Gujarat Titans And Chennai super kings Live Updates:
గుజరాత్‌ను చిత్తు చేసిన సీఎస్‌కే
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే మాత్రమే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్ పడగొట్టాడు.
నాలుగో వికెట్ డౌన్
96 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 42 బంతుల్లో 103 పరుగులు కావాలి. క్రీజులో సాయిసుదర్శన్(31), ఒమర్జాయ్(3) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ డౌన్.. శంకర్ ఔట్
55 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన విజయ్ శంకర్.. మిచిల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 57/3
రెండో వికెట్ డౌన్.. షా ఔట్
గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన వృద్దిమాన్ షా.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 34/2
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. గిల్ ఔట్
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 28/1
గుజరాత్ టార్గెట్ 207 పరుగులు
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు విధ్వంసం సష్టించారు.
రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్‌లు), శివమ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. దూబే ఔట్
184 పరుగుల వద్ద సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన శివమ్ దూబే.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
16 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 165/3
16 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(41), డార్లీ మిచెల్(14) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. గైక్వాడ్ ఔట్
127 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 13 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 128/3
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే. . రహానే ఔట్
105 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అజింక్యా రహానే.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.
తొలి వికెట్ డౌన్.. రవీంద్ర ఔట్
69 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
దంచికొడుతున్న రవీంద్ర.. 5 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 58/0
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్ రచిన్ రవీంద్ర దంచి కొడుతున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. రవీంద్ర ప్రస్తుతం 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 5 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్ 58/0
2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్:13/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(11), గైక్వాడ్(1) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సీఎస్‌కే మాత్రం ఒక మార్పు చేసింది. థీక్షణ స్ధానంలో పతిరానా తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్
Comments
Please login to add a commentAdd a comment