రుతురాజ్ గైక్వాడ్‌తో ధోని (PC: CSK)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025లో హిట్‌మ్యాన్ కచ్చితంగా జట్టు మారడతాడని అంచనా వేశాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో అతడు ప్రయాణం మొదలుపెట్టడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2024కు ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్‌ను కాదని హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.
ఈ క్రమంలో ఇప్పటికే ఫ్రాంఛైజీ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ జట్టును వీడాలని ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే
‘‘రోహిత్ శర్మ చెన్నైకి వెళ్లిపోతాడా? ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడా? రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఈ ఒక్క ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడా? వచ్చే ఏడాది రోహిత్ జట్టుతో చేరేంత వరకు తాత్కాలిక సారథిగా ఉంటాడా? నేనైతే రోహిత్‌ను చెన్నై జట్టులో చూస్తాననే అనుకుంటున్నా’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్‌కు ఆడినా బాగానే ఉంటుంది
అయితే, ఇందుకు హోస్ట్ బదులిస్తూ.. ‘‘రోహిత్ ముంబై జట్టును వీడితే అభిమానుల హృదయాలు ముక్కలైపోతాయి కదా?’’ అని పేర్కొనగా.. అవునంటూ వాన్ సమాధానమిచ్చాడు. సీఎస్‌కేకు కాకపోతే రోహిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లినా బాగానే ఉంటుందని.. గతంలో అతడు డెక్కన్ చార్జర్స్‌కు ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా మైకేల్ వాన్ గుర్తు చేశాడు.
కాగా కెప్టెన్ మార్పు విషయాన్ని ముంబై ఇండియన్స్, రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ పాండ్యాపై ఆగ్రహం వెళ్లగక్కుతూ స్టేడియంలోనే అతడికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024లో పాండ్యా సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిన ముంబై.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలచింది.
మరోవైపు రోహిత్ శర్మ ఇంత వరకు ఒక్క అర్ధ శతకం కూడా బాదలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిఇపి 156 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై ఐదింట మూడు విజయాలతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది.
చదండి: IPL 2024 LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్?
Comments
Please login to add a commentAdd a comment