రుతురాజ్ గైక్వాడ్.. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర కెప్టెన్‌గా సత్తా చాటుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలుత అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన అతడు.. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఆరు వన్డేలు, 23 టీ20లు ఆడాడు.
వన్డేల్లో 73.25 స్టైక్‌రేటుతో 115 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. పొట్టి ఫార్మాట్లో 143.54 స్టైక్‌రేటుతో 633 రన్స్ చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ సగటు 42.69. ఇప్పటి వరకు 29 ఇన్నింగ్స్ ఆడి 2092 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి.
అయితే, రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం ఇంతవరకు టెస్టుల్లో అవకాశం రాలేదు. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్‌గా అతడి పేరును ప్రకటించగానే.. త్వరలోనే రుతు టెస్టు అరంగేట్రం ఖాయమని అభిమానులు సంతోషపడిపోయారు. బ్యాటర్‌గా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఈ మహారాష్ట్ర ఆటగాడిని బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపిక చేస్తారని ఆశించారు.
ఎందుకు అవకాశాలు ఇవ్వరు?
కానీ.. తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో రుతుకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లను ట్రోల్ చేస్తూ నెట్టింట విమర్శలకు దిగాను రుతు ఫ్యాన్స్. వన్డే, టీ20 వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పోలుస్తూ రుతురాజ్‌కు తీరని అన్యాయం జరుగుతోందంటూ మండిపడుతున్నారు.
ఇరవై ఐదేళ్ల గిల్‌కు లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చారని.. అదే 27 ఏళ్ల రుతు విషయంలో మాత్రం ఎందుకు వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా పాతుకుపోగా.. గిల్‌ను మూడో స్థానంలో ఆడిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితి
వన్‌డౌన్‌లో గిల్ విఫలమవుతున్నా అతడికి ఛాన్సులు ఇస్తున్న మేనేజ్‌మెంట్.. కనీసం బ్యాకప్ ఓపెనర్‌గా అయినా రుతురాజ్‌ను ఎందుకు ఎంపికచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ మాదిరే.. రుతుపై వివక్ష చూపుతున్నారని.. మహారాష్ట్ర శాంసన్ అంటూ రుతు పేరును ట్రెండ్ చేస్తున్నారు.
కాగా దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్ ఇండియా-డితో మ్యాచ్‌లో 5, 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ఇండియా- ఎ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 25, 21 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాతో తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం రాత్రి ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రుతురాజ్‌కు చోటు దక్కలేదు.
చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!
Squad is out. Shubman Gill makes the cut, but Ruturaj Gaikwad doesn't! Honestly, isn't this BCCI politics at play!? No matter how well guy performs and wins, he can never find a place in Rohit Sharma's team!
What partiality, Mann.
#INDvBAN #RuturajGaikwad #BCCI— Sharon Solomon (@BSharan_6) September 8, 2024
Comments
Please login to add a commentAdd a comment