Ruturaj Gaikwad: ఆ యువ వికెట్‌ కీపర్‌ వల్లే ఇదంతా.. అతడు కూడా అదుర్స్‌ | Young Wicketkeeper Scoring Three 6s Helped Us A Lot: Ruturaj Hails MS Dhoni Vintage Cameo In IPL 2024 - Sakshi
Sakshi News home page

MS Dhoni: ఆ యువ వికెట్‌ కీపర్‌ వల్లే ఇదంతా.. అతడు కూడా అదుర్స్‌: రుతురాజ్‌

Published Mon, Apr 15 2024 10:51 AM | Last Updated on Mon, Apr 15 2024 12:38 PM

Young Wicketkeeper Scoring 3 6s Helped Us: Ruturaj Hails Dhoni Cameo IPL 2024 - Sakshi

మహేంద్ర సింగ్‌ ధోని (PC: IPL)

మహేంద్ర సింగ్‌ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ బ్యాట్‌తో దుమ్ములేపుతున్నాడీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ దిగ్గజ సారథి.. ప్రస్తుతం 27 ఏళ్ల రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

అవసరమైనప్పుడల్లా సలహాలు, సూచనలు ఇస్తూనే.. తనంతట తాను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పిస్తూ రుతుకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడంలో ధోని తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ ‘జార్ఖండ్‌ డైనమైట్‌’ కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్ల సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. తలా ఇన్నింగ్స్‌ చూడాలంటూ ఆశపడిన అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. 

శివం దూబే(38 బంతుల్లో 66 నాటౌట్‌)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక ధోని సునామీ ఇన్నింగ్స్‌ కారణంగా సీఎస్‌కే 200 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. 

లక్ష్య ఛేదనలో తడబడిన ముంబై 186 పరుగులకే పరిమితం కావడంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మా జట్టులో ఉన్న యువ వికెట్‌ కీపర్‌ ఆ మూడు సిక్స్‌లు బాదడం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. వాంఖడే పిచ్‌ మీద కచ్చితంగా మాకు 10- 15 అదనపు పరుగులు అవసరమైన వేళ ఈ ఇన్నింగ్స్‌ వల్ల మేలు చేకూరింది’’ అని ధోనిని ప్రశంసించాడు రుతు.

అదే విధంగా.. ‘‘మా జట్టులోని మలింగ(పతిరణ) ఈరోజు అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. యార్కర్లతో ప్రత్యర్థుల మతి పోగొట్టాడు. తుషార్‌, శార్దూల్‌ కూడా బాగా ఆడారు. ఇక నేను కూడా కేవలం ఓపెనర్‌గా కాకుండా ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా’’ అని రుతురాజ్‌ చెప్పుకొచ్చాడు.

చెన్నై వర్సెస్‌ ముంబై స్కోర్లు
►టాస్‌: ముంబై.. బౌలింగ్‌
►చెన్నై స్కోరు: 206/4 (20)
►ముంబై స్కోరు: 186/6 (20)
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మతీశ పతిరణ(4/28).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement