టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 4,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా రుతురాజ్ నిలిచాడు. రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో 32 పరుగులు చేసిన రుతురాజ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
రుతు ఈ ఫీట్‌ను కేవలం 116 ఇన్నింగ్స్‌లలోను అందుకున్నాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ ఈ మైలు రాయిని 117 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రాహుల్ రికార్డును రుత్‌రాజ్ బ్రేక్ చేశాడు. కాగా ఈ సిరీస్‌లో రుతురాజ్ దుమ్మురేపుతున్నాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో రుతురాజ్ విధ్వంసకర శతకం(123 నాటౌట్)తో చెలరేగాడు.
చదవండి: Ind vs Aus: నువ్వంటే.. నువ్వు! రూ. 3.16 కోట్ల కరెంట్ బిల్లు బకాయి! ఇప్పటికీ..
Comments
Please login to add a commentAdd a comment