కెప్టెన్సీ నుంచి వైదొలిగి పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2024: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024 -
రాజస్తాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.చెపాక్ వేదికగా రాజస్తాన్‌తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. -
CSK Vs RR: రాజస్తాన్, సీఎస్కే రసవత్తర పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. సీఎస్కే జట్టులోకి థీక్షణ రాగా.. రాజస్తాన్ జట్టులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు.ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రాజస్తాన్ భావిస్తుంటే.. సీఎస్కే సైతం ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్, మహేశ్ తీక్షణరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్ -
MS Dhoni: ధోనిని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నాడు.అదే విధంగా.. ధోని ఏ స్థానంలోనైనా ఆడగలడని అందుకే గత మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడని ఫ్లెమింగ్ తెలిపాడు. కాగా గతేడాది నుంచి ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.అయినప్పటికీ 42 ఏళ్ల తలా ఐపీఎల్-2024 బరిలో దిగాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తన టీ20 కెరీర్లో తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని తప్పుబట్టారు. జట్టు కోసం అతడు ఏడో స్థానంలోనే రావాలని.. అలా కాని పక్షంలో తుదిజట్టులో ఉండకూడదని ఘాటు విమర్శలు చేశారు.ఈ క్రమంలో మోకాలి నొప్పి కారణంగానే బ్యాటింగ్ తగ్గించి.. వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు.గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం చెన్నై మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు కేవలం సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. ఏ స్థానంలో వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు.అతడు తొమ్మిదో స్థానంలో వచ్చినంత మాత్రాన ప్రభావం చూపలేడని భావించవద్దు. జట్టు కోసం తనేం చేయగలడో తప్పకుండా చేస్తాడు.అతడి సేవలను అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటాం. అయితే, ఒత్తిడి పెంచి అతడు జట్టుకు దూరమయ్యేలా చేసుకోలేం. జట్టు కోసం తను ఎల్లప్పుడూ పరితపిస్తాడు. అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అహ్మదాబాద్‌లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది. చదవండి: Mohammed Shami Slams LSG Owner: కాస్తైనా సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా? -
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరుకుంది. సీఎస్కే విజయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. జట్టులో కొంతమంది ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నప్పటికి తమకు అద్బుతమైన విజయాన్ని అందించారని రుతురాజ్ కొనియాడాడు. "ధర్మశాల వికెట్ చాలా స్లోగా ఉంది. అంతే కాకుండా బంతి బాగా లో బౌన్స్ కూడా అయింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడే మా స్కోర్ బోర్డులో 180-200 పరుగులు ఉంచాలనకున్నాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాము. ఆ సమయంలో మాకు 160 నుంచి 170 పరుగుల మధ్య స్కోర్ వస్తే చాలు అని భావించాము. మేము సరిగ్గా 167 పరుగులు సాధించాము. ఈ స్కోర్‌ను మేము డిఫెండ్ చేసుకుంటామన్న నమ్మకం మాకు ఉండేది. మా బౌలర్లు న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సిమర్జీత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో తను తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికి తన అనుభవాన్ని చూపించాడు. అతడు గత సీజన్లో కూడా 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక వికెట్లు కోల్పోయినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటర్‌గా దించాలనుకున్నాము. బ్యాటర్ అయితే 10-15 పరుగులు అదనంగా చేస్తాడని భావించాము. కానీ ఆఖరి నిమిషంలో మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. ఆ నిర్ణయమే మాకు విజయాన్ని అందించింది. సిమర్జీత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు మా జట్టులో కొంత మంది ఆటగాళ్లు ప్లూ జ్వరంతో బాధపడ్డారు. మ్యాచ్ ముందు వరకు ఎవరూ జట్టు సెలక్షన్‌కు ఉంటారో క్లారిటీ కూడా లేదు. అటువంటిది ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రుతు పేర్కొన్నాడు. -
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను టాస్ దరిద్రం వెంటాడుతూ ఉంది. రుతు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏకంగా పదింట టాస్ ఓడాడు. పంజాబ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి టాస్ ఓడిన రుతు.. ప్రత్యర్ది ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగాడు.టాస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు (టాస్ ప్రాక్టీస్) తీసుకుంటున్నా రుతురాజ్ వరుసగా టాస్ ఓడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన రుతు ఓ ఆల్ టైమ్ చెత్త రికార్డును సమం చేశాడు.ఐపీఎల్లో తొలి 11 మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్) చెత్త రికార్డును సమం చేశాడు. సంజూ 2022 సీజన్లో తొలి 11 మ్యాచ్‌ల్లో 10 సార్లు టాస్ ఓడాడు. రాజస్థాన్, సీఎస్కే తర్వాత తొలి 11 మ్యాచ్‌ల అనంతరం అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై 2011 సీజన్లో తొమ్మిదింట టాస్ ఓడింది. 2013 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తొలి 11 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట టాస్ ఓడింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న సీఎస్కే తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్ ఇచ్చి ఆజింక్య రహానే (9) ఔట్ కాగా.. రుతురాజ్ (25), డారిల్ మిచెల్ (25) క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే -
గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై మాజీ కెప్టెన్ క్రిష్టమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. తమకు ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శన బాగా లేకపోయినా వారికి వరుస అవకాశాలు ఇస్తోందంటూ మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.తమకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసేందుకు.. అర్హత కలిగిన ఆటగాళ్లను పక్కనపెట్టడం ద్వంద్వనీతికి నిదర్శనం అంటూ బీసీసీఐ విధానాలను విమర్శించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది.ఐర్లాండ్‌తో జూన్ 5 నాటి మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.శుబ్‌మన్ గిల్ అసలు ఫామ్‌లోనే లేడుఇందులో ఓపెనర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చోటు దక్కించుకోగా.. శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘‘శుబ్‌మన్ గిల్ అసలు ఫామ్‌లోనే లేడు.అయినా అతడికి జట్టులో స్థానం కల్పించారు. నిజానికి రుతురాజ్ గైక్వాడ్‌కు టీమ్‌లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌లో 500 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టు మీద సెంచరీ చేశాడు.కానీ సెలక్టర్లకు శుబ్‌మన్ గిల్ మాత్రమే కనిపిస్తాడు. వరుసగా విఫలమైనా అతడికే ఛాన్సులు ఇస్తారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్లోనైనా వరుస వైఫల్యాలు జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేయలేవు.తమకు నచ్చిన ఆటగాళ్లకేసెలక్షన్ విషయంలో ఫేవరిటిజం ఉంది. తమకు నచ్చిన ఆటగాళ్లకే సెలక్టర్లు అవకాశం ఇచ్చారు’’ అంటూ తూర్పారబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ చీకి చిక్కా వేదికగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లో కలిపి 509 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.మరోవైపు.. శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా, ఆటగాడిగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 320 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో చిక్కా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. వెంటనే డకౌటయ్యాడు! వీడియో “Gill playing ahead of Rutu baffles me. Be is out of form and Rutu has had a better t20i career than gill. Gill will keep failing and he ll keep getting chances, he has favouritism of the selectors, this is just too much of favouritism” Krishnamachari Srikanth in his YT vid pic.twitter.com/PJmeiihxVx— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) May 1, 2024 -
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు పంజాబ్ కింగ్స్ ఊహించని షాకిచ్చింది. చెపాక్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, రబాడ తలా వికెట్ సాధించారు.బెయిర్ స్టో, రోసౌ విధ్వంసం..163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో, ఫస్ట్ డౌన్ ఆటగాడు రుసౌ విధ్వంసం సృష్టించారు. బెయిర్ స్టో 46 పరుగులు చేయగా.. రుసౌ 43 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు కెప్టెన్ సామ్ కుర్రాన్(27), శశాంక్ సింగ్(25) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. సీఎస్కే బౌలర్లలో శివమ్ దూబే,శార్ధూల్ ఠాకూర్, గ్లీసన్ తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రుతురాజ్ మెరిశాడు. 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రుతురాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన సీఎస్కే కెప్టెన్‌గా గైక్వాడ్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 509 పరుగులు చేసిన గైక్వాడ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే లెజెండ్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఐపీఎల్-2013లో 461 పరుగులు చేశాడు. తాజా సీజన్‌తో ధోని ఆల్‌టైమ్ రికార్డును గైక్వాడ్ బ్రేక్ చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రుతురాజ్(509) కొనసాగుతున్నాడు. రెండో స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(500) పరుగులతో ఉన్నాడు. Most runs by a CSK captain in an IPL season:509* - R Gaikwad in 2024 (10 mat)461 - MS Dhoni in 2013 (18 mat)455 - MS Dhoni in 2018 (16 mat)416 - MS Dhoni in 2019 (15 mat)414 - MS Dhoni in 2008 (16 mat)Ruturaj Gaikwad becomes the first CSK captain to score 500+ runs in an… pic.twitter.com/T73Q8Y3aac— CricTracker (@Cricketracker) May 1, 2024 -
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. సీఎస్కే బ్యాటర్లు కాస్త తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినప్పటికి రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడి తన జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందిచాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. రుతురాజ్‌తో పాటు ధోని 14 పరుగులతో రాణించాడు.పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, రబాడ తలా వికెట్ సాధించారు. -
బేబీ రాబోతోంది.. నొప్పులు మొదలయ్యాయి: సాక్షి ధోని పోస్ట్ వైరల్
ఐపీఎల్-2024లో వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆరు నుంచి ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది.హైదరాబాద్‌లో తమకు సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాభవానికి సీఎస్కే బదులు తీర్చుకోవడంతో జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అభిమానుల ఆనందానికి కూడా హద్దుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో... సీఎస్కే విజయానికి చేరవవుతున్న క్రమంలో చెన్నై స్టార్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. డారిల్ మిచెల్(32 బంతుల్లో 52) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. శివం దూబే మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్(20 బంతుల్లో 39 నాటౌట్) దుమ్ములేపాడు.134 పరుగులకే ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. సీఎస్కే బౌలర్ల దెబ్బకు 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా ఉన్న రైజర్స్ ఇన్నింగ్స్‌లో 32 టాప్ స్కోరు(ఐడెన్ మార్క్రమ్)గా నమోదైంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీశ పతిరణ చెరో రెండు, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. వీరి అద్భుత ప్రదర్శన కారణంగా హైదరాబాద్ జట్టు 78 పరుగుల తేడాతో ఓడిపోయింది.పురిటి నొప్పులు మొదలయ్యాయిఈ నేపథ్యంలో సాక్షి సింగ్ ధోని.. ‘‘ఈరోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయండి. చిన్నారి రాబోతోంది... పురిటి నొప్పులు మొదలయ్యాయి. కాబోయే మేనత్త నుంచి మీకిదే నా అభ్యర్థన’’ అంటూ సాక్షి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. సీఎస్కే విజయం తర్వాత ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చెన్నై గెలుపు నేపథ్యంలో.. ‘‘కాబోయే అత్తకు రెండు శుభవార్తలు.. కంగ్రాట్స్’’ అంటూ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 -
సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘనత సాధించింది. టీ20ల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్కే రికార్డులకెక్కింది. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో మ్యాచ్‌లో 212 పరుగులు చేసిన సీఎస్కే..ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంది. టీ20 క్రికెట్లో చెన్నై ఇప్పటివరకు 35 సార్లు 200పైగా పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ కౌంటీ జట్టు సోమర్సెట్ పేరిట ఉండేది. సోమర్సెట్ టీ20ల్లో 34 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించింది. తాజా మ్యాచ్‌తో సోమర్సెట్ వరల్డ్ రికార్డును సీఎస్కే బ్రేక్ చేసింది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అయితే ఈ రికార్డు టీమిండియా పేరిట ఉంది. భారత జట్టు 32 సార్లు 200పైగా పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్ ఔటయ్యాడు. -
రుతురాజ్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్ ఔటయ్యాడు.ఇక సీఎస్కే బ్యాటర్లలో గైక్వాడ్‌తో పాటు మిచెల్(52), శివమ్ దూబే(39 నాటౌట్) పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అందరూ పూర్తిగా తేలిపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కట్ తలా వికెట్ సాధించారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్,నటరాజన్ ఇద్దరి కలిసి ఏకంగా 92 పరుగులు సమర్పించుకున్నారు. -
సీఎస్కేతో ఎస్ఆర్హెచ్ పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. కాగా ఈ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాయి. సీఎస్కే లక్నో సూపర్ జెయింట్స్‌తో చేతిలో పరాజయం పాలవ్వగా.. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ మూడో స్ధానంలో కొనసాగుతుండగా.. సీఎస్కే ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానాసన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
CSK Vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం!
‘‘ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. అయితే, మ్యాచ్ మాత్రం బాగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడింది. 13- 14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది.అయితే, స్టొయినిస్ గొప్ప ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. పిచ్ మీద తేమ ఎక్కువగా ఉంది. అందుకే మా స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లేదంటే ఫలితం వేరేలా ఉండేది.అయినా.. ఆటలో ఇవన్నీ సహజమే. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. పవర్ ప్లేలోనే రెండో వికెట్ కోల్పోయిన వేళ జడ్డూ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది.పవర్ ప్లే తర్వాత వికెట్ పడితే శివం దూబేను రంగంలోకి దించాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగానే మా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. మేము ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇంత తేమ కనిపించలేదు. ఏదేమైనా ఎల్ఎస్జీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. వాళ్లు మెరుగ్గా ఆడినందువల్లే పైచేయి సాధించగలిగారు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.ఓటమికి కారణం అదేఇంకాస్త మెరుగైన స్కోరు సాధిస్తే బాగుండేదని.. మార్కస్ స్టొయినిస్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్లో తొలుత లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన సీఎస్కేకు.. సొంత మైదానం చెపాక్‌లోనూ చేదు అనుభవం ఎదురైంది.తమకు కంచుకోట అయిన చెపాక్‌లో చెన్నై భారీ స్కోరు సాధించినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్(60 బంతుల్లో 108 నాటౌట్)తో దుమ్ములేపగా.. శివం దూబే(27 బంతుల్లో 66) మరోసారి ధనాధన్ దంచికొట్టాడు.What an incredible innings by Ruturaj Gaikwad !! Had people getting out right & left but made sure to be play well & be there right till the end ! A super century as he made 108* today 👏🏻 a true captain's innings!#LSGvsCSK • #RuturajGaikwad • #CSKvLSGpic.twitter.com/YdDSvde6w5— ishaan (@ixxcric) April 23, 2024వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా.. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆదిలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కెప్టెన్ కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే, వన్‌డౌన్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచి సీఎస్కే ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో నికోలస్ పూరన్ 15 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 19.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసిన లక్నో.. చెన్నై కంచుకోటలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఐదో విజయం అందుకుని టాప్-4లోకి చేరుకుంది.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్‌ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్‌కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్‌ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్‌లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్‌ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్‌లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
స్టొయినిస్ విధ్వంసం
చెన్నై: నాలుగు రోజుల క్రితం లక్నో వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఇప్పుడు చెన్నైలో రీప్లేగా జరిగిన పోరులో లక్నోనే మళ్లీ ‘సూపర్’గా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ‘హిట్టర్’ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. పూరన్‌తో నాలుగో వికెట్‌కు 70 పరుగులు, దీపక్ హుడాతో అబేధ్యమైన ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించిన స్టొయినిస్ లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్... రహానే (1), వన్‌డౌన్‌లో మిచెల్ (11), జడేజా (16) చెన్నై టాప్–4 బ్యాటర్లలో ముగ్గురి స్కోరిది! పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 49/2 తక్కువే! ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ బౌండరీలతో పరుగుల వేగాన్ని అందుకున్నాడు. గైక్వాడ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 11.3 ఓవర్లలో వందకు చేరింది. అదే ఓవర్లో జడేజా నిష్క్రమించడంతో వచ్చిన దూబే ఓ రకంగా శివతాండవమే చేశాడు. 15 ఓవర్లలో చెన్నై 135/3 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత దూబే పవర్‌ప్లే మొదలైంది. భారీ సిక్సర్లతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. 16వ ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్స్‌లతో 19 పరుగులు, 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4లతో 16 పరుగులు, 19వ ఓవర్లో మళ్లీ దూబే దంచేయడంతో 17 పరుగులు, ఆఖరి ఓవర్లో 15 పరుగులతో స్కోరు 200 పైచిలుకు చేరింది. చివరి 5 ఓవర్లలో దూబే వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై 75 పరుగులు సాధించింది. గైక్వాడ్ 56 బంతుల్లో శతకాన్ని, దూబే 22 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. బ్యాటింగ్ గేర్ మార్చి... కొండంత లక్ష్యం ముందున్న లక్నోకు ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్లు డికాక్ (0), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (19 బంతుల్లో 13) నిరాశపరిచారు. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్టొయినిస్ ఒక్కడే గెలిపించేదాకా మెరిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తర్వాత నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరు పెంచగానే... పతిరణ మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ 56 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీపక్ హుడా కూడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌కు పని చెప్పడంతో అనూహ్యంగా లక్నో లక్ష్యం వైపు పరుగు పెట్టింది. 18 బంతుల్లో 47 పరుగుల కష్టమైన సమీకరణం ఇద్దరి దూకుడుతో సులువైంది. 18, 19వ ఓవర్లలో 15 పరుగుల చొప్పున వచ్చాయి. 6 బంతుల్లో 17 పరుగుల్ని స్టొయినిస్ 6, 4, నోబాల్4, 4లతో ఇంకో మూడు బంతులు మిగిల్చి ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రాహుల్ (బి) హెన్రి 1; రుతురాజ్ (నాటౌట్) 108; మిచెల్ (సి) హుడా (బి) యశ్ 11; జడేజా (సి) రాహుల్ (బి) మోసిన్ 16; దూబే (రనౌట్) 66; ధోని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–4, 2–49, 3–101, 4–205. బౌలింగ్: హెన్రీ 4–0–28–1, మోసిన్ ఖాన్ 4–0–50–1, రవి బిష్ణోయ్ 2–0–19–0, యశ్ ఠాకూర్ 4–0–47–1, స్టొయినిస్ 4–0–49–0, కృనాల్ పాండ్యా 2–0–15–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) దీపక్ 0; రాహుల్ (సి) రుతురాజ్ (బి) ముస్తఫిజుర్ 16; స్టొయినిస్ (నాటౌట్) 124; పడిక్కల్ (బి) పతిరణ 13; పూరన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 34; హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–88, 4–158. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–1, తుషార్ 3–0–34–0, ముస్తఫిజుర్ 3.3–0–51–1, శార్దుల్ 3–0–42–0, మొయిన్ అలీ 2–0–21–0, జడేజా 2–0–16–0, పతిరణ 4–0–35–2. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర సెంచరీ..12 ఫోర్లు, 3 సిక్స్‌లతో! వీడియో
ఐపీఎల్-2024లో చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లను రుతురాజ్ ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 54 బంతుల్లోనే గైక్వాడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గైక్వాడ్‌కు ఇది తన ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి సీఎస్కే 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబే మరోసారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో మాట్ హెన్రి, యశ్ ఠాకూర్, మోహ్షిన్ ఖాన్ తలా వికెట్ సాధించారు. The Guiding Star! 🌟🦁#CSKvLSG #WhistlePodu 🦁💛 pic.twitter.com/aUsekAgySQ — Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2024 -
Ruturaj Gaikwad: ఆ యువ వికెట్ కీపర్ వల్లే ఇదంతా.. అతడు కూడా అదుర్స్
మహేంద్ర సింగ్ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ బ్యాట్‌తో దుమ్ములేపుతున్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ దిగ్గజ సారథి.. ప్రస్తుతం 27 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అవసరమైనప్పుడల్లా సలహాలు, సూచనలు ఇస్తూనే.. తనంతట తాను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పిస్తూ రుతుకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడంలో ధోని తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ ‘జార్ఖండ్ డైనమైట్’ కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్ల సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. తలా ఇన్నింగ్స్ చూడాలంటూ ఆశపడిన అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 శివం దూబే(38 బంతుల్లో 66 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక ధోని సునామీ ఇన్నింగ్స్ కారణంగా సీఎస్కే 200 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన ముంబై 186 పరుగులకే పరిమితం కావడంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా జట్టులో ఉన్న యువ వికెట్ కీపర్ ఆ మూడు సిక్స్‌లు బాదడం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. వాంఖడే పిచ్ మీద కచ్చితంగా మాకు 10- 15 అదనపు పరుగులు అవసరమైన వేళ ఈ ఇన్నింగ్స్ వల్ల మేలు చేకూరింది’’ అని ధోనిని ప్రశంసించాడు రుతు. We agree with captain @Ruutu1331! ☺️#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/g5oHfgUH37 — IndianPremierLeague (@IPL) April 14, 2024 అదే విధంగా.. ‘‘మా జట్టులోని మలింగ(పతిరణ) ఈరోజు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. యార్కర్లతో ప్రత్యర్థుల మతి పోగొట్టాడు. తుషార్, శార్దూల్ కూడా బాగా ఆడారు. ఇక నేను కూడా కేవలం ఓపెనర్‌గా కాకుండా ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా’’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు ►టాస్: ముంబై.. బౌలింగ్ ►చెన్నై స్కోరు: 206/4 (20) ►ముంబై స్కోరు: 186/6 (20) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీశ పతిరణ(4/28). 2⃣nd win on the bounce 4⃣th win of the season @ChennaiIPL bag 2⃣ more points after a victory over #MI, despite a heroic Rohit Sharma TON! Scorecard ▶️ https://t.co/2wfiVhdNSY#TATAIPL | #MIvCSK pic.twitter.com/5mZMPulaNn — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
CSK Vs MI: రుతురాజ్ అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు! వీడియో
టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా గైక్వాడ్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులు చేసిన రుతు.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 57 ఇన్నింగ్స్‌లలోనే రుతురాజ్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్ 2,021 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు 16 ఫిప్టీలు ఉన్నాయి. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రుతురాజ్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు క్రిస్ గేల్ , షాన్ మార్ష్ ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్లో గైక్వాడ్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ 224 పరుగులు చేశాడు. అతడి సారథ్యంలో సీఎస్కే 6 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్దానంలో కొనసాగుతోంది. Shot of Authority from Ruturaj Gaikwad 🔥 pic.twitter.com/Hdp5z4cRvj — 🎰 (@StanMSD) April 14, 2024 -
గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025లో హిట్‌మ్యాన్ కచ్చితంగా జట్టు మారడతాడని అంచనా వేశాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో అతడు ప్రయాణం మొదలుపెట్టడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024కు ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్‌ను కాదని హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఫ్రాంఛైజీ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ జట్టును వీడాలని ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే ‘‘రోహిత్ శర్మ చెన్నైకి వెళ్లిపోతాడా? ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడా? రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడా? వచ్చే ఏడాది రోహిత్ జట్టుతో చేరేంత వరకు తాత్కాలిక సారథిగా ఉంటాడా? నేనైతే రోహిత్‌ను చెన్నై జట్టులో చూస్తాననే అనుకుంటున్నా’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్‌కు ఆడినా బాగానే ఉంటుంది అయితే, ఇందుకు హోస్ట్ బదులిస్తూ.. ‘‘రోహిత్ ముంబై జట్టును వీడితే అభిమానుల హృదయాలు ముక్కలైపోతాయి కదా?’’ అని పేర్కొనగా.. అవునంటూ వాన్ సమాధానమిచ్చాడు. సీఎస్కేకు కాకపోతే రోహిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లినా బాగానే ఉంటుందని.. గతంలో అతడు డెక్కన్ చార్జర్స్‌కు ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా మైకేల్ వాన్ గుర్తు చేశాడు. కాగా కెప్టెన్ మార్పు విషయాన్ని ముంబై ఇండియన్స్, రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ పాండ్యాపై ఆగ్రహం వెళ్లగక్కుతూ స్టేడియంలోనే అతడికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024లో పాండ్యా సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిన ముంబై.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలచింది. మరోవైపు రోహిత్ శర్మ ఇంత వరకు ఒక్క అర్ధ శతకం కూడా బాదలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిఇపి 156 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై ఐదింట మూడు విజయాలతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. చదండి: IPL 2024 LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేను అనుకున్నది చేశా.. ఎవరు ఏమి మాట్లాడుకున్నా పట్టించుకోను: రుతు
ఐపీఎల్-2024లో వరుసగా రెండు ఓటుములు చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతోంది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సీఎస్కే 17. 4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. సీఎస్కే లక్ష్య ఛేదనలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు. గైక్వాడ్ 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(28) మరోసారి అదరగొట్టాడు.కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది.సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే తలా మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ రెండు, థీక్షణ ఒక్క వికెట్‌సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. "తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు సంతృప్తిగా ఉంది. నా తొలి ఐపీఎల్ ఫిప్టీ సాధించినప్పుడు కూడా అచ్చెం ఇటువంటి పరిస్థితే. అప్పుడు మహి(ఎంఎస్ ధోని) భాయ్ నాతో ఉన్నాడు. ఇద్దరం కలిసి మ్యాచ్‌ను మగించాము. ఈ రోజు కూడా వికెట్ అలానే ఉంది. పిచ్ చాలా స్లోగా ఉంది. కాబట్టి కాస్త ఆచూతుచి ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ ఫినిష్ చేసేంతవరకు క్రీజులో ఉండాలనుకున్నాను. ఈ పిచ్‌పై స్ట్రైక్ రొటేట్ చేసి బౌండరీలు కొడితే 150 నుంచి 160 పరుగులు సాధించవచ్చు. కానీ మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్ధిని తక్కువే స్కోరుకే కట్టడి చేశాం. జడ్డూ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. సహజంగా పవర్‌ప్లే తర్వాత జడ్డూనే ఎటాక్‌లోకి వస్తాడు. దాని వెనుక ఎటువంటి వ్యూహాలు లేవు. ఇక మా జట్టులో ఏ విభాగంలోనూ ఎవరికి నేను ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఒక క్లారిటీ ఉంది. మహి భాయ్ ఇంకా జట్టులోనే ఉన్నారు. అదేవిధంగా ఫ్లెమింగ్ కూడా కోచ్‌గా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ను నేనేమి స్లోగా ప్రారంభించలేదు. టీ20లో మనం ఎదుర్కొనే తొలి రెండు మూడు బంతులు చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా సందర్భాల్లో దూకుడుగా ఆడి వికెట్ కోల్పోతాము. పరిస్ధితుల తగ్గట్టు ఆడి గెలిపించాలని నిర్ణయించకున్నా. అదే ఈ రోజు చేశా. నా స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమి మాట్లాడుకున్న నేను పట్టించుకోను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రుతు పేర్కొన్నాడు. They are 🔙 to winning ways 👍 Chennai Super Kings 💛 remain unbeaten at home with a complete performance 👏👏 Scorecard ▶ https://t.co/5lVdJVscV0 #TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/16nzv4vt8b — IndianPremierLeague (@IPL) April 8, 2024 -
రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు.. 5 ఏళ్లలో తొలి హాఫ్ సెంచరీ
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. రుతురాజ్ అద్భుతమైన హాఫ్ సెంచరీ మెరిశాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రుతు 58 బంతుల్లో9 ఫోర్లతో 67 చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన గైక్వాడ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. గత ఐదు ఏళ్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా నిలిచాడు. గత సీజన్ వరకు చెన్నై సారథిగా కొనసాగిన మహేంద్ర సింగ్ ధోనీ గత ఐదు సీజన్లలో ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. సీఎస్కే కెప్టెన్‌గా ధోని చివరగా 2019లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే 2022 సీజన్లో మిస్టర్ కూల్ హాఫ్ సెంచరీ నమోదు చేసినా.. అప్పుడు రవీంద్ర జడేజా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ధోని చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకుని రుతురాజ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ను 7 వికెట్ల తేడాతో సీఎస్కే చిత్తు చేసింది. They are 🔙 to winning ways 👍 Chennai Super Kings 💛 remain unbeaten at home with a complete performance 👏👏 Scorecard ▶ https://t.co/5lVdJVscV0 #TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/16nzv4vt8b — IndianPremierLeague (@IPL) April 8, 2024 -
IPL 2024: చెన్నై చెలరేగింది
చెన్నై: ఈ సీజన్లో భారీ స్కోర్లతో, హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ చెలరేగింది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై ఆల్‌రౌండ్ షో ముందు నైట్‌రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సూపర్‌కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్ స్కోరర్! సూపర్‌కింగ్స్ బౌలర్లు రవీంద్ర జడేజా (3/18), తుషార్ దేశ్‌పాండే (3/33), ముస్తఫిజుర్ (2/22) మూకుమ్మడిగా వికెట్లను పడేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు) రాణించగా, శివమ్ దూబే (18 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. కోల్‌కతా విలవిల... నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆఖరిదాకా కష్టాలతోనే సాగింది. తుషార్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0) డకౌటయ్యాడు. ఓపెనర్‌గా చెలరేగిపోతున్న సునీల్ నరైన్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రఘువంశీ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కాసేపు ధాటిగా ఆడారంతే! పవర్‌ప్లేలో జట్టు 56/1 స్కోరు చేసింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... జడేజా బౌలింగ్‌కు దిగడంతో కోల్‌కతా కష్టాల పాలైంది. తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 7వ) వాళ్లిద్దర్నీ అవుట్ చేసిన జడేజా మరుసటి ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ (3)ను పెవిలియన్ చేర్చాడు. 64 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. రమణ్‌దీప్ (13) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్ చేసిన ఆమాత్రం స్కోరుతో కష్టంగా వంద పరుగులు దాటింది. తర్వాత తుషార్ దెబ్బకు కోల్‌కతా కుదేలైంది. హిట్టర్లు రింకూ సింగ్ (9), రసెల్ (10)లను అవుట్ చేయడంతో స్కోరులో జోరుకు ఆస్కారమే లేకపోయింది. రుతురాజ్ అర్ధసెంచరీ సులువైన లక్ష్యం కావడంతో హిట్టింగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) ఆరంభంలోనే అవుటైనా చెన్నై దూకుడుకు ఢోకా లేకపోయింది. రుతురాజ్, మిచెల్ (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించారు. తొలి సగం (10) ఓవర్లలో 81/1 స్కోరు చేసింది. రుతురాజ్ 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్‌ను అవుట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడగొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. లక్ష్యానికి చేరువలో దూబే బౌల్డవగా లాంఛనాన్ని ధోని (1 నాటౌట్), రుతురాజ్ ముగించారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) తుషార్ 0; నరైన్ (సి) తీక్షణ (బి) జడేజా 27; రఘువంశీ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 24; శ్రేయస్ (సి) జడేజా (బి) ముస్తఫిజుర్ 34; వెంకటేశ్ (సి) మిచెల్ (బి) జడేజా 3; రమణ్‌దీప్ (బి) తీక్షణ 13; రింకూ (బి) తుషార్ 9; రసెల్ (సి) మిచెల్ (బి) తుషార్ 10; అనుకుల్ (నాటౌట్) 3; స్టార్క్ (సి) రవీంద్ర (బి) ముస్తఫిజుర్ 0; వైభవ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–0, 2–56, 3–60, 4–64, 5–85, 6–112, 7–127, 8–135, 9–135. బౌలింగ్ : తుషార్ 4–0–33–3, ముస్తఫిజుర్ 4–0 –22–2, శార్దుల్ 3–0–27–0, తీక్షణ 4–0–28–1, జడేజా 4–0–18–3, రచిన్ 1–0–4–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) వరుణ్ (బి) వైభవ్ 15; రుతురాజ్ (నాటౌట్) 67; మిచెల్ (బి) నరైన్ 25; దూబే (బి) వైభవ్ 28; ధోని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–27, 2–97, 3–135. బౌలింగ్: స్టార్క్ 3–0–29–0, వైభవ్ 4–0–28–2, అనుకుల్ 1.4–0– 18–0, నరైన్ 4–0–30–1, వరుణ్ చక్రవర్తి 4–0– 26–0, రసెల్ 1–0–8–0. -
CSK: ఆ రెండు తప్పుల వల్లే ఓడిపోయాం: రుతురాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుగైన ఆరంభం అందుకున్నా .. దానిని నిలబెట్టుకోలేకపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఉప్పల్ పిచ్‌పై 170- 175 పరుగులు చేసి ఉంటే ఫలితం కాస్త వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా సన్‌రైజర్స్ ఆటగాళ్లు తెలివిగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024లో సీఎస్కే తమ నాలుగో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో రచిన్ రవీంద్ర(12) మరోసారి తేలిపోగా.. రుతురాజ్ గైక్వాడ్(26) కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇక ఉప్పల్ పిచ్ స్లోగా ఉండటంతో రన్స్ తీయడానికి ఇబ్బంది పడ్డ రహానే 30 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేయగా.. శివం దూబే మాత్రం మెరుపులు(24 బంతుల్లో 45) మెరిపించాడు. స్పిన్నర్లను అటాక్ చేస్తూ పరుగులు రాబట్టాడు. 𝘿𝙪𝙗𝙚 𝘿𝙚𝙢𝙤𝙡𝙞𝙩𝙞𝙤𝙣 💥#SRHvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/j2pCdp0VAF — JioCinema (@JioCinema) April 5, 2024 దీంతో స్పిన్నర్లను పక్కనపెట్టి పేసర్లను దించిన రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ తన బౌలింగ్‌లో దూబేను అవుట్ చేశాడు. అనంతరం జడ్డూ(31- నాటౌట్), డారిల్ మిచెల్(13) కాసేపు బ్యాట్ ఝులిపించినా.. ఆఖరి ఐదు ఓవర్లలో సీఎస్కేకు కేవలం 38 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయఢంకా మోగించింది. ఆరంభంలో ట్రవిస్ హెడ్ క్యాచ్‌ను మొయిన్ అలీ మిస్ చేయగా అతడికి లైఫ్ లభించింది. ఇక పవర్ ప్లేలో విధ్వంసరచన చేసిన అభిషేక్ శర్మ (12 బంతుల్లోనే 37 రన్స్)రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 ఆ రెండు తప్పులే కొంపముంచాయి ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ‘‘ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. వాళ్ల బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని మమ్మల్ని దెబ్బకొట్టారు. ఆరంభంలో మేము బాగానే ఆడాం. అయితే, తర్వాత వాళ్లు పైచేయి సాధించారు. ఇది నల్లరేగడి పిచ్.. నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ.. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయిపోయింది. పవర్ ప్లేలో మేము ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, ఓ క్యాచ్ మిస్ చేయడం తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకువచ్చాం’’ అని పేర్కొన్నాడు. ఆఖరి వరకు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడమని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పవర్ ప్లేలో రైజర్స్‌ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని రుతురాజ్ గైక్వాడ్ అంగీకరించాడు. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#CSK: మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే!
కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు.‘‘ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్‌కు కట్టడి చేయగలిగారు.తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది.తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్‌రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. -
మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే: రుతు
కెప్టెన్‌గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు. ‘‘ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్‌కు కట్టడి చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది. తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్‌రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. Vintage Dhoni 👌#TATAIPL fans were treated to some strong hitting by MS Dhoni Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#DCvCSK | @ChennaiIPL pic.twitter.com/eF4JsOwmsa — IndianPremierLeague (@IPL) March 31, 2024 అజింక్య రహానే(45), డారిల్ మిచెల్(34).. ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని(37 నాటౌట్) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో అద్భుత స్పెల్(2/21) వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: #Dhoni: స్ట్రైక్‌రేటు 231.25.. సీఎస్కే ఓడిందా?!.. అట్లుంటది మనతోని Season’s 1️⃣st Win 🙌@DelhiCapitals get off the mark in #TATAIPL 2024 with a collective team effort in Visakhapatnam 🙌 Scorecard ▶️ https://t.co/8ZttBSkfE8#DCvCSK pic.twitter.com/PB9tLAD13i — IndianPremierLeague (@IPL) March 31, 2024 These maximums 🤩 Some clean hitting tonight 👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/4ps9IcmCbl — IndianPremierLeague (@IPL) March 31, 2024 -
ధోనితో వాదించిన రుతురాజ్.. ఎవరి ఆదేశాలు పాటించాలి?
'I've to look at both Dhoni and Ruturaj for instructions: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(21), కెప్టెన్ శుబ్‌మన్ గిల్(8) రూపంలో రెండు కీలక వికెట్లు తీసి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెపాక్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 28 పరుగులే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సీఎస్కే అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌ను 143 పరుగులకే కట్టడి చేసి.. 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం దీపక్ చహర్ జియో సినిమాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ నుంచి చహర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘బౌలింగ్ చేసేటపుడు నువ్వు ధోనితో చర్చిస్తావా? లేదంటే గైక్వాడ్తోనా? ఆదేశాల కోసం ఎవరివైపు చూస్తావు?’ అని గావస్కర్ అడిగాడు. ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదు ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఇప్పుడు మహీ భాయ్, రుతురాజ్.. ఇద్దరి వైపూ చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి మహీ భాయ్‌ను చూడాలా లేదంటే రుతురాజ్‌ను చూడాలా అన్నది అర్థం కావడం లేదు. ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏదేమైనా రుతురాజ్ తనదైన శైలిలో సమర్థవంతంగానే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్కరోజు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న ధోని.. పగ్గాలను రుతురాజ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో మాత్రం ధోని జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. కొత్త నిబంధనలు మాకే ఉపయోగకరం ఈ క్రమంలో గుజరాత్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ ధోనితో వాదించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి మాట్లాడుతూ.. ‘‘సీఎస్కేకు ఆడుతున్న తొలినాళ్ల నుంచే పవర్ ప్లేలో నేను మూడు ఓవర్లు బౌల్ చేస్తున్నా. కొత్త నిబంధనలకు అనుగుణంగానే నా ఆట తీరులో మార్పు చేసుకుంటున్నా. గతంలో ఆరంభ ఓవర్లోనే 2-3 బౌన్సర్లు వేస్తే.. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్‌ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఒక ఓవర్లో కేవలం రెండు బౌన్సర్లకే అనుమతినిచ్చారు. పేసర్లకు ఈ రూల్ అనుకూలంగా ఉంది. పెద్దగా తేమ లేని వికెట్‌పై బంతిపై గ్రిప్ సాధించేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని చహర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ధ శతకం(23 బంతుల్లో 51)తో చెలరేగిన సీఎస్కే ఆల్‌రౌండర్ శివం దూబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: #Rohit Sharma: రోహిత్ శర్మ ఫ్లైయింగ్ కిస్.. ఫొటోలు డిలీట్ చేసిన సన్‌రైజర్స్ -
వాళ్లిద్దరూ అదరగొట్టారు.. ఫీల్డింగ్ కూడా అద్భుతం: రుతురాజ్
ఐపీఎల్-2024లో వరుసగా రెండో విజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టి కృషితో గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట జట్టును ఓడించామని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రతి ఒక్క సీఎస్కే ఆటగాడూ రాణించాడని ప్రశంసలు కురిపించాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన సీఎస్కే.. తాజాగా గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. సొంతమైదానం చెపాక్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో శుబ్‌మన్ గిల్ సేనపై జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ పరిపూర్ణమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మా వాళ్లు అదరగొట్టారు. సాధారణంగా చెన్నైలో వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయలేం. అందుకే తొలుత బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా రాణించడం మాత్రం ముఖ్యం. అయితే, వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే ఆఖర్లో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈరోజు రచిన్ పవర్ ప్లేలో అత్యద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేశాడు. అదే విధంగా.. దూబే.. అతడికి ఆత్మవిశ్వాసం మెండు. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా వ్యక్తిగతంగా అతడిని మెటివేట్ చేశాడు. జట్టులో తన పాత్ర ఏమిటో అతడికి బాగా తెలుసు. దూబే జట్టుతో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈరోజు నేను మా వాళ్ల ఫీల్డింగ్‌కు కూడా ఫిదా అయ్యాను’’ అని పేర్కొన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. Jubilant Chepauk 🏟️ witnessed @ChennaiIPL's consecutive win as they beat @gujarat_titans by a resounding 63 runs 💪 Recap of the #CSKvGT clash 🎥 👇 #TATAIPL pic.twitter.com/reeLzs1IEh — IndianPremierLeague (@IPL) March 27, 2024 చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46) రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే(23 బంతుల్లో 51) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుపు అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్(24- నాటౌట్) సైతం తన వంతు పరుగులు జతచేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 206 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ గుజరాత్ 143 పరుగుల వద్దే నిలిచిపోవడంతో సీఎస్కే చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్‌పాండే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. డారిల్ మిచెల్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: #WHAT A CATCH: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో -
గుజరాత్‌ను చిత్తు చేసిన సీఎస్కే.. వరుసగా రెండో విజయం
Gujarat Titans And Chennai super kings Live Updates: గుజరాత్‌ను చిత్తు చేసిన సీఎస్కే ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే మాత్రమే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్ పడగొట్టాడు. నాలుగో వికెట్ డౌన్ 96 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 42 బంతుల్లో 103 పరుగులు కావాలి. క్రీజులో సాయిసుదర్శన్(31), ఒమర్జాయ్(3) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. శంకర్ ఔట్ 55 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన విజయ్ శంకర్.. మిచిల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 57/3 రెండో వికెట్ డౌన్.. షా ఔట్ గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన వృద్దిమాన్ షా.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 34/2 తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. గిల్ ఔట్ 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 28/1 గుజరాత్ టార్గెట్ 207 పరుగులు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు విధ్వంసం సష్టించారు. రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్‌లు), శివమ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. దూబే ఔట్ 184 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన శివమ్ దూబే.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 165/3 16 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(41), డార్లీ మిచెల్(14) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. గైక్వాడ్ ఔట్ 127 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 13 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 128/3 రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే. . రహానే ఔట్ 105 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అజింక్యా రహానే.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు. తొలి వికెట్ డౌన్.. రవీంద్ర ఔట్ 69 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దంచికొడుతున్న రవీంద్ర.. 5 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 58/0 గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ రచిన్ రవీంద్ర దంచి కొడుతున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. రవీంద్ర ప్రస్తుతం 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 5 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 58/0 2 ఓవర్లకు సీఎస్కే స్కోర్:13/0 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(11), గైక్వాడ్(1) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సీఎస్కే మాత్రం ఒక మార్పు చేసింది. థీక్షణ స్ధానంలో పతిరానా తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు గుజరాత్ టైటాన్స్: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్ -
IPL 2024: గుజరాత్ అంటే చాలు రుతురాజ్‌కు పూనకం వస్తుంది..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (మార్చి 26) రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్ విజేత సీఎస్కే.. ఫైనలిస్ట్ గుజరాత్ టైటాన్స్ ఇవాళ తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై.. గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందాయి. గుజరాత్ అంటే చాలు రుతురాజ్‌కు పూనకం వస్తుంది.. ఈ సీజన్లో సీఎస్కే పగ్గాలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. గుజరాత్ టైటాన్స్‌పై ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. రుతు గుజరాత్‌తో తలపడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు అర్ద శతకాలు బాదాడు. 2022 సీజన్లో గుజరాత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (73, 53) హాఫ్ సెంచరీలు బాదిన రుతు.. గత సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మరో రెండు హాఫ్ సెంచరీలు (92, 60) చేశాడు. రుతు గుజరాత్‌తో చివరిసారిగా గత సీజన్ ఫైనల్లో తలపడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతను 16 బంతుల్లో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. గుజరాత్‌పై రుతురాజ్ 5 మ్యాచ్‌ల్లో 60.80 సగటున 146.86 స్ట్రయిక్‌రేట్‌తో 304 పరుగులు చేశాడు. గుజరాత్‌పై రుతురాజ్‌కు వ్యక్తిగతంగా మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ.. జట్టుగా గుజరాత్‌దే సీఎస్కేపై పైచేయిగా ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో ఎదురెదురుపడిన ఐదు సందర్భాల్లో మూడింట గుజరాత్.. రెండు మ్యాచ్‌ల్లో చెన్నై విజయాలు సాధించాయి. చివరిసారిగా ఈ ఇరు జట్లు గత సీజన్ ఫైనల్లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించి, ఐదోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. -
ప్రతిసారీ ధోని ఎంట్రీ ఏంటి?.. కెప్టెన్ అతడు కదా: సెహ్వాగ్
#CSKvsRCB- #MSDhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా అరుదైన ఘనతలు సాధించిన మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. ధోని భాగమై ఉన్న జట్టును సారథిగా ముందుకు నడిపించలేక.. ఒత్తిడిలో చిత్తై రవీంద్ర జడేజా 2022 సీజన్లో పగ్గాలు చేపట్టి మధ్యలోనే వదిలేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ధోనినే మళ్లీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే, 2023లో తన అద్బుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలతో సీఎస్కేను చాంపియన్‌గా నిలిపాడు ధోని. వయసు పైబడటం, భవిష్యత్ కెప్టెన్‌ను తయారు చేసే క్రమంలో ఐపీఎల్-2024 సీజన్‌కు ముందే తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు తలా. ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు కెప్టెన్సీ పగ్గాలను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అందించాడు. రుతు సైతం.. గతేడాది నుంచే ధోని భయ్యా తనకు ఈ విషయం గురించి సంకేతాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. ‘‘సీఎస్కే కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు దక్కిన గౌరవం. అయితే, ఇక్కడ నేను ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని టోర్నీ ఆరంభానికి ముందే స్పష్టం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని అందుకు తగ్గట్లుగానే ఆరంభ మ్యాచ్‌లో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సారథిగా అరంగేట్రంలోనే గెలుపు రుచి చవిచూశాడు. అయితే, మ్యాచ్ మధ్యలో ధోని రుతురాజ్‌కు సలహాలు ఇస్తూ కనిపించాడు. అంతేకాదు.. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో ఈ వికెట్ కీపర్ చొరవ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని అభిమానులను అలరించాయి. ధోని క్రేజ్ దృష్ట్యా కెమెరామెన్ సైతం ప్రతిసారి అతడిపైనే ఫోకస్ చేయడం విశేషం. Just a reminder: 𝙏𝙝𝙖𝙡𝙖 𝙣𝙚𝙫𝙚𝙧 𝙢𝙞𝙨𝙨𝙚𝙨 😉#CSKvsRCB #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/KMhidAc9Sp — JioCinema (@JioCinema) March 22, 2024 అతడు ఇప్పుడు కెప్టెన్ ఈ నేపథ్యంలో హర్యానా కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు. ‘‘భయ్యా.. దయచేసి రుతురాజ్ ముఖాన్ని కూడా కాస్త చూపించండి. అతడు ఇప్పుడు కెప్టెన్. ఏంటో.. ఈ కెమెరామెన్ ఎప్పుడూ ధోని ఫేస్ మాత్రమే చూపిస్తున్నాడు’’ అని వీరూ భాయ్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రుతురాజ్‌కు మంచి మార్కులే పడ్డాయి. Shining on #CSK Debut ✨ Home Support 💛 Finishing touch 💪 Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9 — IndianPremierLeague (@IPL) March 23, 2024 రుతురాజ్ కెప్టెన్సీ బాగుంది భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రుతు కెప్టెన్సీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తొలి 26 బంతుల తర్వాత సీఎస్కే అద్భుతరీతిలో తిరిగి పుంజుకుంది. ఒత్తిడిలోనూ రుతురాజ్ బౌలింగ్ విభాగాన్ని ప్రయోగించడంలో చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి’’ అని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రుతురాజ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. -
అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.. ధోని భాయ్ జట్టుతో ఉన్నా సరే!
Ruturaj Comments After Chennai Super Kings won by 6 wkts: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్నాడు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లో పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోరులో సీఎస్కేను గెలిపించి సత్తా చాటాడు. సొంత మైదానం చెపాక్ వేదికగా గెలుపు నమోదు చేసి మధుర జ్ఞాపకాలు ప్రోది చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని తెలిపాడు. సారథిగా వ్యవహరించడం తనపై ఎలాంటి అదనపు ఒత్తిడిని కలిగించదని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రను ముందుండి నడిపించిన అనుభవం తనకు ఉందని తెలిపాడు. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది ఇక ఈ మ్యాచ్‌లో మహీ భాయ్(మహేంద్ర సింగ్) ఉన్నాడు కాబట్టి తన పని మరింత సులువైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. అదే విధంగా.. మ్యాచ్ గురించి చెబుతూ.. ‘‘ఆరంభ ఓవర్ల నుంచే మ్యాచ్ మా నియంత్రణలోకి వచ్చేసింది. వాళ్లను మరింత తక్కువ స్కోరుకే పరిమితం చేయగలం అనుకున్నాం. కానీ అలా కుదరలేదు. నిజానికి మాక్స్వెల్, ఫాఫ్లను అవుట్ చేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వరుస విరామాల్లో మూడు వికెట్లు పడగొట్టడం తో మ్యాచ్ మా చేతుల్లోకి వస్తుందన్న నమ్మకం కుదిరింది. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 మా జట్టులోని ప్రతి ఒక్కరూ స్ట్రోక్ ప్లేయర్సే. జింక్స్(అజింక్య రహానే) కూడా సానుకూల దృక్పథంతో ఆడాడు. జట్టులోని ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటన్న అంశంపై స్పష్టత ఉంది. ఈ రోజు బౌలర్లు తమ పాత్రను చక్కగా నెరవేర్చారు. అందరూ బాగానే బ్యాటింగ్ చేశారు. అయితే, టాపార్డర్ బ్యాటర్లు 15 ఓవర్ వరకు క్రీజులో ఉండగలిగితే మిగతా వాళ్ల పని మరింత సులువవుతుంది’’ అని రుతురాజ్ గైక్వాడ్ విశ్లేషించాడు. ఓపెనర్‌గా మాత్రం విఫలం కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. ఆర్సీబీని 173 ఓవర్లకు కట్టడి చేసిన రుతురాజ్ సేన.. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సీఎస్కే బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్(4/29) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రుతురాజ్ ఈ మ్యాచ్‌లో కేవలం 15 పరుగులే చేసి ఓపెనర్‌గా మాత్రం విఫలమయ్యాడు. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై ►టాస్: ఆర్సీబీ.. బ్యాటింగ్ ►ఆర్సీబీ స్కోరు: 173/6 (20) ►సీఎస్కే స్కోరు: 176/4 (18.4) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపు. చదవండి: IPL 2024: టీమిండియాలోనే కాదు.. ఇక్కడా ఇంతేనా?! వీడియో వైరల్ -
ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: భారత మాజీ ఓపెనర్
#MSDhoni- IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటేనే కొత్త సారథి పని సులువు అవుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్క రోజు ముందు (మార్చి 21).. ధోని కెప్టెన్సీని వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని సీఎస్కే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తలా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని సంకేతాలు ఇచ్చింది. What it means! 🗣️💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/WCLqVI4xyU — Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024 అందుకు అనుగుణంగానే సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ సైతం ధోని తాజా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. ధోని ఆటగాడిగా కూడా రిటైర్ ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో ఇంటర్వ్యూలో భాగంగా.. ధోని సీఎస్కే కెప్టెన్సీ వదిలేయడం గురించి ప్రస్తావించగా.. ‘‘ధోని కెప్టెన్‌గానే కాదు.. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ధోని ప్లేయర్‌గా ఉన్న జట్టును నాయకుడిగా ముందుకు నడిపించడం యువ ఆటగాడికి సాధ్యం కాదు. ఒకవేళ కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోని దానిని అంగీకరించవచ్చు లేదంటే వద్దని చెప్పవచ్చు. కాబట్టి ధోని మైదానంలో ఉండగా రుతురాజ్ గైక్వాడ్ సొంత నిర్ణయం తీసుకునేందుకు కచ్చితంగా ఇబ్బంది పడతాడు. అలా అయితే కెప్టెన్సీ కష్టం అంతేకాదు కొన్నిసార్లు తన నిర్ణయాలు అమలు చేయలేకపోవచ్చు కూడా! అప్పుడు కెప్టెన్సీ మరింత కష్టతరంగా మారుతుంది. అదే ధోని గనుక జట్టుతో లేకుంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుంది. ధోని వారసుడిగా రుతురాజ్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంటుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా 2022లో ధోని సారథిగా తప్పుకొని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్కే నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ.. ఆటగాడిగానూ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. మధ్యలోనే లీగ్ నుంచి నిష్క్రమించగా.. అతడి స్థానంలో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఆ ఎడిషన్‌లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్కే.. 2023లో అనూహ్య రీతిలో పుంజుకుని చాంపియన్‌గా నిలిచింది. ధోని నాయకత్వంలో ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. ఇక శుక్రవారం (మార్చి 22) ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు! -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్‌కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్‌గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్‌కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్‌పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
కెప్టెన్సీకి ధోని గుడ్‌బై సీఎస్కే కొత్త సారథిగా రుతురాజ్
చెన్నై: ‘కొత్త సీజన్లో కొత్త ‘పాత్ర’ పోషించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’... మార్చి 4న సోషల్ మీడియాలో ధోని పెట్టిన పోస్ట్ ఇది! ఆ కొత్త పాత్ర ఏమిటనేది ఎవరూ ఊహించలేకపోయారు. కానీ మార్చి 21కి వచ్చేసరికే అదేంటో ధోని చూపించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. కెపె్టన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా అతను ఈ సీజన్ బరిలోకి దిగనున్నాడు. ధోని స్థానంలో జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. 42 ఏళ్ల ధోని 2008లో ఐపీఎల్ తొలి ఏడాది నుంచి చెన్నై కెపె్టన్‌గా వ్యవహరించాడు. మధ్యలో రెండేళ్లు జట్టు నిషేధానికి గురి కాగా... 2022 సీజన్లో రవీంద్ర జడేజా కెపె్టన్ అయ్యాడు. అయితే 8 మ్యాచ్‌ల తర్వాత తనవల్ల కాదంటూ జడేజా తప్పుకోవడంతో సీజన్ మధ్యలో మళ్లీ ధోని పగ్గాలు చేపట్టాడు. ఐపీఎల్లో అతను మొత్తం 212 మ్యాచ్‌లలో కెపె్టన్‌గా వ్యవహరించగా... 128 మ్యాచ్‌ల్లో గెలిచి, 82 మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై 5సార్లు చాంపియన్ కావడంతో పాటు మరో 5సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో 23 చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అతను 2 టైటిల్స్ అందించాడు. 2023లో టైటిల్ గెలిచాక అదే ధోని ఆఖరి సీజన్ అనిపించింది. కెప్టెన్సీ కాకుండా ఆటగాడిగా అతని ప్రభావం దాదాపు శూన్యంగా మారింది. కానీ మోకాలి ఆపరేషన్ తర్వాత అతను మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అనుభవం లేకపోయినా... మహారాష్ట్రకు చెందిన రుతురాజ్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు. సీనియర్ స్థాయిలో కేవలం 16 టి20 మ్యాచుల్లోనే అతను కెపె్టన్‌గా వ్యవహరించి 10 విజయాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు అతనే కెపె్టన్. అయితే ఓపెనర్ రూపంలో భారీగా పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో అతను కీలకంగా మారాడు. 2020 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న రుతురాజ్ 52 మ్యాచ్‌లలో 135.52 స్ట్రయిక్‌రేట్‌తో 1797 పరుగులు సాధించాడు. రుతురాజ్ భారత్ తరఫున 6 వన్డేలు, 19 టి20లు ఆడాడు. 2022లో జడేజాను అనూహ్యంగా కెపె్టన్ చేయడంతో సమస్య వచ్చిందని, కానీ ఈసారి మార్పుకు తాము ముందే సిద్ధమయ్యామని సీఎస్కే మేనేజ్మెంట్ ప్రకటించింది. -
IPL 2024: కెప్టెన్‌గా రుతురాజ్ రికార్డు అదుర్స్..!
చెన్నై సూపర్ కింగ్స్ నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికైన విషయం తెలిసిందే. రుతురాజ్ పేరును మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనినే స్వయంగా ప్రతిపాదించాడు. రేపటి నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో రుతురాజ్ సీఎస్కే సారధిగా వ్యవహరించనున్నాడు. సీఎస్కే నూతన కెప్టెన్‌గా ఎంపికైన నేపథ్యంలో రుతురాజ్‌పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. GOOSEBUMPS TO SEE THIS...!!!!! 🔥 pic.twitter.com/MdD6IzBbbu — CricketMAN2 (@ImTanujSingh) March 21, 2024 ధోని వీరాభిమానులు మినహా యావత్ క్రికెట్ ప్రపంచం రుతురాజ్‌కు ఆల్ ద బెస్ట్ చెబుతుంది. రేపే రుతురాజ్ కెప్టెన్‌గా తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. రేపు జరుగబోయే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రుతురాజ్ నేతృత్వంలోని సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. సీనియర్లు, జూనియర్ల మిశ్రమంగా ఉన్న సీఎస్కేను 27 ఏళ్ల రుతురాజ్ ఏరకంగా హ్యాండిల్ చేస్తాడన్న అంశం ఆసక్తికరంగా మారింది. ధోని జట్టుతో పాటే ఉండనుండటం రుతురాజ్‌కు ఊరట కలిగించే అంశం. The Meet up of MS Dhoni and Faf Du Plessis at Chepauk. - TWO BROTHERS MEETS...!!!! ❤️ pic.twitter.com/sGndbdCWI3 — CricketMAN2 (@ImTanujSingh) March 21, 2024 కాగా, రుతురాజ్ సీనియర్లతో కూడిన జట్టును ఎలా హ్యాండిల్ చేయగలడో అన్న సందేహాలున్న వారికి ఈ గణంకాలు ఊరట కలిగిస్తాయి. కెప్టెన్‌గా రతురాజ్కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ముఖ్యంగా టీ20ల్లో రుతు కెప్టెన్‌గా 60 శాతం విజయాలు సాధించాడు. Faf Du Plessis and Ruturaj Gaikwad in today's practice session at Chepauk. - THE TWO CAPTAINS...!!!! pic.twitter.com/JwYIM56bdr — CricketMAN2 (@ImTanujSingh) March 21, 2024 టీ20ల్లో మహారాష్ట్ర, పుణేరీ బప్పా జట్లకు సారధ్యం వహించిన రుతు.. ఈ రెండు జట్ల తరఫున 16 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి 10 విజయాలు సాధించాడు. 5 మ్యాచ్‌ల్లో రుతురాజ్ తన జట్టును గెలిపించలేకపోగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. సీనియర్లతో కూడిన జట్టును నడిపించాలంటే కెప్టెన్‌గా ఈ మాత్రం ట్రాక్ రికార్డు సరిపోతుందని రుతురాజ్ అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, కెప్టెన్‌గా ఎంపిక విషయం అధికారింగా వెలువడ్డ తర్వాత రుతురాజ్ చాలా ఆనందంగా కనిపించాడు. ఆర్సీబీ సభ్యులతో కలిసి చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్న రుతు..ఇరు జట్ల ఆటగాళ్లతో సరదాగా గడిపాడు. -
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోని స్థానంలో కొత్త కెప్టెన్
-
#MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. రెండోసారి వదిలేశాడు!
‘‘ఐపీఎల్-2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని ఎంఎస్ ధోని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు’’... కెప్టెన్ మార్పుపై ఐపీఎల్ ఫ్రాంఛైజీ సీఎస్కే విడుదల చేసిన అధికారిక ప్రకటన ఇది. మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికసార్లు చెన్నైని ఫైనల్‌కు చేర్చి.. ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత మహేంద్ర సింగ్ ధోని సొంతం. టీమిండియా కెప్టెన్‌గా ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఈ జార్ఖండ్ డైనమైట్.. సీఎస్కేతో అనుబంధం పెనవేసుకుని ‘తలా’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సీఎస్కే అంటే ధోని.. ధోని అంటే సీఎస్కే అన్న చందంగా చెరగని ముద్ర వేశాడు. క్యాష్ రిచ్ లీగ్ తొలి సీజన్లోనే చెన్నైని ఫైనల్‌కు చేర్చిన ఈ మిస్టర్ కూల్.. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో టైటిల్ అందించాడు. అంతేకాదు.. ధోని కెప్టెన్సీలో సీఎస్కే 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గానూ నిలిచింది. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఎస్కేపై నిషేధం పడినపుడు మినహా ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచీ ఇప్పటిదాకా అదే ఫ్రాంఛైజీతో కొనసాగాడు ధోని. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు మొదలు.. మైదానంలో తనదైన వ్యూహాలు అమలు చేయడం దాకా ప్రతీ అంశంలోనూ తానే ముందుండి సీఎస్కేను విజయవంతమైన జట్టుగా నిలిపాడు. అప్పుడే పగ్గాలు వదిలేశాడు.. కానీ ఆటగాడిగా, వికెట్ కీపర్‌గా సత్తా చాటుతూనే కెప్టెన్‌గా మార్కు చూపించిన తలా.. నిజానికి 2022లోనే కెప్టెన్సీ పగ్గాలను వదిలేశాడు. తన వారసుడిగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. కానీ ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపింది. కెప్టెన్‌గా భారాన్ని మోయలేక తీవ్ర ఒత్తిడికి లోనైన జడ్డూ.. ఆల్‌రౌండర్‌గానూ విఫలమై విమర్శల పాలయ్యాడు. 2022లో ఆడిన పది మ్యాచ్‌లలో కేవలం 116 పరుగులు చేసి.. ఐదు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మళ్లీ తనే బాధ్యత తీసుకుని ఈ క్రమంలో ఆఖరి మ్యాచ్‌లకు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో మళ్లీ ధోనినే కెప్టెన్సీ చేపట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచిన సీఎస్కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అభిమానుల హృదయం ముక్కలు అయితే, చేదు జ్ఞాపకాలను మరిపించేలా 2023లో చెన్నైకి పూర్వవైభవం అందించాడు ధోని. 41 ఏళ్ల వయసులో సీఎస్కేను ఐదోసారి చాంపియన్‌గా నిలబెట్టాడు. పెరుగుతున్న వయసు దృష్ట్యా.. భవిష్య కెప్టెన్‌ను తీర్చిదిద్దే క్రమంలో ఐపీఎల్-2024లో పూర్తిగా కెప్టెన్సీని వదిలేసి.. మహారాష్ట్ర క్రికెటర్, టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను తన స్థానంలో సారథిగా తీసుకువచ్చాడు. M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 ఈ ప్రకటన సీఎస్కేతో పాటు ఐపీఎల్ సగటు అభిమాని గుండెను కూడా ముక్కలు చేసింది. మైదానంలో పాదరసంలా కదులుతూ తన వ్యూహాలతో క్షణాల్లో ఫలితాన్ని మార్చివేయగల ధోని(అధికారిక కెప్టెన్‌గా)ని ఇక చూడలేమా అంటూ తలా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు మంచిదే అయినా.. ఓ స్వర్ణ యుగం ముగిసిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ధోని పట్ల అభిమానం చాటుకుంటూ వీడియోలు షేర్ చేస్తూ అతడి పేరును ట్రెండ్ చేస్తున్నారు. అందుకే కెప్టెన్‌గా రుతురాజ్ ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఆసియా క్రీడలు-2023లో టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. ఈ నేపథ్యంలో ధోని వారసుడిగా ఇప్పుడు సీఎస్కే పగ్గాలు కూడా చేపట్టడం విశేషం. The 🔟 Captains are READY! 😎 The Goal is SET 🏆 Let the #TATAIPL 2024 begin 😍 pic.twitter.com/f8cdv5Zfqh — IndianPremierLeague (@IPL) March 21, 2024 చదవండి: IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు! -
కెప్టెన్ల విషయంలో ఐపీఎల్ 2024 చాలా ప్రత్యేకం.. మూడేళ్ల క్రితం..!
కెప్టెన్ల విషయంలో ఐపీఎల్ 2024కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సీజన్లో కెప్టెన్లుగా వ్యవహరించనున్న వారిలో ముగ్గురికి (గిల్, కమిన్స్, రుతురాజ్) ఇప్పటివరకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం లేదు. పది మంది కెప్టెన్లలో సగం మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఈ సీజన్ అతి పెద్ద వయస్కుడైన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ) కాగా.. అతి చిన్న వయస్కుడిగా శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) ఉన్నాడు. ప్రస్తుత కెప్టెన్లలో ఎవరూ కూడా మూడేళ్ల కిందట ఆయా జట్లకు కెప్టెన్లుగా లేకపోవడం అన్నింటికంటే ప్రత్యేకం. The captains photoshoot video. 📸🏆pic.twitter.com/jDPkEsod2O— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2024 ప్రస్తుత కెప్టెన్లలో శ్రేయస్ అయ్యర్ అందరి కంటే అనుభవజ్ఞుడు. అయ్యర్ కేకేఆర్‌ను 55 మ్యాచ్‌ల్లో ముందుండి నడిపించాడు. ఆతర్వాత కేఎల్ రాహుల్ (లక్నోను 51 మ్యాచ్‌ల్లో), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్‌ను 45 మ్యాచ్‌ల్లో), హార్దిక్ పాండ్యా (గుజరాత్‌ను 31 మ్యాచ్‌ల్లో), రిషబ్ పంత్ (ఢిల్లీని 30 మ్యాచ్‌ల్లో), డుప్లెసిస్ (ఆర్సీబీని 27 మ్యాచ్‌ల్లో), శిఖర్ ధవన్ (పంజాబ్‌ను 22 మ్యాచ్‌ల్లో) సీనియర్లుగా ఉన్నారు. కాగా, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ రేపటి నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. చదవండి: IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోని స్థానంలో కొత్త కెప్టెన్ -
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోని స్థానంలో కొత్త కెప్టెన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ ప్రారంభానికి ముందు రోజు ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది. ధోని ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. కాగా, కెప్టెన్సీ నుంచి తప్పుకునే విషయాన్ని ధోని కొద్ది రోజుల ముందే పరోక్షంగా వెల్లడించాడు. 2024 సీజన్లో తనను కొత్త పాత్రలో చూడబోతున్నారంటూ లీకులు ఇచ్చాడు. అంతిమంగా ధోని చెప్పిందే నిజమైంది. అతని స్థానంలో యువ నాయకుడు రుతురాజ్ సీఎస్కేను ముందుండి నడిపించనున్నాడు. ఇదిలా ఉంటే, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా..? కెప్టెన్సీని స్వచ్ఛందంగా రుతురాజ్‌కు బదిలీ చేసిన ధోని.. రేపటి నుంచి ప్రారంభంకాబోయే సీజన్లో సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్కే.. తమ సొంత మైదానమైన చెపాక్‌లో ఆర్సీబీతో తలపడనుంది. విశ్లేషకుల అభిప్రాయం మేరకు.. దిగ్గజ ధోని తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికేందుకు ఇంతకంటే అనువైన సందర్భమేముంటుంది. సొంత మైదానం.. ఛాలెంజింగ్ ప్రత్యర్ధి.. రేపటి మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగి తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముంది. రిటైరయ్యాక ధోని సీఎస్కే మెంటార్‌గా కొనసాగవచ్చు. 2019 నుంచి సీఎస్కేతోనే.. సీఎస్కే నూతన కెప్టెన్ రుతురాజ్ 2019 నుంచి ఈ ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. రుతు సీఎస్కే తరఫున 52 మ్యాచ్‌లు ఆడి 135.5 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 14 హాఫ్ సెంచరీల సాయంతో 1797 పరుగులు చేశాడు. 2021లో రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. ఆ సీజన్లో సీఎస్కే నాలుగో సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 27 ఏళ్ల రతురాజ్ టీమిండియా తరఫున 6 వన్డేలు, 19 టీ20లు ఆడి సెంచరీ, 4 హాఫ్ సెంచరీల సాయంతో 615 పరుగులు చేశాడు. రుతురాజ్ మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. -
ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు టీమిండియా లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంస్ ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్కేకు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ధోని సీఎస్కే మెంటార్‌గా సరికొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ధోని సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. 'కొత్త సీజన్లో కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ధోని ఏ రోల్లో కనిపించనున్నాడా అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు. ధోనీ మాత్రమే కాదు.. చైన్నై సూపర్ కింగ్స్ కూడా ఓ ట్వీట్ చేసి అభిమానుల్లో సస్పెన్స్‌ను మరింత పెంచింది. `కొత్త పాత్రలో లియో` అంటూ ఓ ట్వీట్ చేసింది. దీంతో ఈ సీజన్లో మెంటార్‌గా ఎంఎస్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా 42 ఏళ్ల ధోనీ గత సీజన్ లో సీఎస్కేను ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. చెన్నై జట్టు ఇప్పటికే చెపాక్ స్టేడియంలో ట్రెయినింగ్ క్యాంప్‌ను ప్రారంభించింది. కానీ ధోని మాత్రం ఇంకా ఈ ట్రెయినింగ్ క్యాంప్‌లో చేరలేదు. ఇవన్నీ చూస్తుంటే ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై చెప్పే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ ధోని తప్పుకుంటే సీఎస్కే కెప్టెన్‌గా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. సీఎస్కే తొలి మ్యాచ్‌లోనే చెపాక్ వేదికగా ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: Shreyas Iyer: ‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?! -
రెచ్చిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 16) మొదలైన వేర్వేరు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ ఇరగదీశారు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) తృటిలో సెంచరీ (96) చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు శతకంతో (95 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు. శార్దూల్ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒకే రోజు ముగ్గురు సీఎస్కే ఆటగాళ్లు సత్తా చాటడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ఈసారి కూడా ప్రత్యర్దులకు దబిడిదిబిడే అంటూ రచ్చ చేస్తున్నారు. సీఎస్కే ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టైటిల్ నిలబెట్టుకోవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్లో ధోని నేతృత్వంలో సీఎస్కే ఐదో సారి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాబోయే సీజన్‌కు సంబంధించి సీఎస్కే ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్‌ను స్టార్ట్ చేసింది. కెప్టెన్ ధోనితో పాటు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో క్యాంప్ నడుస్తుంది. కాగా, సీఎస్కే ఆటగాళ్లు రాణించడంతో అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పట్టుబిగించింది. శార్దూల్ ఠాకూర్ ఆరేయడంతో అసోం తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 101 పరుగులతో దూబే, 2 పరుగులతో శార్దూల్ క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 133 పరుగుల లీడ్‌లో ఉంది. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ రాణించినప్పటికీ మహారాష్ట్ర తడబడింది. సర్వీసెస్ బౌలర్లు అర్జున్ శర్మ (5/59), వరుణ్ చౌదరీ (4/39) విజృంభించడంతో ముంబై 225 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. -
ఆ జట్టులోనూ నా పేరు లేదు.. షాకయ్యాను! అందుకే: ధావన్
"ఆ జట్టులో నా పేరు లేకపోవడంతో షాక్‌కు గురయ్యాను. కానీ అంతలోనే మనసుకు సర్దిచెప్పుకొన్నాను. వాళ్ల ఆలోచనా విధానం మరోలా ఉందేమో అని నన్ను నేను తమాయించుకున్నాను. ఏదేమైనా సెలక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప నేనేమీ చేయలేను కదా! నిజానికి నా భవితవ్యం గురించి సెలక్టర్లతో నేను ఇంత వరకు మాట్లాడింది లేదు. ఇప్పటికీ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి వెళ్తూ ఉంటాను. అక్కడ క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేస్తాను. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నా కెరీర్ రూపకల్పనలో ఎన్‌సీఏది కీలక పాత్ర. నిజానికి అక్కడి నుంచే నా కెరీర్ మొదలైంది. అందుకే నేనెల్లప్పుడూ ఎన్సీఏ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను" అని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా క్రీడలు-2023 జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశించానని.. కానీ అలా జరుగలేదంటూ గబ్బర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా టీమిండియా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్‌కు ఏడాదికి పైగా జట్టులో చోటు కరువైంది. యువ ఓపెనర్లకు పెద్దపీట బంగ్లాదేశ్‌తో 2022, డిసెంబరు వన్డేలో ఆఖరిసారిగా అతడు టీమిండియాకు ఆడాడు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఓపెనర్లకు పెద్దపీట వేస్తున్న సెలక్టర్లు ధావన్‌ను పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో.. వన్డే ప్రపంచకప్-2023కి ముందు జరిగిన ఆసియా క్రీడలతో అతడు రీఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగింది. చోటు ఆశించి భంగపడ్డా మెగా టోర్నీ నేపథ్యంలో చైనాకు వెళ్లే భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ధావన్ ఉంటాడనే వార్తలు వినిపించాయి. కానీ.. అనూహ్యంగా రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన మేనేజ్మెంట్ ధావన్‌కు మొండిచేయి చూపింది. ఇక ఆ తర్వాత మళ్లీ అతడికి టీమిండియాలో చోటు దక్కనేలేదు. ఈ నేపథ్యంలో.. 38 ఏళ్ల ధావన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డానని తెలిపాడు. అయితే, తాను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు. అందుకే ఇలా ఇక వన్డేలు, టీ20లు ఆడేందుకే టెస్టు క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యానని ధావన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధావన్‌ది కీలక పాత్ర. నాటి ఐసీసీ టోర్నీలో 363 పరుగులతో ఈ లెఫ్టాండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. -
టీమిండియా యువ పేసర్‌కు గాయం.. ఆటకు దూరం
టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్, ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆటకు దూరంగా ఉన్నారు. వీళ్లంతా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు... వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత.. చీలమండ నొప్పితో జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఈ క్రమంలో తాజాగా టీమిండియా మరో బౌలర్ గాయపడ్డాడు. యువ పేసర్ ప్రసిద్ కృష్ణ తొడ కండరాల నొప్పితో ఆటకు దూరం కావడం గమనార్హం. కాగా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక బౌలర్.. రెండు మ్యాచ్‌లు ఆడి ధారాళంగా పరుగులు ఇచ్చుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో తిరిగి దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన ప్రసిద్ కృష్ణ.. రంజీ ట్రోఫీ-2024లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా కర్ణాటక- గుజరాత్ మధ్య శుక్రవారం మొదలైన టెస్టులో అతడు బరిలోకి దిగాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 14.5 ఓవర్లు బౌల్ చేసిన ప్రసిద్ రెండు వికెట్లు తీశాడు. అయితే, పదిహేనో ఓవర్ ఆఖరి బంతి వేసేపుడు తొడ కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ రైటార్మ్ పేసర్ మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడానికి సుమారు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రసిద్ కృష్ణ మాత్రం గాయం కారణంగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఆడకపోవచ్చు. చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. చేతి వేలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వేగంగా కోలుకుంటున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. అయితే రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టు సమయానికి గైక్వాడ్ పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జరగనుంది. రాజ్‌కోట్ టెస్టుకు ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడానికి గైక్వాడ్ రంజీ ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు ఏన్సీఏ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టును వచ్చే వారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. బ్యాకప్ ఓపెనర్‌గా భారత-ఏ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగిన ఛతేశ్వర్ పుజారాకు సెలక్టర్లు మళ్లీ పిలుపు నివ్వనున్నట్లు తెలుస్తోంది. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: IPL 2024: ఆ ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. ఆ ముగ్గురి ఆటగాళ్లకు లైన్ క్లియర్ -
టీమిండియాకు బిగ్ షాక్
జనవరి 11 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇన్ ఫామ్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వడ్, సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమయ్యారు. వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఇవాళ ముంబైలో సమావేశం కానున్నారు. అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్ (తొలి రెండు టెస్ట్‌లకు) కోసం కూడా భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లోకి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, టీమిండియాతో సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆఫ్ఘన్ జట్టుకు సారధిగా ఇబ్రహీం జద్రాన్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు.. ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
నా ఆటకు పునాది.. సర్వస్వం.. సంతృప్తి ఇక్కడే: కోహ్లి భావోద్వేగం
Virat Kohli Comments: ‘‘నా ఆటకు టెస్టు క్రికెట్ పునాది. ఇదొక చరిత్ర. ఒక సంస్కృతి. వారసత్వం. సర్వస్వం ఇదే. ప్రత్యర్థి జట్టుతో నాలుగు- ఐదు రోజుల పాటు పోటీపడటం అన్నింటికంటే భిన్న అనుభవాన్ని ఇస్తుంది. బ్యాటర్‌గా.. జట్టుగా ఈ ఫార్మాట్లో ఆడటం వల్లే పూర్తి సంతృప్తి లభిస్తుంది. క్రీజులో గంటల తరబడి నిలబడి.. జట్టును గెలిపించే అవకాశం దక్కడం అన్నిటికంటే ప్రత్యేకమైన భావన. నేను సంప్రదాయ క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడేవాడిని. అందుకే నాకు టెస్టులంటే అమితమైన ఇష్టం. టీమిండియా తరఫున వంద కంటే ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. టెస్టు క్రికెటర్ కావాలన్న నా చిరకాల కల నెరవేరడమే గాకుండా ఇక్కడిదాకా వచ్చినందుకు గర్వంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. మూడు ఫార్మాట్లలో తనకు టెస్టులు ఆడటమే అత్యంత సంతృప్తినిస్తుందని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో విరాట్ కోహ్లి సత్తా చాటిన విషయం తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ రన్‌మెషీన్.. ఐసీసీ ఈవెంట్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ప్రపంచకప్ టోర్నీ తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు సఫారీ గడ్డపై భారత జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న అపవాదు చెరిపివేసేందుకు తన వంతు ప్రయత్నం చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి స్టార్ స్పోర్ట్స్ షోకు ఇంటర్వ్యూ ఇచ్చిన కోహ్లి.. తన కెరీర్లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడు ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా నుంచి అనూహ్యంగా స్వదేశానికి తిరిగి బయల్దేరిన విషయం తెలిసిందే. ‘వ్యక్తిగత కారణాలతో’ కోహ్లి వెనక్కి వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోహ్లి ఇంటికి వెళ్లడంపై స్పష్టమైన కారణం ఏమిటో తెలియకపోయినా... ఈ విషయంపై అతను ముందే బీసీసీఐ అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ‘‘గురువారమే కోహ్లి భారత్‌కు బయల్దేరాడు. ఇది ముందే నిర్ణయించుకున్నది. అందుకే అతను భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో కూడా ఆడలేదు’ అని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఈ నెల 26 నుంచి జరిగే తొలి టెస్టు సమయానికి అతను మళ్లీ దక్షిణాఫ్రికాకు చేరుకుంటాడని, మ్యాచ్ కూడా ఆడతాడని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేతి వేలి గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు పిలుపునిచ్చారు సెలక్టర్లు. చదవండి: ఆర్సీబీకి ఆడాలనేది నా కల.. ఇప్పుడిలా: కేఎల్ రాహుల్ Test cricket is the toughest & most demanding but the best form of cricket! It's pure, rich in history & heritage, say legends @ImRo45 & @imVkohli ahead of the Final Frontier vs #SouthAfrica. Tune-in the 1st #SAvIND Test TUE, DEC 26, 12:30 PM | Star Sports Network pic.twitter.com/wZDFGlVAVC — Star Sports (@StarSportsIndia) December 23, 2023 -
రుతురాజ్ స్థానంలో అతడే: బీసీసీఐ.. సర్ఫరాజ్‌కు మొండిచేయి
Ruturaj Gaikwad ruled out of Test series Vs South Africa: టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. ప్రొటిస్ జట్టుతో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. రుతు స్థానంలో అతడే రుతురాజ్‌కు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించిందని.. కాబట్టి అతడు భారత్‌కు తిరిగి రానున్నట్లు పేర్కొంది. త్వరలోనే అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకోనున్నాడని తెలిపింది. ఇక రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. రింకూ భారత- ఏ జట్టులో ఈ మేరకు సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత-ఏ జట్టులోని పేసర్ హర్షిత్ రాణా రెండో మ్యాచ్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అదే విధంగా రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్‌లను భారత-ఏ జట్టులో చేర్చుతున్నట్లు వెల్లడించింది. కుల్దీప్ యాదవ్‌ను ఈ జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా పేర్కొంది. అభిమన్యుకు లక్కీ ఛాన్స్.. పాపం సర్ఫరాజ్ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న వీరిద్దరికి ఇంతవరకు సెలక్టర్లు ఒక్కసారి కూడా పిలుపునివ్వలేదు. అయితే, సౌతాఫ్రికా టూర్ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయం వల్ల దూరం కావడంతో ఈశ్వరర్‌కు లక్కీగా ఛాన్స్ వచ్చింది. సర్ఫరాజ్‌కు మాత్రం మరోసారి మొండిచేయే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు రోజుల మ్యాచ్ కోసం అప్డేట్ చేసిన భారత-ఏ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్, నవదీప్ సైనీ, ఆకాశ్ దీప్, విద్వత్ కావేరప్ప, మానవ్ సుతార్, రింకూ సింగ్. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
Ind vs SA: టెస్టు సిరీస్‌కు స్టార్ ఓపెనర్ దూరం! ముంబై ఆటగాడికి లక్కీ ఛాన్స్?
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ రుతురాజ్ గైక్వాడ్ చేతి వేలి గాయం కారణంగా ప్రోటీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా గాయపడిన రుతు.. ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు పయనమైనట్లు సమాచారం. ఈ క్రమంలో రుతురాజ్ స్ధానాన్ని ఎప్పటి నుంచో జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబైకర్ సర్ఫరాజ్ ఖాన్‌తో భర్తీ చేయాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. భారత-ఏ జట్టు తరపున ప్రోటీస్ పర్యటనకు వెళ్లిన సర్ఫరాజ్ దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం అక్కడే ఉన్న భారత్ సీనియర్ జట్టుతో ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 61 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో రాణించాడు. కాగా దేశీవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్లో 900 పరుగులు, 2020-21 సీజన్లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు. దక్క్షిణాఫ్రికాతో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ -
Ind vs SA: టీమిండియాకు భారీ షాక్! స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లి?
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు!! స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ బీసీసీఐ అనుమతితో డిసెంబరు 19నే కోహ్లి భారత్‌కు వచ్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రిటోరియాలో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లి.. శుక్రవారం తిరిగి సౌతాఫ్రికా విమానం ఎక్కనున్నట్లు వెల్లడించింది. అయితే, రన్‌మెషీన్ తిరుగు ప్రయాణంపై పూర్తి స్పష్టత లేదు. కాగా కోహ్లి సతీమణి అనుష్క శర్మ గర్భవతి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కోహ్లి ముంబైకి తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్టార్ ఓపెనర్ టెస్టుల నుంచి అవుట్ మరోవైపు.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా గాయం నుంచి కోలుకోనట్లు సమాచారం. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ వేలికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పి తీవ్రం కావడంతో మూడో వన్డే ఆడలేకపోయిన రుతు.. టెస్టు సిరీస్ మొత్తానికి అతడు దూరమైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా డిసెంబరు 23న రుతురాజ్ భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. కాగా సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటారు.. ఇక మిగిలింది టెస్టులే అయితే, రోహిత్ శర్మ సారథ్యంలో ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని భారత్ భావిస్తుండగా వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ మహ్మద్ షమీ జట్టుకు దూరం కాగా.. కోహ్లి రాకపై సందిగ్దం నెలకొంది. మరోవైపు.. రుతురాజ్ గైక్వాడ్ రూపంలో బ్యాకప్ ఓపెనర్ అందుబాటులో లేకుండా పోయాడు. కాగా డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఇక సఫారీ పర్యటనలో భాగంగా భారత్ టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే, వన్డే సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టూర్లో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించగా.. టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ. సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్. షమీ*, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ. చదవండి: విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే -
రుతురాజ్ స్థానంలో ఎంట్రీ.. అరంగేట్రంలో ఇలా! అదే హైలైట్
One for future: Rajat Patidar Cameo: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు భారత బ్యాటర్ రజత్ పాటిదార్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయం కావడంతో అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చీ రాగానే మెరుగైన ఇన్నింగ్స్‌తో తన మార్కు చూపించాడు. కాగా పర్ల్ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో వన్డే ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉన్నది కాసేపే అయినా ఈ క్రమంలో రజత్ పాటిదార్.. సాయి సుదర్శన్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని 22 పరుగులు సాధించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన పాటిదార్.. రెండో ఓవర్ రెండో బంతికే బౌండరీ బాదాడు. అదే ఓవర్లో ఐదో బాల్‌కు మరో ఫోర్‌తో అలరించాడు. ఇక ఐదో ఓవర్ మొదటి బంతికి అద్భుత రీతిలో పాటిదార్ సిక్స్ బాదడం హైలైట్‌గా నిలిచింది. అయితే అదే ఓవర్లో మూడో బంతికి మరో బౌండరీ బాదిన రజత్ పాటిదార్.. ఆ మరుసటి బంతికే బౌల్డ్ అయ్యాడు. ప్రొటిస్ పేసర్ నండ్రే బర్గర్ బౌలింగ్‌లో బిగ్ షాట్‌కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అరంగేట్రంలో మొత్తంగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో మెరుగైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడంటూ రజత్ పాటిదార్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లలో కూడా రజత్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు టీమిండియా అభిమానులు. 30 ఏళ్ల వయసులో అరంగేట్రం మధ్యప్రదేశ్‌కు చెందిన రైట్‌హ్యాండ్ బ్యాటర్ రజత్ పాటిదార్. దేశవాళీ క్రికెట్లో గత ఎనిమిదేళ్లుగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా యాభై ఓవర్ల క్రికెట్లో పాటిదార్‌కు మంచి రికార్డు ఉంది. లిస్ట్- ఏ క్రికెట్లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్‌లు ఆడిన అతడు రెండు వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. టీ20లలోనూ అతడికి మెరుగైన రికార్డు ఉంది. మధ్యప్రదేశ్ తరఫున 148.55 స్ట్రైక్‌రేటుతో 1640 పరుగులు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్లో అదరగొడుతున్న పాటిదార్‌ను ఐపీఎల్ వేలం-2021 సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్‌లు ఆడిన రజత్ పాటిదార్ 404 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఈ ఏడాది గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చిన పాటిదార్.. ఐపీఎల్2024లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్-2024లో చోటే లక్ష్యంగా ముందుకు సాగనున్నాడు. What a shot from #RajatPatidar for his 1st ODI boundary! Another fearless debutant shows supreme confidence 👏 Tune-in to the 3rd #SAvIND ODI LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/CdtklTD9bs — Star Sports (@StarSportsIndia) December 21, 2023 -
Ind vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. రుతు అవుట్.. రజత్ అరంగేట్రం
Ind vs SA 3rd ODI- Rajat Patidar Makes His Debut: సౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే పర్ల్ వేదికగా గురువారం మొదలుకానుంది. ఇందులో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రెండో మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే తాము బరిలోకి దిగుతున్నట్లుప్రొటిస్ సారథి ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. రజత్ పాటిదార్ అరంగేట్రం మరోవైపు.. తాము రెండు మార్పులతో మైదానంలో దిగనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. టీమిండియా తరఫున రజత్ పాటిదార్ అరంగేట్రం చేయనున్నాడన్న రాహుల్.. రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయమైన కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలిపాడు. గెలిచి తీరాల్సిందే అదే విధంగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతినిచ్చి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టుకి ఎంపిక చేసినట్లు రాహుల్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే! తొలి వన్డేలో టీమిండియా గెలవగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. టీమిండియా- సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లు ఇవే: సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లిజాడ్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్. భారత్: సంజూ శాంసన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్. A look at #TeamIndia's Playing XI for the third and final ODI 👌👌 Rajat Patidar is set to make his ODI debut 👏👏 Follow the Match ▶️ https://t.co/nSIIL6gzER#TeamIndia | #SAvIND pic.twitter.com/3qHkp6M32u — BCCI (@BCCI) December 21, 2023 -
ముఖం మీదే డోర్ వేసేశాడు! పాపం రుతురాజ్.. వీడియో వైరల్
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. టీమ్ బస్ డ్రైవర్ అతడి పట్ల వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సఫారీ గడ్డపై టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు.. వన్డేలను విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టీమిండియా యువ పేసర్ల ధాటికి ప్రొటిస్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఫాస్ట్‌బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ ఐదు, ఆవేశ్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 27.3 ఓవర్లనే సఫారీల కథ ముగిసింది. భారత బౌలర్ల విజృంభణతో ఆతిథ్య జట్టు కేవలం 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పది బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, అరంగేట్ర ఓపెనర్ సాయి సుదర్శన్ 55(నాటౌట్), శ్రేయస్ అయ్యర్(52) అర్ధ శతకాలు బాదడంతో 16.4 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్‌ను ఛేదించింది. కేవలం రెండు వికెట్లు నష్టపోయి 117 పరుగులు చేసిన రాహుల్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో.. తొలి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యాన్ని టీమ్ బస్ డ్రైవర్‌తో ముడిపెడుతూ చేస్తున్న మీమ్స్ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ఫోన్లో మాట్లాడుతూ.. రుతురాజ్ బస్ ఎక్కేందుకు సిద్ధం కాగా డ్రైవర్ డోర్‌ను మూసేశాడు. అంతేకాదు.. బయటే ఉండు అన్నట్లు సైగ కూడా చేసినట్లుగా కనిపించింది. దీంతో రుతు బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘రుతురాజ్ ఈరోజు మ్యాచ్‌లో బాగా ఆడడని తెలిసే.. ఇక బస్సెక్కాల్సిన పనిలేదని డ్రైవర్ ఇలా చేశాడు’’ అంటూ కొందరు.. ‘‘చెత్తగా ఆడాడు కాబట్టే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇలా డోర్లు మూయించాడు’’ అని మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు. కాగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సెయింట్ జార్జ్ పార్కులో మంగళవారం రెండో వన్డే జరుగనుంది. Meme got real 😂😂 Bus driver mistakenly closes the door when Ruturaj Gaikwad was about to enter. 😁 pic.twitter.com/y2KFfGtScb — All About Cricket (@allaboutcric_) December 17, 2023 When you are 5 seconds late and bus driver is Shakib Al Hasan pic.twitter.com/7x1JbXvjgR — Sagar (@sagarcasm) December 17, 2023 -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?
జోహన్నెస్‌బర్గ్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా ఆఖరి టీ20లో భారత్‌ను ఓడించి 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులోకి యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, టీ20 నెం1 బౌలర్ రవి బిష్ణోయ్ రానున్నట్లు సమాచారం.ఈ క్రమంలో మరో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితం చేయాలని జట్టు మేనెజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా రెండో టీ20లో జైశ్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశపరిచారు. ఈ ఇద్దరూ ఓపెనర్లు కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. అయితే టీ20ల్లో గిల్‌కు మంచి రికార్డు దృష్ట్యా అతడిని మూడో టీ20లో కొనసాగించే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ను గిల్‌తో కలిసి రుతురాజ్ ప్రారంభించే అవకాశం ఉంది. అదే విధంగా రెండో టీ20లో హైదరాబాదీ తిలక్ వర్మ అకట్టుకున్నప్పటికీ.. కీలక మ్యాచ్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ వైపే మేనెజ్మెంట్ మొగ్గు చూపిస్తోంది. మరోవైపు పేస్ బౌలింగ్ విభాగంలో ఎటువంటి మార్పులు చేసే సూచనలు కన్పించడం లేదు. అర్షదీప్, సిరాజ్, ముఖేష్‌లతో కూడిన పేస్త్రయంతో భారత్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. భారత తుది జట్టు(అంచనా): శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్. -
Ind vs SA: నాలుగు మ్యాచ్‌లలో కలిపి 16..! స్టార్ ఓపెనర్‌పై ఫ్యాన్స్ ఫైర్
South Africa vs India, 2nd T20I: టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన పిచ్‌లపై ఆడే సత్తా అతడికి లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఫామ్‌ను బట్టే తుదిజట్టు ఎంపిక ఉండాలని.. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలరంటూ మేనేజ్మెంట్కు చురకలు అంటిస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత శుబ్‌మన్ గిల్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై.. తొలిసారిగా ప్రపంచకప్ ఈవెంట్లో ఆడిన ఈ పంజాబీ బ్యాటర్.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు సాధించాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలక ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. విఫలమైన గిల్ తనకు అచ్చొచ్చిన నరేంద్ర మోదీ స్టేడియంలో కేవలం నాలుగు పరుగులకే అవుటై విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్ బారిన పడ్డ గిల్.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనతో పునరాగమనం చేసిన శుబ్‌మన్ గిల్.. రెండో టీ20లో దారుణంగా విఫలమయ్యాడు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం నాటి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ప్రొటిస్ పేసర్ లిజాడ్ విలియమ్స్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. మరో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా సున్నా స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇలా ఓపెనర్లు ఇద్దరూ చేతులెత్తేయడంతో మిడిలార్డర్‌పై భారం పడింది. అయితే, తిలక్ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్(29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(56), నయా ఫినిషర్ రింకూ సింగ్(68- నాటౌట్) రాణించారు. Shellshocked bowlers, sprawled fielders, astonished fans and smashed glass: #RinkuSingh's maiden T20I 50 had everything! Will he continue in the same vein in the last match of the series? Tune-in to the 3rd #SAvIND T20I Tomorrow 7PM onwards | Star Sports Network#Cricket pic.twitter.com/oa9X1gQRMV — Star Sports (@StarSportsIndia) December 13, 2023 అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించింది. ఈ నేపథ్యంలో అద్బుతంగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. విదేశీ గడ్డపై గిల్ రాణించలేడంటూ ట్రోలింగ్! ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని శుబ్‌మన్ గిల్‌కు ఛాన్స్ ఇచ్చినందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. టాప్ స్కోరర్‌గా నిలిచి.. మంచి ఫామ్‌లో ఉన్న రుతును పక్కనపెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రుతురాజ్ గైక్వాడ్ సెలక్షన్‌కు అందుబాటులో లేడని బీసీసీఐ చెబుతున్నా ఎందుకో నమ్మశక్యంగా లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ప్రయోగాలు చేయొద్దని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి 16! ఈ సందర్భంగా విదేశీ గడ్డపై గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ కేవలం 16 పరుగులు(3,7,6,0) మాత్రమే చేశాడంటూ గణాంకాలు ఉటంకిస్తూ మరీ అతడి ఆట తీరును విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2024 అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 4 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాకు ప్రస్తుతం సౌతాఫ్రికాతో ఒకటి, అఫ్గనిస్తాన్‌తో మూడు టీ20లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ Unpopular opinion:- Shubham Gill & Yashasvi Jaiswal cannot score on difficult tracks... India desperately needs better like Ruturaj in team for #T20WorldCup2024#IPL2024Auction #INDvsSA #SAvsIND #RuturajGaikwad #ShubmanGill pic.twitter.com/1uCY06fiv7 — Siddharth Chauhan 🇮🇳 (@Siddh1611) December 12, 2023 Shubman Gill has scored only 16 runs in his 4 T20I innings at *away* venues so far with scores of 3, 7, 6, 0.#SAvIND — Rhitankar Bandyopadhyay (@rhitankar8616) December 12, 2023 -
ఏకంగా 56 స్థానాలు మెరుగుపర్చుకున్న రుతురాజ్.. టాప్‌లో భిష్ణోయ్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ఆసీస్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో మూకుమ్మడిగా రాణించిన భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 55.75 సగటున 223 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్.. ఏకంగా 56 స్థానాలు మెరుగపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. అదే సిరీస్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన రవి భిష్ణోయ్ (5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) నంబర్ 1 ర్యాంకు అందుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ (5 మ్యాచ్‌ల్లో 144 పరుగులు) తన టాప్ ర్యాంక్‌ను (881 పాయింట్లు) మరింత పదిలం చేసుకున్నాడు. ఈ మార్పులు మినహాయించి తాజా టీ20 ర్యాంకింగ్స్ పెద్దగా మార్పులు జరగలేదు. బ్యాటింగ్‌లో స్కై తర్వాత మహ్మద్ రిజ్వాన్, మార్క్రమ్, బాబార్ ఆజమ్, రిలీ రొస్సో, డేవిడ్ మలాన్, రుతురాజ్, జోస్ బట్లర్, రీజా హెండ్రిక్స్, గ్లెన్ ఫిలిప్స్ వరుసగా టాప్-10లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. హసరంగ, ఆదిల్ రషీద్, తీక్షణ, భిష్ణోయ్, సామ్ కర్రన్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్, అకీల్ హొసేన్, హాజిల్‌వుడ్ టాప్-10 జాబితాలో నిలిచారు. కాగా, ఆసీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
T20: గిల్‌కు ఇకపై గట్టి పోటీ.. వరల్డ్‌కప్‌లో ఆడాలంటే!
టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు ఇకపై గట్టి పోటీతప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే రుతురాజ్ గైక్వాడ్ కంటే మెరుగ్గా ఆడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ పాతుకుపోయిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఈ పంజాబీ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆరంభిస్తూ వస్తున్నాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా టీ20లకు రోహిత్ దూరమైన కారణంగా.. యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌కు అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం దక్కింది. అయితే, గిల్ పొట్టి ఫార్మాట్‌కు అందుబాటులో లేనపుడు రుతురాజ్ గైక్వాడ్ టీ20 జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ ముంబై బ్యాటర్ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 55.75 సగటు, 159.28 స్ట్రైక్‌రేటుతో మొత్తంగా 223 పరుగులు సాధించి.. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఖాతాలో ఓ వేగవంతమైన సెంచరీ కూడా ఉంది. ఇక ఈ సిరీస్‌ను 4-1తో టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఐదో టీ20లో విజయానంతరం ఆకాశ్ చోప్రా..రుతురాజ్ గైక్వాడ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రుతురాజ్ గైక్వాడ్... నేను కూడా రేసులో ఉన్నాను అని గట్టిగా చెబుతున్నాడు. శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్‌కు మధ్య ఓపెనింగ్ స్థానం కోసం ఇకపై గట్టి పోటీ ఉంటుంది. రోహిత్ శర్మ వచ్చాడంటే ఇక చెప్పేదేముంది? ఈ ముగ్గురిలో ఇద్దరిని ఎంచుకోవాలంటే అదెంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి.. రుతురాజ్ ఈ సిరీస్‌లో ఆడిన మాదిరే రానున్న మ్యాచ్‌లలోనూ పరుగులు రాబట్టాలి. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ ఆడాల్సి ఉంది. కాబట్టి ఆ జట్టులో చోటు దక్కించుకోవాలంటే రుతు ఫామ్‌ను కొనసాగించాలి. అప్పుడు రుతురాజ్- శుబ్‌మన్ గిల్ మధ్య షూటౌట్ తప్పదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండబోతోంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. యశస్వి జైశ్వాల్ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని కొనియాడాడు. చదవండి: విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం.. ఏకైక క్రికెటర్‌గా..! -
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. తొలి భారత క్రికెటర్‌గా
టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 4,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా రుతురాజ్ నిలిచాడు. రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో 32 పరుగులు చేసిన రుతురాజ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. రుతు ఈ ఫీట్‌ను కేవలం 116 ఇన్నింగ్స్‌లలోను అందుకున్నాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ ఈ మైలు రాయిని 117 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రాహుల్ రికార్డును రుత్‌రాజ్ బ్రేక్ చేశాడు. కాగా ఈ సిరీస్‌లో రుతురాజ్ దుమ్మురేపుతున్నాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో రుతురాజ్ విధ్వంసకర శతకం(123 నాటౌట్)తో చెలరేగాడు. చదవండి: Ind vs Aus: నువ్వంటే.. నువ్వు! రూ. 3.16 కోట్ల కరెంట్ బిల్లు బకాయి! ఇప్పటికీ.. -
అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు
టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. రుతు ప్రతిభావంతుడని.. భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్ కాగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నాడు. బీసీసీఐ అతడి సేవలను దీర్ఘకాలం పాటు ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. బ్యాటర్‌గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ రికార్డులు సాధిస్తున్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ సందర్భంగా సంచలన సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లోనే 100 పరుగుల మార్కును అందుకున్న రుతురాజ్ గైక్వాడ్.. 57 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఓ పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ ఒకప్పటి తన సహచర ఆటగాడు రుతు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ప్రస్తుతం భారత క్రికెట్ ఎక్కువగా ఉపయోగించుకుంటున్న ఆటగాడు ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్ పేరు చెప్పొచ్చు. అతడు అత్యంత ప్రతిభావంతుడు. భవిష్యత్తులో జట్టుకు మరింత ఉపయోగపడతాడు. తనకున్న టాలెంటే తన బలం. షాట్ సెలక్షన్, అనుకున్న రీతిలో తన వ్యూహాలను అమలు పరిచే విధానం.. అన్నింటికీ మించి ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ రుతును మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. కూల్‌గా తన పని తాను చేసుకుపోతాడు. ఏం చేయాలో.. ఏం చేయకూడదో తనకు తెలుసు. సైలెంట్‌గా ఉంటూనే దూకుడు ప్రదర్శించగలడు. టీమిండియాకు దొరికిన విలువైన ఆటగాడు. ఇలా చెప్పడం తొందరపాటే అయినా.. ధోని భాయ్ రిటైర్ అయిన తర్వాత సీఎస్కే కెప్టెన్‌గా రుతుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో టీమిండియా సారథి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆసియా క్రీడల్లో జట్టును ముందుండి నడిపించాడు” అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. కాగా చైనాలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో కెప్టెన్‌గా వ్యవహరించిన రుతు భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా సారథిగా రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టనుండగా.. శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇప్పుడు రుతురాజ్ పేరు కూడా వార్తల్లో నిలుస్తోంది. -
IND VS AUS 3rd T20: 35 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతను 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడిన రుతురాజ్ ఆతర్వాత గేర్ మార్చి చెలరేగిపోయాడు. తానెదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన రుతు.. ఆతర్వాతి 35 బంతుల్లో ఏకంగా 101 పరుగులు బాదాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రుతురాజ్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఓవర్లో అతను సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేయడంతో పాటు మరో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో రుతురాజ్ భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ చేసిన స్కోర్ (123 నాటౌట్) భారత్ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు శుభ్‌మన్ గిల్ (126 నాటౌట్) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) బాది ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆసీస్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. -
రుతురాజ్ బాదాడు... మ్యాక్స్‌వెల్ గెలిపించాడు
రుతురాజ్ మెరుపు శతకాన్ని మ్యాక్స్‌వెల్ విధ్వంసం కమ్మేసింది. టీమిండియా ‘హ్యాట్రిక్’ను, సిరీస్ విజయాన్ని అడ్డుకుంది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై అద్వితీయ డబుల్ సెంచరీని గుర్తుకు తెచ్చేలా మూడో టి20లో మ్యాక్సీ అజేయ శతకంతో ఆస్ట్రేలియాను గెలిపించాడు. బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో 30 పరుగులు సమర్పించుకున్న మ్యాక్సీ ఆ చేత్తోనే బ్యాటింగ్‌లో ఆఖరి బంతిదాకా పోరాడి మరీ జట్టును సిరీస్‌లో నిలిపాడు. గువాహటి: వరుస విజయాలతో సిరీస్‌ను గెలుచుకుందామనుకున్న టీమిండియా పట్టుదలకు ఒకే ఒక్కడు అడ్డుపడ్డాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ధనాధన్ ధాటికి మ్యాచ్ చేజారింది. మంగళవారం జరిగిన మూడో టి20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. సిరీస్ ఆధిక్యం 2–1కు తగ్గింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో వరుసగా మూడో సారి టీమిండియా 200 పైచిలుకు స్కోరు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు శతకాన్ని సాధించాడు. సూర్యకుమార్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఆ్రస్టేలియా సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి గెలిచింది. ట్రవిస్ హెడ్ (18 బంతుల్లో 35; 8) వేగంగా ఆడాడు. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. పేసర్ ముకేశ్ వివాహం కోసం సెలవు తీసుకోగా, అవేశ్ ఖాన్ భారత తుది జట్టులోకి వచ్చాడు. ఒడిదుడుకులతో మొదలై... పవర్‌ప్లేలో చెలరేగిపోయే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6) రెండో ఓవర్లోనే నిష్క్రమించడం, ఆ మరుసటి ఓవర్లోనే వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (0) డకౌట్ కావడంతో భారత్ పరుగుల పయనం నెమ్మదిగా మొదలైంది. 24/2 వద్ద కెప్టెన్ సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. నాథన్ ఎలిస్ ఐదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో అతను భారత శిబిరంలో జోష్ తెచ్చాడు. పవర్‌ప్లేలో జట్టు 43/2 స్కోరు చేసింది. సూర్య తడాఖా చూపడంతో పరుగుల వేగం పుంజుకుంది. చూడచక్కని బౌండరీలతో సూర్యకుమార్ కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రుతురాజ్ వీరవిహారం అప్పటి వరకు అడపాదడపా బౌండరీలతో సరిపెట్టుకుంటూ వచ్చిన రుతురాజ్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 21 బంతుల్లో 21 పరుగులే చేశాడు. ఆ తర్వాత ‘పరుగుల మిషన్’లా చెలరేగిపోయాడు. గైక్వాడ్ తర్వాతి 10 ఓవర్లలో 36 బంతులాడి 102 పరుగులు చేశాడు. 13వ ఓవర్లో రెండు ఫోర్లు, 14వ ఓవర్లో గైక్వాడ్ మరో రెండు బౌండరీలు బాది 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. సంఘా ఓవర్లో వరుసగా 4, 6 బాదిన గైక్వాడ్... హార్డి వేసిన 18వ ఓవర్లో 0, 6, 1వైడ్, 6, 4, 0, 6, 2లతో 25 పరుగులు పిండుకున్నాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఆఖరి ఓవర్లో రుతురాజ్ 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. తొలి బంతికి బాదిన సిక్సర్‌తోనే 52 బంతుల్లో రుతురాజ్ సెంచరీ పూర్తయ్యింది. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు రుతురాజ్, తిలక్ 9.4 ఓవర్లలో 141 పరుగులు జోడించారు. గెలిపించిన మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా ఛేజింగ్‌ను ఓపెనర్ హెడ్ ధాటిగా మొదలెట్టాడు. తొలి ఓవర్లో 2, రెండో ఓవర్లో 4 బౌండరీలు బాదాడు. హార్డి (16)ని అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. బౌండరీలతో చెలరేగిపోతున్న హెడ్‌ను అవేశ్‌ఖాన్ బోల్తా కొట్టించాడు. పవర్‌ప్లేలో ఆసీస్ స్కోరు 67/2. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆసీస్ ఓవర్‌కు 10పైచిలుకు రన్‌రేట్‌తో సాగిపోయింది. నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించాక 128 పరుగుల వద్ద స్టోయినిస్ (17) నిష్క్రమించగా, స్వల్ప వ్యవధిలో టిమ్ డేవిడ్ (0) డకౌటయ్యాడు. భారత్ శిబిరం ఆనందంలో ఉండగా అప్పుడు ఆసీస్ స్కోరు 13.3 ఓవర్లలో 134/5. గెలుపు సమీకరణం 39 బంతుల్లో 85 పరుగులు భారత్‌కే అనుకూలంగా ఉంది. కానీ తర్వాత కెపె్టన్ వేడ్ (28 నాటౌట్) జతవ్వగా... మ్యాక్స్‌వెల్ యథేచ్ఛగా భా రీసిక్సర్లతో భారత్ శిబిరాన్ని వణికించాడు. 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సివుండగా 18వ ఓవర్ వేసిన ప్రసిధ్ కేవలం 6 పరుగులే ఇచ్చి భారత్‌కు ఊరటనిచ్చాడు. కానీ అదే ప్రసిధ్ ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 21 పరుగులు కావాల్సినపుడు 4, 1, 6, 4, 4, 4లతో 23 పరుగులిచ్చుకున్నాడు. ఇందులో ఆఖరి 4 బంతుల్ని బౌండరీలను దాటించిన మ్యాక్స్‌వెల్ 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 4 అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక (4) సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్‌శర్మ రికార్డును మ్యాక్స్‌వెల్ సమం చేశాడు. 100 మ్యాక్స్‌వెల్‌కు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్. వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అతను నిలిచాడు. 68 భారత్ తరఫున టి20ల్లో అత్యధిక పరుగులు (68) ఇచ్చిన ఆటగాడు ప్రసిధ్ కృష్ణ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 6; రుతురాజ్ నాటౌట్ 123; ఇషాన్ (సి) స్టోయినిస్ (బి) రిచర్డ్సన్ 0; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) హార్డి 39; తిలక్ వర్మ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–14, 2–24, 3–81. బౌలింగ్: రిచర్డ్సన్ 3–0–34–1, బెహ్రెన్‌డార్ఫ్ 4–1– 12–1, ఎలిస్ 4–0–36–0, త న్వీర్ సంఘా 4–0–42–0, హార్డి 4–0–64–1, మ్యాక్స్‌వెల్ 1–0–30–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 35; హార్ది (సి) ఇషాన్ (బి) అర్ష్‌దీప్ 16; ఇంగ్లిస్ (బి) బిష్ణోయ్ 10; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 104; స్టోయినిస్ (సి) సూర్య (బి) అక్షర్ 17; టిమ్ డేవిడ్ (సి) సూర్య (బి) బిష్ణోయ్ 0; వేడ్ నాటౌట్ 28; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–47, 2–66, 3–68, 4–128, 5–134. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–44–1, ప్రసిధ్‌కృష్ణ 4–0–68–0, రవి బిష్ణోయ్ 4–0–32–2, అవేశ్‌ఖాన్ 4–0–37–1, అక్షర్ పటేల్ 4–0–37–1. -
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. తొలి భారత ఆటగాడిగా
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే రుతురాజ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రుతురాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో మెరుపు శతకంతో చెలరేగిన రుత్‌రాజ్ చెలరేగిన పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రుతు సాధించిన రికార్డులు ఇవే.. ►టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రుత్‌రాజ్ రికార్డులకెక్కాడు. ►అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో క్రికెటర్‌గా గైక్వాడ్(123)) నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో మరో భారత యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఉన్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లో గిల్ 126 పరుగులు చేశాడు. ►అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా రుతురాజ్ చరిత్రకెక్కాడు. గైక్వాడ్ కంటే ముందు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, సురేష్ రైనా, విరాట్ కోహ్లి, దీపక్ హుడా, యశస్వీ జైశ్వాల్ ఉన్నారు. చదవండి: IND vs AUS: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర సెంచరీ.. కేవలం 52 బంతుల్లోనే -
రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర సెంచరీ.. కేవలం 52 బంతుల్లోనే
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. హాఫ్ సెంచరీ వరకు కాస్త ఆచితూచి ఆడిన గైక్వాడ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 52 బంతుల్లో రుతురాజ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రుత్‌రాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక రుతు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్(39), తిలక్ వర్మ(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్, రిచర్డ్సన్, హార్థీ తలా వికెట్ సాధించారు. చదవండి: అగార్కర్ బృందం కసరత్తు.. ఆరోజే రోహిత్, కోహ్లి టీ20 భవితవ్యం తేలేది! ఇప్పుడు కాకుంటే.. -
అందుకే స్టోక్స్‌ను వదిలేశారు.. సీఎస్కే తదుపరి కెప్టెన్ అతడే!
IPL 2024- MS Dhoni- CSK: చెన్నై సూపర్‌కింగ్స్ భావి కెప్టెన్ ఎవరన్న అంశంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత చెన్నై జట్టును ముందుకు నడిపించగల సత్తా రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రమే ఉందని అభిప్రాయపడ్డాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, టెస్టు సారథి బెన్‌స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించాలనే ఉద్దేశంతో సీఎస్కే ఫ్రాంఛైజీ భారీగా ఖర్చు పెట్టిందని.. అయితే, అనుకున్న ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయిందని పేర్కొన్నాడు. అందుకే వేలానికి ముందు అతడిని వదిలేసిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ కాగా ఐపీఎల్-2024 వేలానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆటగాళ్లను రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకునే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ క్రమంలో.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహా డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, ఆకాశ్ సింగ్, కైలీ జెమీసన్, సిసంద మగలను చెన్నై విడుదల చేసింది. (PC: CSK/IPL) ఈ లిస్టులో ఖరీదైన ప్లేయర్ బెన్‌స్టోక్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత వేలంలో రూ. 16.25 కోట్ల భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసిన సీఎస్కే.. ధోని తర్వాత తదుపరి కెప్టెన్ చేయాలని భావించినట్లు తెలిసింది. అయితే, గాయాల కారణంగా తుదిజట్టులో కూడా అందుబాటులో లేకుండా పోయిన స్టోక్స్ పూర్తిగా నిరాశపరిచాడు. తప్పుకొంటాననగానే వదిలేసిన సీఎస్కే ఈ క్రమంలో తాను ఐపీఎల్ నుంచి తప్పుకొంటున్నట్లు స్టోక్స్ ప్రకటించగా.. సీఎస్కే కూడా అందుకు అంగీకరించి అతడిని వదిలేసింది. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘సీఎస్కే పూర్తి చేయాలని భావిస్తున్న పనుల్లో ముఖ్యమైనది కెప్టెన్సీ. ధోని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ పగ్గాలు చేపడతాడనే భావిస్తున్నా. అంబటి రాయుడు చెప్పినట్లు రుతుకు ఆ అర్హత ఉంది. బెన్‌స్టోక్స్ విషయంలో కెప్టెన్సీ కోసం ఆలోచించిన సీఎస్కే అందుకోసం భారీగా ఖర్చుపెట్టింది. స్టోక్స్ ఉంటే మంచిదే గానీ.. నిజానికి అతడు సమర్థవంతమైన నాయకుడు. అలాంటి అనుభవజ్ఞుడు కెప్టెన్‌గా ఉంటే జట్టుకు ఉపయోగకరం. కానీ ఇప్పుడు అతడు టీమ్‌తో లేడు’’ అని పేర్కొన్నాడు. ఇక మరో ఆల్‌రౌండర్‌ను వెదికే క్రమంలో చెన్నై మరోసారి శార్దూల్ ఠాకూర్ వైపు మొగ్గు చూపడం ఖాయం అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో అశూ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో మహారాష్ట్ర జట్టు విజయవంతమైన కెప్టెన్‌గా రుతురాజ్ దూసుకుపోతున్నాడు. బ్యాటర్‌గానూ ఈ ఓపెనర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం -
రుత్‌రాజ్ గైక్వాడ్‌కు సారీ చెప్పిన జైశ్వాల్.. ఎందుకంటే?
వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ తప్పిదానికి రుత్‌రాజ్ గైక్వాడ్ బలైన సంగతి తెలిసిందే. బంతి ఫీల్డర్ దగ్గరగా ఉన్నప్పుడు అనవసరంగా అదనపు పరుగు కోసం పిలుపునిచ్చి గైక్వాడ్ రనౌట్ అవ్వడానికి జైశ్వాల్ కారణమయ్యాడు. దీంతో కనీసం ఒక్క బంతిని కూడా ఎదుర్కొకుండానే డైమండ్ డక్‌గా రుత్‌రాజ్ వెనుదిరిగాడు. ఇక ఇదే విషయంపై ఆసీస్‌తో రెండో టీ20 అనంతరం స్పందించిన జైశ్వాల్.. రుత్‌రాజ్‌కు క్షమాపణ చెప్పాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ను 44 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ(25 బంతుల్లో 53)తో చెలరేగిన యశస్వీ.. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో జైశ్వాల్ మాట్లాడుతూ.. "తొలి మ్యాచ్‌లో నా తప్పు వల్ల రుతురాజ్ రనౌటయ్యాడు. ఆ తర్వాత రుతు భాయ్‌కు సారీ చెప్పాను. తప్పు నాదే అని ఒప్పుకున్నాను. రుతు భాయ్ డ్రెసింగ్ రూమ్‌లో చాలా కూల్‌గా, సైలెంట్‌గా ఉంటాడని" చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2024: హార్దిక్ ఒక్కడే కాదు.. గతంలోనూ కెప్టెన్ల ట్రేడింగ్! ఎవరెవరంటే? -
రుత్‌రాజ్ గైక్వాడ్ అత్యంత చెత్త రికార్డు..
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన మూడో భారత ఆటగాడిగా రుత్‌రాజ్ రికార్డులకెక్కాడు. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టీ20లో డైమండ్ డక్‌గా ఔటైన రుత్‌రాజ్.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కనీసం ఒక్క బంతిని ఎదుర్కొకుండానే గైక్వాడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా గైక్వాడ్ కంటే ముందు ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా, అమిత్ మిశ్రా ఉన్నారు. ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన లిస్ట్‌లో 21వ భారత ఆటగాడిగా గైక్వాడ్ నిలిచాడు. చదవండి: ఐపీఎల్-2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. Very bad call by jaiswal , Ruturaj Gaikwad Trusted on his call runs and he stops him at half track #INDvsAUS #INDvAUS #IndianCricket #IPLAuction #ipl2024 #RuturajGaikwad pic.twitter.com/KPsZ1Zudjt — Ankit bhumla(Gurjar) (@Kuldeep13726336) November 23, 2023 -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా యువ ఓపెనర్!
వన్డే ప్రపంచకప్-2023 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహారాష్ట్ర ఆటగాడు, సీఎస్కే స్టార్ రుత్‌రాజ్ గైక్వాడ్ భారత జట్టు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. రుత్‌రాజ్ కెప్టెన్‌గా ఇప్పటికే చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లో భారత్‌కు గోల్డ్‌మెడల్ అందించాడు. అదే విధంగా ఈ జట్టులో యశస్వీ జైశ్వాల్, జితేష్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కూడా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరోవైపు దేశీవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న అస్సాం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను పేరును కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా ఈ సిరీస్ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు జరగనుంది. నవంబర్ 23న ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు భారత జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, రియాన్ పరాగ్, జితేష్ శర్మ , శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా , అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ , యుజ్వేంద్ర చాహల్ చదవండి: WC 2023: శ్రీలంక క్రీడా మంత్రి సంచలన నిర్ణయం.. క్రికెట్ బోర్డు రద్దు! ఇకపై.. -
రుత్‌రాజ్ విధ్వంసకర శతకం.. కేవలం 51 బంతుల్లోనే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో టీమిండియా ఓపెనర్, మహారాష్ట్ర ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో రుత్‌రాజ్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 51 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 102 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. గైక్వాడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 178 పరుగుల టార్గెట్‌ను మహారాష్ట్ర.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. గైక్వాడ్‌తో పాటు కెప్టెన్ కేదార్ జాదవ్(42) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. విదర్భ బ్యాటర్లలో ధ్రువ్ షోరే(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహారాష్ట్ర బౌలర్లలో సత్యజిత్ బాచావ్ 4 వికెట్లు పడగొట్టగా.. సొలాంకి రెండు, దాదే, ఖాజీ, జాదవ్ తలా వికెట్ సాధించారు. చదవండి: WC 2023: నాకు మరీ ఎక్కువ రెస్ట్ ఇచ్చేశారు.. సెలక్టర్లపై సెంచరీ ‘హీరో’ విసుర్లు -
రఫ్ఫాడించిన రహానే.. విధ్వంసం సృష్టించిన రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తొలి రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల హవా కొనసాగింది. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానే (ముంబై కెప్టెన్), బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) చెలరేగిపోయారు. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో రహానే 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేయగా.. బెంగాల్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు సీఎస్కే బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలు సాధించి, తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. బెంగాల్-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. రుతురాజ్, కేదార్ జాదవ్ (40 నాటౌట్) రాణించడంతో మహారాష్ట్ర 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై-హర్యానా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. భారత బౌలర్ హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌లో హర్యానా ఓపెనర్‌గా బరిలోకి దిగి 38 పరుగులు చేశాడు. హర్యానా ఇన్నింగ్స్‌లో అంకిత్ (36), నిషాంత్ సంధు (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు తనుశ్ కోటియన్ (3-0-19-3), మోహిత్ అవస్తి (3-0-15-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే, శివమ్ దూబే (26 నాటౌట్) రాణించడంతో 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఔటయ్యాడు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్, అన్షుల్ తలో వికెట్ పడగొట్టారు. -
టీమిండియాకు భారీ షాక్! రుతురాజ్‌కు గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో!
WC 2023- Shubman Gill's Cover?: టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకో వారం సమయం పట్టేట్లుగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గిల్ స్థానంలో కవర్ ప్లేయర్‌గా మేనేజ్మెంట్కు రెండు ఆప్షన్లు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌కు శుబ్‌మన్ గిల్ దూరమైన విషయం తెలిసిందే. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ డెంగ్యూ ఫీవర్ కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అయితే, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ నాటికి(అక్టోబరు 11) కోలుకుంటాడని అంతా భావించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. కానీ కానీ గిల్ ఇంకా కోలుకోలేదంటూ బీసీసీఐ స్వయంగా ప్రకటించింది. ఆసీస్‌తో మ్యాచ్ తర్వాత రోహిత్ సేన.. రెండో మ్యాచ్ కోసం ఢిల్లీకి పయనమైనప్పటికీ అతడు చెన్నైలోనే ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో గిల్ ఆస్పత్రిలో చేరాడంటూ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉందని.. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తాజా సమాచారం. అయితే, కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పూర్తిగా కోలుకోని కారణంగా శుబ్‌మన్ గిల్ అక్టోబరు 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఇద్దరిలో ఒకరికి లక్కీ ఛాన్స్ ఇదిలా ఉంటే.. డెంగ్యూ నుంచి కోలుకున్నా అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది మరో ప్రశ్న! ఈ నేపథ్యంలో ఓపెనర్ గిల్‌కు కవర్ ప్లేయర్‌గా యశస్వి జైశ్వాల్ లేదంటే రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరిని టీమిండియాలో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ‘గోల్డెన్ కెప్టెన్’ రుతురాజ్ వైపే మొగ్గు! అనుభవం దృష్ట్యా సీనియర్ రుతురాజ్ గైక్వాడ్‌కే ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు నాయకత్వం వహించిన ముంబై బ్యాటర్ రుతురాజ్.. స్వర్ణ పతకం అందించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో యశస్వి జైశ్వాల్ కూడా సభ్యుడు. ఇక వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగమైన విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ గిల్‌కు జోడీగా బరిలోకి దిగి.. వరుసగా 71, 8 పరుగులు సాధించాడు. చదవండి: నువ్వెందుకు ఉన్నట్లు? అయినా రాహుల్‌ను ఎందుకు ఆడించట్లేదు: యువీ -
Ind Vs Afg: ఫైనల్ మ్యాచ్ రద్దు.. టీమిండియా గోల్డ్ మెడల్ ఎలా గెలిచిందంటే!
Asian Games Mens T20I 2023- India vs Afghanistan, Final: ఆసియా క్రీడల్లో టీమిండియా స్వర్ణంతో మెరిసింది. భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా పసిడి గెలిచి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాగా చైనా వేదికగా హోంగ్జూలో రుతురాజ్ గైక్వాడ్ సేన శనివారం అఫ్గనిస్తాన్‌తో ఫైనల్లో తలపడింది. టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత బౌలర్ల దాటికి అఫ్గన్ టాపార్డర్ కుదేలైంది. కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షహీదుల్లా కమల్ 43 బంతుల్లో 49 పరుగులతో, కెప్టెన్ గులాబదిన్ నయీబ్ 24 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, వర్షం రాకతో సీన్ మారిపోయింది. వరణుడి అంతరాయం కారణంగా 18.2 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 5 వికెట్లు నష్టానికి 112 పరుగుల వద్ద ఉన్న వేళ మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కురుస్తూనే ఉండటంతో మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రుతురాజ్ సేనకు స్వర్ణం ఎలా అంటే? ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను స్వర్ణం వరించింది. ఇక భారత మహిళా క్రికెట్ జట్టు సైతం గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఇక రుతురాజ్ సేన విజయంతో భారత్ పసిడి పతకాల సంఖ్య 27కు చేరింది. అదే విధంగా 35 రజత, 40 కాంస్య పతకాలు రావడంతో మొత్తంగా 102 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో ర్యాంకులో నిలిచింది. ఆసియా క్రీడలు-2023లో రుతురాజ్ సేన ప్రయాణం ►పటిష్ట టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ►తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ►తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ►ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు కావడంతో పసిడి కైవసం. చదవండి: శుభ్‌మన్ గిల్ కోసం సారా టెండూల్కర్ ట్వీట్ Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. బ్యాడ్మింటన్‌లో తొలి స్వర్ణం -
AFG vs IND Final: భారత్- ఆఫ్గాన్ ఫైనల్ రద్దు.. టీమిండియాకు గోల్డ్
ఆసియాక్రీడల్లో భారత్-ఆఫ్గానిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 18 ఓవర్లలో 112/5 వద్ద మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సేనకు స్వర్ణం ఖాయమైంది. 18 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 109/5 18 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్(48), నైబ్(26) పరుగులతో ఉన్నారు. 15 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 86/5 15 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 13 ఓవర్లకు ఆఫ్గానిస్తాన్ స్కోర్: 70/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్(36), నైబ్(4) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్.. భారత్‌తో జరగుతున్న ఫైనల్లో ఆఫ్గానిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 53 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం ఇఒక్క పరుగు మాత్రమే చేసిన కరీం జనత్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 53/5 నాలుగో వికెట్ డౌన్.. 49 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జజాయ్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 9 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 47/3 షహీదుల్లా కమల్ నిలకడగా ఆడుతుండటంతో(21 పరుగులతో ) అఫ్గన్ ఇన్నింగ్స్ తిరిగి గాడిలో పడింది. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆఫ్గానిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నూర్ అలీ జద్రాన్ రూపంలో ఆఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన జద్రాన్ రనటౌయ్యాడు. రెండు వికెట్లు కోల్పోయిన ఆఫ్గాన్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 5 పరుగులు చేసిన జుబైద్ అక్బరీను శివమ్ దుబే పెవిలయన్‌కు పంపగా.. మహ్మద్ షాజాద్(4)ను అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. 3 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 10/2 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఈ గోల్డ్‌మెడల్ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా పేసర్ అవేష్ ఖాన్ దూరమయ్యాడు. భారత జట్టు మొత్తం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు ఆఫ్గానిస్తాన్ ఒకే ఒక మార్పు చేసింది. జుబైద్ అక్బరీ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు భారత్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్‌దీప్ సింగ్ ఆఫ్గానిస్తాన్: జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్(వికెట్ కీపర్), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్ టాస్ ఆలస్యం.. ఏషియన్ గేమ్స్-2023 పురుషుల క్రికెట్ ఫైనల్లో పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా భారత్- ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ కాస్త ఆలస్యం కానుంది. -
పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్
Asian Games Mens T20I 2023- Pakistan vs Afghanistan, Semi Final 2: ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్ మెడల్ రేసు నుంచి పాక్ క్రికెట్ బృందం నిష్క్రమించింది. మరోవైపు.. అఫ్గన్ టీమ్ ఈ విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా పటిష్ట టీమిండియాతో ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పోటీపడే సువర్ణావకాశం దక్కింది. 115 పరుగులకే ఆలౌట్ చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో సెమీఫైనల్లో పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ పోటీపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లకే చాపచుట్టేసింది. అఫ్గనిస్తాన్ బౌలర్ల ధాటికి కేవలం 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఒమైర్ యూసఫ్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ గులాబదిన్, కరీం జనత్ ఒక్కో వికెట్ తీయగా.. ఫరీద్ అహ్మద్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఫైనల్‌కు చేర్చి కైస్ అహ్మద్, జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక స్వల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సెదీకుల్హా అటల్ 5, మహ్మద్ షాజాద్ 9 పరుగులకే అవుటయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ 39 పరుగులతో రాణించగా.. ఏడోస్థానంలో వచ్చిన గులాబిదిన్ 19 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాది అఫ్గనిస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. పసిడి కోసం టీమిండియాతో పోటీ ఇక పాక్‌తో మ్యాచ్‌లో 13 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలుపొందిన అఫ్గనిస్తాన్ ఫైనల్లో టీమిండియాను ఢీకొట్టనుంది. రుతురాజ్ గైక్వాడ్ సేనతో శనివారం(అక్టోబరు 7) అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 11.30 నిమిషాలకు ఆరంభమవుతుంది. కాంస్యం కోసం బంగ్లాతో పాక్ పోరు కాగా మొదటి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా గోల్డ్ మెడల్ రేసుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సెమీస్ ఫైనల్స్‌లో ఓడిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య శనివారం ఉదయం 6.30 గంటలకు కాంస్య పతక పోరు మొదలుకానుంది. చదవండి: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి? -
క్వార్టర్ ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. రేపే టీమిండియా మ్యాచ్.. ప్రత్యర్ధి ఎవరంటే..?
ఏషియన్ గేమ్స్ 2023 పురుషుల క్రికెట్లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. జట్ల సీడింగ్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. క్వాలిఫయింగ్ పోటీల ద్వారా నేపాల్, హాంగ్‌కాంగ్, మలేషియా జట్లు ఫైనల్ 8కు చేరాయి. టీమిండియా మ్యాచ్ ఎవరితో, ఎప్పుడంటే..? ఈ పోటీల్లో టీమిండియా మ్యాచ్ రేపు జరుగనుంది. తొలి క్వార్టర్ ఫైనల్లో నేపాల్.. టీమిండియాతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు (అక్టోబర్ 3) ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పోటీల్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నేపాల్ అండర్ డాగ్‌గా బరిలోకి దిగనుంది. నేపాల్ జట్టు సభ్యులు ఇటీవలే మంగోలియాపై పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి, అత్యధిక టీమ్ స్కోర్.. ఇలా ఈ మ్యాచ్‌లో పలు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో ఎవరెవరంటే..? తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్, నేపాల్ జట్లు తలపడనుండగా.. రెండో క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ (అక్టోబర్ 3న ఉదయం 11:30 గంటలకు), మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ (అక్టోబర్ 4న ఉదయం 6:30 గంటలకు), నాలుగో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్, మలేషియా (అక్టోబర్ 4న ఉదయం 11:30 గంటలకు) జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో విజేతలు అక్టోబర్ 6న జరిగే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 7న స్వర్ణ పతకం కోసం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
గోల్డ్‌మెడల్ టార్గెట్‌గా.. చైనాకు బయలు దేరిన టీమిండియా
ఆసియా క్రీడలు-2023లో పాల్గోనేందుకు రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని భారత జట్టు గురువారం చైనాకు బయలు దేరి వెళ్లింది. ముంబై నుంచి నేరుగా ఏసియన్ గేమ్స్ జరగుతున్న హంగ్జూకు టీమిండియా పయనమైంది. కాగా క్రీడలకు భారత త్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. వీవీయస్ లక్ష్మణ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. అదే విధంగా ఈ జట్టులో యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ సంచలనాలకు చోటు దక్కింది. ఇక ఇప్పటికే ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో భారత జట్టు గోల్డ్‌మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత పురుషల జట్టు కూడా పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ క్రీడల్లో భారత్ ప్రయాణం అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనుంది. నేరుగా క్వార్టర్స్ ఆడుతున్న జట్లలో.. ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. భారత జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ముకేశ్ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభుసిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్‌సింగ్. The Ruturaj Gaikwad-led #TeamIndia depart for the #AsianGames 👌👌#IndiaAtAG22 | @Ruutu1331 | @VVSLaxman281 pic.twitter.com/7yYkCLw5zM — BCCI (@BCCI) September 28, 2023 చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. రికీ పాంటింగ్ రికార్డు బద్దలు -
ఏషియన్ గేమ్స్ 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
చైనాలోని హాంగ్ఝౌ వేదికగా ఈనెల 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడలు 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు 15 మంది సభ్యుల బృందాన్ని ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్ నాయకత్వం వహించనున్నాడు. ఆఫ్ఘన్ సెలెక్టర్లు ఈ జట్టుకు ఆఫ్ఘన్అబ్దల్యన్ అని పేరు పెట్టారు. ఈ జట్టులో మొహమ్మద్ షెహజాద్, కరీమ్ జన్నత్, సెదీఖుల్లా అటల్, ఫరీద్ అహ్మద్ మలిక్, ఖైస్ అహ్మద్, అఫ్సర్ జజాయ్ లాంటి జాతీయ జట్టు ప్లేయర్లు ఉన్నారు. ఆసియా క్రీడల రూల్స్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అక్టోబర్ 3 లేదా 4వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్లో నేరుగా ఆడుతుంది. క్వార్టర్స్ అనంతరం అక్టోబర్ 6న సెమీఫైనల్, 7న ఫైనల్ జరుగుతుంది. ఈ క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. కాగా, ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌కు చోటు దక్కింది. తొలిసారి జరుగుతున్న పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా భారత్ రెండు విభాగాల్లో పోటీపడుతుంది. ఈ క్రీడల కోసం బీసీసీఐ పటిష్టమైన పురుషుల జట్టును ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా.. అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్ 1) ఆడుతుంది. టీమిండియా క్వార్టర్స్‌లో గెలిస్తే.. అక్టోబర్ 6న సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. సెమీస్‌లో గెలిస్తే అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో స్వర్ణం కోసం పోటీపడుతుంది. భారత్ ఆడే క్వార్టర్ ఫైనల్, సెమీస్ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు.. గుల్బదిన్ నైబ్, మొహమ్మద్ షెహజాద్, సెదీఖుల్లా అటల్, జుబ్దైద్ అక్బరీ, నూర్ అలీ జద్రాన్, షహీదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, వఫీవుల్లా తరాఖిల్, కరీం జన్నత్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్, నిజత్ మసౌద్,సయ్యద్ అహ్మద్ షిర్జాద్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు.. రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. తుది జట్టులో రుతురాజ్..?
వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోసం రెండు వేర్వేరు జట్లను భారత సెలెక్టర్లు నిన్న (సెప్టెంబర్ 18) ప్రకటించిన విషయం తెలిసిందే. సిరీస్‌లోని తొలి రెండు వన్డేలకు ఓ జట్టును, చివరి మ్యాచ్ కోసం మరో జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. తొలి రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడు. ఈ మ్యాచ్‌లకు రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. రోహిత్, కోహ్లి, హార్దిక్, కుల్దీప్ యాదవ్‌లు తిరిగి మూడో వన్డేకు జట్టులో చేరతారు. అందరూ ఊహించిన విధంగానే సెలెక్టర్లు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పిలుపునిచ్చారు. ఊహించని విధంగా తొలి రెండు వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. గైక్వాడ్ ఆసియా క్రీడల్లో టీమిండియాకు నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన నేపథ్యంలో సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరిగే తొలి వన్డేలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. తొలి వన్డేలో రుతురాజ్ తుది జట్టులో ఉంటాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. వరల్డ్‌కప్‌కు స్టాండ్‌బైగా ఎంపిక చేసే ఉద్దేశంతోనే రుతురాజ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే ఆసీస్‌తో తొలి వన్డేలో గిల్‌తో పాటు రుతురాజ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో ప్లేస్‌లో కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో తిలక్ వర్మ, ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదిలో అశ్విన్, స్పెషలిస్ట్ పేసర్లుగా షమీ, బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా): గిల్, రుతురాజ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా, సిరాజ్ -
చైనాకు భారత్ నుంచి భారీ బృందం.. 634 మంది! క్రికెట్ జట్లు ఇవే!
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత్ 634 అథ్లెట్లతో భారీ బృందాన్ని పంపించనుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 38 క్రీడాంశాల్లో ఈ బృందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. చైనాలో హాంగ్జూలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. కాగా.. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 572 మంది పాల్గొన్న విషయం విదితమే. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌కు 34 మంది పురుషులు, 31 మంది మహిళలు మొత్తంగా 65 మంది అథ్లెట్లు.. పురుష, మహిళా జట్లకు సంబంధించి 44 మంది ఫుట్‌బాలర్లు.. హాకీ జట్టు నుంచి మొత్తంగా 36 మంది, క్రికెట్ జట్ల నుంచి 30 మంది ఆసియా క్రీడల్లో భాగం కానున్నారు. స్టార్లంతా ఇక షూటింగ్ విభాగంలో భారత్ నుంచి 30 మంది, సెయిలింగ్ కోసం 33 మంది చైనాకు వెళ్లనున్నారు. అయితే, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, రగ్బీ తదితర విభాగాలకు సంబంధించి లిస్ట్ వెల్లడి కావాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో స్టార్లు నీరజ్ చోప్రా, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, పీవీ సింధు, మీరాబాయి చాను, సునీల్ ఛెత్రి, హర్మన్‌ప్రీత్ సింగ్, బజరంగ్ పూనియా తదితరులు భాగం కానున్నారు. క్రికెట్ జట్లు ఇవే! ఈసారి భారత్ నుంచి మహిళా, పురుష క్రికెట్ జట్లు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనుండటం విశేషం. చైనాకు క్రికెటర్లను పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వుమెన్ టీమ్‌లోని ప్రధాన క్రికెటర్లంతా ఈ మెగా టోర్నీలో భాగం కానుంగా.. మెన్స్ నుంచి ద్వితీయ శ్రేణి జట్టును హాంగ్జూకు పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 స్టార్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్ తదితరులతో కూడిన ఈ జట్టు ఆసియా బరిలో దిగనుంది. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ -
ఆసియా కప్, వరల్డ్‌కప్‌లలో రోహిత్‌కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో ఆటగాడు
టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్‌ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్‌ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్ ఫామ్ కోల్పోవడం, కేఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్‌కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్, సిరీస్‌కు కీలక ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్ హీరో శుభ్‌మన్ గిల్ తెరపైకి వచ్చాడు. రోహిత్‌కు జతగా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి రాహుల్‌ను మరిపించాడు. అయితే గిల్ ఫామ్ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో మరో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్ శిఖర్ ధవన్‌కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ స్థానాల కోసం రోహిత్‌తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్) లైన్లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లకు రోహిత్‌కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. -
MS Dhoni: ధోనిని భయ్యా అని పిలవలేం.. అదంతే: టీమిండియా కెప్టెన్ భార్య
India Star Opener Wife On MS Dhoni's 'Aura': మహేంద్ర సింగ్ ధోని అంటేనే ఓ ఎమోషన్. కెప్టెన్ కూల్ పక్కన ఉన్నాడంటే ఆటగాళ్లకు పండుగే! ఆటకు సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్లను నవ్వించడం, వాళ్లలో సానుకూల దృక్పథం నింపేలా నడచుకోవడం తలా స్టైల్! టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ భార్య, క్రికెటర్ ఉత్కర్ష పవార్ కూడా ఇదే మాట అంటోంది. నాలుగేళ్లుగా సీఎస్కేకే మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధోని సారథ్యంలో గత నాలుగేళ్లుగా సీఎస్కేకు ఆడుతున్న అతడు 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ముగిసిన తర్వాత రుతు.. తన చిరకాల ప్రేయసి ఉత్కర్షను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భయ్యా అని పిలవలేం అయితే, అంతకంటే ముందే ఆమెను తనతో పాటు సీఎస్కే క్యాంపునకు తీసుకెళ్లాడు రుతురాజ్. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ ధోనిని కలిసిన ఉత్కర్ష.. జట్టు చాంపియన్‌గా అవతరించిన తరుణంలో అతడితో కలిసి ఫొటోలు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన ఉత్కర్ష.. ధోని వ్యక్తిత్వం, నిరాడంబరత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎంఎస్ ధోని తన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చేస్తారు. ఆయనను మనం భయ్యా అని పిలవలేము. ఆయనతో మాట్లాడిన తర్వాతే కచ్చితంగా ‘సర్’ అని పిలవడమే సరైందని భావిస్తాం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనకే చెల్లింది. కుటుంబ సభ్యుల్లా చూస్తారు అసలు మనం ధోనితోనే ఉన్నామా అనే ఫీలింగ్ కలిగేలా చేస్తారు. తన హాస్యచతురతతో చుట్టూ ఉన్న వాళ్లను నవ్విస్తారు. అందరూ కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేస్తారు. ఆరంభంలో అడపాదడపా ఆయనను నేరుగా కలిసే అవకాశం వచ్చింది. అయితే, ఫైనల్ తర్వాత ఎక్కువ సమయం కలిసి గడిపే అవకాశం దొరికింది. ఆయన ప్రతి ఒక్కరిని తన సొంత కుటుంబ సభ్యుల్లాగే ప్రేమగా చూస్తారు. నేను, రుతు.. రెండు నెలల పాటు సీఎస్కేతో కలిసి ఉన్న రోజులు సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగించాయి’’ అని ఉత్కర్ష చెప్పుకొచ్చింది. కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న 24 ఏళ్ల ఉత్కర్ష పేస్ ఆల్‌రౌండర్. ఇక ఐపీఎల్-2023 విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: WC: సిరాజ్ కూడా ఉండకపోవచ్చు! వాళ్లకు జట్టులో చోటు దక్కినా కూడా.. టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం.. -
శుభ్‌మన్ టీ20లకు పనికిరాడు.. వాళ్లకు అవకాశం ఇవ్వండి..!
ఐపీఎల్ 2023లో ఏకంగా 3 సెంచరీలు బాది, పర్ఫెక్ట్ టీ20 ప్లేయర్‌గా వేనోళ్ల పొగడ్తలు అందుకున్న టీమిండియా యువ ఓపెనర్ శభ్‌మన్ గిల్‌పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. పట్టుమని 10 టీ20లు కూడా ఆడక ముందే గిల్‌ను కొందరు టార్గెట్ చేస్తున్నారు. గిల్ అసలు టీ20లకే పనికిరాడంటూ ప్రచారం చేస్తున్నారు. విండీస్‌తో తొలి టీ20లో (9 బంతుల్లో 3) దారుణంగా విఫలమైన అనంతరం గిల్ విమర్శకులు స్వరం మరింత పెంచారు. గిల్‌ను టీ20 జట్టు నుంచి తప్పించి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటివరకు 7 టీ20లు ఆడిన గిల్ న్యూజిలాండ్‌పై సెంచరీ మినహా అస్సలు రాణించింది లేదని గణాంకాలు ప్రూఫ్స్‌గా చూపిస్తూ విమర్శిస్తున్నారు. గిల్ ప్లేయింగ్ స్టయిల్ పొట్టి ఫార్మాట్‌కు సెట్ అయ్యేలా లేదని, అతను కేవలం ఐపీఎల్ ప్లేయర్ మాత్రమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు గిల్‌పై వస్తున్న ఈ విమర్శలను చాలామంది కొట్టి పారేస్తున్నారు. కేవలం 7 మ్యాచ్‌లకే ఓ ప్లేయర్ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారని మండిపడుతున్నారు. అతి తక్కువ కెరీర్ స్పాన్‌లో గిల్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తు చేస్తున్నారు. ఆటపై అవగాహన లేని వాళ్లే గిల్‌ను విమర్శిస్తారని చురకలంటిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల గిల్ ఇప్పటివరకు 18 టెస్ట్‌లు, 27 వన్డేలు, 7 టీ20లు ఆడి 7 సెంచరీలు, 10 అర్ధసెంచరీల సాయంతో 2600కు పైగా పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్లో 91 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 18 అర్ధసెంచరీల సాయంతో 2790 పరుగులు చేశాడు. గిల్ ఐపీఎల్ కెరీర్లో చేసిన 3 సెంచరీలు గత సీజన్లో చేసినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే, విండీస్‌తో నిన్న (ఆగస్ట్ 3)జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 145 పరుగులకే పరిమితమైంది. అరంగేట్రం ఆటగాడు తిలక్ వర్మ (39) మినహా టీమిండియా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రెండో టీ20 ఆగస్ట్ 6న గయానాలో జరుగనుంది. -
WC 2023: దాదాపు ఏడాది తర్వాత బుమ్రా రీఎంట్రీ.. అది కూడా కెప్టెన్‌గా! అవసరమా?!
Jasprit Bumrah Returns As Captain IND Vs IRE T20 Series: సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ మైదానంలోకి దిగబోతున్నాడు. వెన్నుకు గాయంతో జట్టుకు దూరం కావడం, ఆపై శస్త్రచికిత్స, అనంతరం రీహాబిలిటేషన్... ఇప్పుడు పూర్తిగా కోలుకొని బుమ్రా ఆట కోసం సిద్ధమయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కెప్టెన్‌గా రీఎంట్రీ పైగా అతను ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్టులో బుమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కీలకమైన ఆసియా కప్, ప్రపంచకప్‌కు ముందు బుమ్రా మ్యాచ్ ఫిట్నెస్ స్థాయిని పరీక్షించేందుకు పెద్దగా ఒత్తిడి లేని, బలహీన జట్టుతో జరిగే సిరీస్‌లో ఆడించబోతున్నారు. ప్రయోగాలు అవసరమా? ఈ నేపథ్యంలో ఓవైపు.. టీమిండియా అభిమానులు బుమ్రా రాకపై హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు.. వన్డే ప్రపంచకప్-2023 లాంటి మెగా ఈవెంట్‌కు ముందు కెప్టెన్సీతో ప్రయోగాలు ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐర్లాండ్ బలహీన జట్టే కావొచ్చు.. కానీ దాదాపు ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బుమ్రాపై అదనపు భారం మోపడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదనపు భారమే సారథిగా జట్టును ముందుండి నడిపించడం అంత తేలికేమీ కాదని.. ఆన్ ఫీల్డ్‌లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్‌లోనూ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ప్రధాన పేసర్ అయిన బుమ్రా... మెగా ఈవెంట్‌కు ముందు బౌలింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రిస్క్ ఎందుకు? ఫిట్నెస్, ఫామ్‌ను పరీక్షించడానికే ఐర్లాండ్ సిరీస్‌ను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటున్నప్పటికీ.. ఇప్పుడే మళ్లీ అతడిని రిస్క్‌లోకి నెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతేడాది.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టును ఓడించినంత పని చేసిన ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. గాయాల బెడదతో సతమతమైన బుమ్రా విషయంలో.. ఏమాత్రం తేడా వచ్చినా ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా యువ ఆటగాళ్లే! కాగా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరు 22న హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన బుమ్రా... ఐపీఎల్-2023 కూడా ఆడలేదు. ఇదిలా ఉంటే.. బుమ్రాతో పాటు గాయం నుంచి కోలుకున్న మరో పేసర్ ప్రసిధ్ కృష్ణకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఇక ప్రసిధ్ కూడా సంవత్సరం క్రితం భారత్‌కు ఆడాడు. వీరిద్దరు మినహా సీనియర్ ఆటగాళ్లెవరూ లేకుండా యువ ఆటగాళ్లతోనే మిగతా జట్టును ఎంపిక చేశారు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన టీమ్‌లోని సభ్యులే దాదాపుగా ఇక్కడా ఉన్నారు. టీమిండియా- ఐర్లాండ్ మధ్య ఆగస్టు 18, 20, 23 తేదీల్లో డబ్లిన్‌లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు వివరాలు: బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్. చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ అతడే: అంబటి రాయుడు
ఐపీఎల్లో ధోని తర్వాత చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరన్న విషయంపై చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే వచ్చే ఏడాది సీజన్లో ధోని ఆడుతాడో లేదో కచ్చితంగా తెలియదు. వచ్చే సీజన్లో ఆడేది, ఆడకపోవడం తన ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం మిస్టర్ కూల్ సృష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే తదుపరి కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ అవుతాడని ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. "రుత్‌రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. అదే విధంగా అతడికి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. నాకు తెలిసి మహీ బాయ్ మరో సీజన్ ఆడుతాడు. కాబట్టి భవిష్యత్తులో రుత్‌రాజ్ కచ్చితంగా చెన్నై సారధి అవుతాడు. అతడు 7 నుంచి 8 ఏళ్ల పాటు సీఎస్కేకు కెప్టెన్‌గా ఉండగలడు. రుతు ఇప్పటికే ధోని, హెడ్‌కోచ్ ఫ్లెమింగ్ నేతృత్వంలో రాటుదేలాడు. ఇక అతడు భారత జట్టు తరపున కూడా అన్ని ఫార్మాట్లలో అదరగొడతాడు. కానీ జట్టు మెనెజ్‌మెంట్ కూడా తగినన్ని అవకాశాలు ఇవ్వాలి" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.కాగా రుత్‌రాజ్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్‌తో టెస్టు, వన్డే జట్టులో రుత్‌రాజ్‌కు చోటు దక్కింది. కానీ టెస్టు సిరీస్‌లో మాత్రం అతడికి ఆడే అవకాశం రాలేదు. చదవండి: Deodhar Trophy 2023: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ -
ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్
ఏషియన్ గేమ్స్ 2023కి ఈసారి చైనా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది. ఈసారి గేమ్స్‌లో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ టీమిండియా పరుషుల, మహిళల జట్లను పంపనుంది. ఇప్పటికే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా జట్లను ప్రకటించింది. పురుషుల జట్టును రుతురాజ్ గైక్వాడ్ నడిపించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యం వహించనుంది. ఇక చైనాలో క్రికెట్ ఆడడం చాలా తక్కువ. అక్కడి వాళ్లు ఎక్కువగా ఇండోర్ గేమ్స్ సహా ఇతర క్రీడలు ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే చైనాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు లేవు. ఉన్నా ఏదో మొక్కుబడిగా నిర్మించినట్లుగా అనిపిస్తుంది. అయితే తాజాగా ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడంతో హాంగ్జూ నగరంలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. మాములుగా క్రికెట్ ఆడే మైదానాలు గుండ్రంగా ఉండడమే లేదంటే కాస్త స్క్కేర్ షేప్‌లో ఉండడం చూస్తాం. కానీ ఆసియా గేమ్స్ కోసం హాంగ్ఝౌలో నిర్మించిన క్రికెట్ స్టేడియం కాస్త వింతగా అనిపిస్తుంది. హాకీ మైదానాన్ని తలపించేలా ఉన్న స్టేడియంలో స్ట్రెయిట్స్ ఎక్కువ దూరం ఉంటే.. ఆఫ్‌సైడ్, లెగ్ సైడ్ బౌండరీలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. స్టేడియం షేపు వింతగా ఉన్నా.. ఇక్కడి అత్యాధునిక సౌకర్యాలు మాత్రం ప్రేక్షకులకు ఓ కొత్త క్రికెట్ మ్యాచ్ అనుభవాన్ని అందించనున్నాయి. హాంగ్జూలోని ఈ క్రికెట్ స్టేడియంలో 12 వేల మంది కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. దీని అద్భుతమైన డిజైన్, చుట్టూ పచ్చదనం, అత్యాధునిక సౌకర్యాలు ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి. పైగా బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో ఆసియా గేమ్స్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. చైనాలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం. ఇక ఐదేళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2010 ఏషియన్ గేమ్స్ లో తొలిసారి క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అయితే 2018లో జకార్తాలో జరిగిన గేమ్స్ నుంచి క్రికెట్ ను తొలగించారు. 2010, 2014లలో టి20 ఫార్మాట్ లో క్రికెట్ గేమ్స్ నిర్వహించారు. చివరిసారి ఆసియా గేమ్స్ జరిగినప్పుడు ఇండియా జట్టును పంపలేదు. ఈసారి రుతురాజ్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ను పంపిస్తోంది. ఈసారి ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడమే తన లక్ష్యమని రుతురాజ్ అన్నాడు. గతంలో బంగ్లాదేశ్, శ్రీలంకలు గోల్డ్ మెడల్స్ గెలిచాయి. వుమెన్స్ కేటగిరీలో రెండుసార్లూ పాకిస్థాన్ ఖాతాలోకే మెడల్స్ వెళ్లాయి. The Cricket Stadium for Asian Games in Hangzhou, China. Massive Score on Cards..! pic.twitter.com/38AgLsZP6U — Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2023 చదవండి: Lionel Messi: సీజన్‌కు రూ.492 కోట్ల చొప్పున.. మియామి క్లబ్‌కు మెస్సీ -
టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా..
India tour of West Indies, 2023 - Ind Vs WI 2nd Test: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది టీమిండియా. వెస్టిండీస్‌పై ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. విండీస్‌తో తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్‌గా హిట్ మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే 171 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు సరైన ఓపెనింగ్ జోడీ అనిపించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. విఫలమైన గిల్, రహానే అదే సమయంలో.. వన్‌డౌన్‌లో ఆడాలన్న ‘రెగ్యులర్ ఓపెనర్’ శుబ్‌మన్ కల నెరవేరినా.. సింగిల్ డిజిట్ స్కోరు(6)కే పరిమితం కావడంతో ఈ ప్రయోగం బెడిసికొట్టినట్లయింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అదరగొట్టిన అజింక్య రహానే విండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో యశస్వితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ శతకం(103), విరాట్ కోహ్లి 76, రవీంద్ర జడేజా 37(నాటౌట్) పరుగులతో రాణించగా.. గిల్, రహానే ఈ మేరకు విఫలం కావడం గమనార్హం. రుతురాజ్ గైక్వాడ్ అరంగేట్రం ఫిక్స్ ఇక విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్‌తో పాటు ఏకంగా ముగ్గురు ఓపెనింగ్ బ్యాటర్లకు స్థానం దక్కిన విషయం తెలిసిందే. శుబ్‌మన్, యశస్వితో పాటు మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశమిచ్చారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ సందర్భంగా అతడు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యశస్వి ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకోవడంతో.. మేనేజ్మెంట్ రుతును మిడిలార్డర్లో ఆడించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రోహిత్‌కు జోడీగా గిల్, యశస్వి రూపంలో ఆప్షన్లు ఉండటంతో రుతును మిడిలార్డర్లో ఆడించి.. ఒకవేళ అతడు సక్సెస్ అయితే.. అక్కడే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. రహానేపై వేటు తప్పదా? విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా ఈ ప్రయోగం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమై.. ఒకవేళ రుతురాజ్ అరంగేట్రం చేస్తే శుబ్‌మన్ గిల్ లేదంటే అజింక్య రహానేలలో ఎవరో ఒకరిపై వేటు తప్పదు. దీంతో యువ బ్యాటర్ గిల్‌ను తప్పిస్తారా లేదంటే ఏకంగా వైస్ కెప్టెన్‌నే డ్రాప్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. పేస్ విభాగంలో జయదేవ్ ఉనాద్కట్ స్థానంలో ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. తొలి టెస్టులో అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు కెప్టెన్ రోహిత్. ఇదిలా ఉంటే.. విండీస్‌తో రెండో టెస్టులో మూడో స్పిన్నర్‌ను ఆడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడుగా అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. దీంతో శార్దూల్‌కు మొండిచేయి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసియా క్రీడలు-2023 ఈవెంట్లో పాల్గొనున్న భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో రెండో టెస్టు- భారత తుది జట్టు (అంచనా) రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే/రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్. చదవండి: ‘సెహ్వాగ్ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’ అల్కరాజ్ గెలుపు కాదు.. ఫెదరర్ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్ -
జైశ్వాల్ ఒక్కడే కాదు.. అతడు కూడా టాలెంటెడ్.. ఛాన్స్ ఇస్తేనే: పాంటింగ్
India tour of West Indies, 2023: ‘‘ఇండియాలో దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు ఎప్పుడెప్పుడు అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడతారా అని ఎదురుచూడటం తప్ప మనమేం చేయలేం. నా దృష్టిలో యశస్వి జైశ్వాల్ మాదిరే రుతురాజ్ గైక్వాడ్ కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. టెస్టుల్లో అతడు గొప్పగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. రానున్న రెండేళ్లలో టీమిండియాకు మూడు ఫార్మాట్లలో అతడు కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయం. వీరితో పాటు భారత ఓపెనర్ పృథ్వీ షా కూడా అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్. అదే విధంగా సర్ఫరాజ్ కూడా దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరు టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు’’ అని ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ అన్నాడు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌ను ప్రశంసిస్తూనే రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. అరుదైన రికార్డులు సాధించి కాగా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా టీమిండియా వెస్టిండీస్‌తో తమ తొలి సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్టు సందర్భంగా ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేశాడు. మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అద్భుత శతకం(171)తో అలరించాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరుదైన రికార్డులెన్నో సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా విండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్న మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. రుతు బెంచ్‌కు పరిమితం కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో రుతు బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐసీసీ షోలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. యశస్వి ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాడని కొనియాడాడు. ఐపీఎల్లో అద్భుతంగా ఆడి రాత్రి రాత్రే సూపర్‌స్టార్‌గా మారిపోయాడన్నాడు. రుతురాజ్‌కు కూడా ఛాన్స్ ఇస్తే అతడు మంచి బ్యాటర్ అని అందరికీ తెలుసని, అయితే ఈ సీజన్లో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా తనలోని అన్ని రకాల టాలెంట్స్ ప్రదర్శించాని యశస్విపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌కు కూడా వరుస అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఇద్దరూ అదరగొట్టారు కాగా ఐపీఎల్-2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 14 మ్యాచ్‌లలో ఓ సెంచరీ(124) సాయంతో 625 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 16 మ్యాచ్‌లు ఆడి 590 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 92. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విజయంతో 1-0తో ముందంజ వేసిన టీమిండియా జూలై 20 నుంచి విండీస్‌తో రెండో టెస్టులో తలపడనుంది. చదవండి: బీసీసీఐకి థాంక్స్.. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాం: టీమిండియా కొత్త కెప్టెన్ రుతురాజ్ -
బీసీసీఐకి థాంక్స్.. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాం: టీమిండియా కొత్త కెప్టెన్
Asian Games 2023- Team India: ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి పాల్గొంటున్న జట్టుకు తాను నాయకుడిని కావడం గర్వంగా ఉందన్నాడు. తనతో పాటు జట్టులోని ఇతర సభ్యులు కూడా ఈ ఈవెంట్లో ఆడేందుకు ఎంతో ఉత్సుకతో ఉన్నారని తెలిపాడు. కాగా చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి పురుష, మహిళా క్రికెట్ జట్లను పంపేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 28 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్ నేపథ్యంలో జట్లను ప్రకటించింది. ఇక అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి పురుష జట్టును చైనాకు పంపనుంది. గోల్డ్ మెడల్ గెలిచి ఈ టీమ్‌కు టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ విషయంపై స్పందించిన రుతు.. ‘‘ఆసియా క్రీడల్లో పాల్గొననుండటం ఎంతో సంతోషంగా ఉంది. దేశం కోసం ఆడే మ్యాచ్‌లో కచ్చితంగా స్వర్ణ పతకం గెలుస్తామనే నమ్మకం ఉంది. గోల్డ్ మెడల్ గెలిచి పోడియం వద్ద నిల్చుని జాతీయ గీతం పాడాలనే కల నెరవేర్చుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. ఈ జట్టుకు నన్ను సారథిగా ఎంపిక చేసినందుకు బీసీసీఐ సెలక్టర్లకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. 🗣️ “𝑻𝒉𝒆 𝒅𝒓𝒆𝒂𝒎 𝒘𝒐𝒖𝒍𝒅 𝒃𝒆 𝒕𝒐 𝒘𝒊𝒏 𝒕𝒉𝒆 𝒈𝒐𝒍𝒅 𝒎𝒆𝒅𝒂𝒍, 𝒔𝒕𝒂𝒏𝒅 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒑𝒐𝒅𝒊𝒖𝒎 𝒂𝒏𝒅 𝒔𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒏𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝒂𝒏𝒕𝒉𝒆𝒎 𝒇𝒐𝒓 𝒕𝒉𝒆 𝒄𝒐𝒖𝒏𝒕𝒓𝒚” A happy and proud @Ruutu1331 is excited to lead #TeamIndia at the #AsianGames 😃 pic.twitter.com/iPZfVU2XW8 — BCCI (@BCCI) July 15, 2023 -
ఒకప్పుడు జట్టులో చోటే దిక్కు లేదు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా!
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత క్రికెట్ జట్లు తొలిసారి పాల్గొనబోతున్నాయి. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆసియాగేమ్స్‌లో భారత పురుషల జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సారథిగా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం అనూహ్యంగా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. దావన్కు కనీసం జట్టులో కూడా చోటు దక్కలేదు. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐపీఎల్ హీరో రింకూ సింగ్‌తో పాటు తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్‌కు చోటు దక్కింది. వీరితోపాటు ఆల్‌రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒకప్పుడు జట్టులో చోటుకే దిక్కులేదు.. ఇక ఆసియాకప్‌లో పాల్గోనే జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ధావన్ వంటి అనుభవం ఉన్న ఆటగాడని కాదని గైక్వాడ్‌ను సారధిగా ఎంపిక చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అయితే దేశవాళీ టోర్నీల్లో మాత్రం మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా రుత్‌రాజ్ వ్యవహరిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో కెప్టెన్‌గా రుత్‌రాజ్ విజయవంతం కావడంతో.. భారత జట్టు పగ్గాలను అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే రుత్‌రాజ్ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికి.. భారత్ సీనియర్ జట్టు తరపున ఆడిన అనుభవం మాత్రం పెద్దగా లేదు. అతడు ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, కేవలం ఒక్క వన్డే మాత్రం ఆడాడు. 9 టీ20ల్లో 16.88 సగటుతో 135 పరుగులు చేయగా.. ఏకైక వన్డేలో 19 పరుగులు రుత్‌రాజ్ సాధించాడు. రుత్‌రాజ్ చివరగా టీమిండియా తరపున గతేడాది జూన్‌లో ఆడాడు. అప్పటినుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్-2023లో రుత్‌రాజ్ అదరగొట్టడంతో విండీస్ టూర్‌కు సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. విండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు రుత్‌రాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. కానీ విండీస్‌తో తొలి టెస్టుకు మాత్రం తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే ఒకప్పుడు జట్టులొ చోటు కోసం అతృతగా ఎదురుచూసిన రుత్‌రాజ్.. ఇప్పుడు ఏకంగా భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఆసియా గేమ్స్ ఆక్టో 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి. చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ టీమిండియా పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్ స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్