ఐపీఎల్-2024లో చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లను రుతురాజ్ ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 54 బంతుల్లోనే గైక్వాడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
గైక్వాడ్‌కు ఇది తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి సీఎస్‌కే 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబే మరోసారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో మాట్ హెన్రి, యశ్ ఠాకూర్, మోహ్షిన్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
The Guiding Star! 🌟🦁#CSKvLSG #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2024
pic.twitter.com/aUsekAgySQ
Comments
Please login to add a commentAdd a comment