అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన మూడో భారత ఆటగాడిగా రుత్‌రాజ్ రికార్డులకెక్కాడు. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టీ20లో డైమండ్ డక్‌గా ఔటైన రుత్‌రాజ్.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో కనీసం ఒక్క బంతిని ఎదుర్కొకుండానే గైక్వాడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా గైక్వాడ్ కంటే ముందు ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా, అమిత్ మిశ్రా ఉన్నారు. ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన లిస్ట్‌లో 21వ భారత ఆటగాడిగా గైక్వాడ్ నిలిచాడు.
చదవండి: ఐపీఎల్-2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్..
Very bad call by jaiswal , Ruturaj Gaikwad Trusted on his call runs and he stops him at half track #INDvsAUS #INDvAUS #IndianCricket #IPLAuction #ipl2024 #RuturajGaikwad pic.twitter.com/KPsZ1Zudjt
— Ankit bhumla(Gurjar) (@Kuldeep13726336) November 23, 2023
Comments
Please login to add a commentAdd a comment