సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 కోసం మహారాష్ట్ర జట్టును నిన్న (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల మేళవింపుగా ఉంది. అంకిత్ బవానే, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ చౌదరీ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. నిఖిల్ నాయక్, ధన్‌రాజ్ షిండే వికెట్‌కీపర్లుగా ఎంపికయ్యారు. రాజవర్ధన్ హంగర్గేకర్, ప్రశాంత్ సోలంకి బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉంటారు.
ఈ టోర్నీలో మహారాష్ట్ర గ్రూప్-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళ, ముంబై, ఆంధ్రప్రదేశ్, గోవా, సర్వీసెస్, నాగాలండ్ లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆనుంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సేన నాగాలాండ్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర గతేడాది నాకౌట్ దశకు చేరలేకపోయింది. ఈసారి పటిష్ట జట్టు ఉండటంతో పాటు రుతురాజ్ సారథ్యం తోడవ్వడంతో మహారాష్ట్ర టైటిల్‌పై కన్నేసింది.
కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఈసారి రసవత్తరంగా మారనుంది. ఈ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు జట్లను ముందుండి నడిపించనున్నారు. మహారాష్ట్రకు రుతురాజ్ సారథ్యం వహిస్తుండగా.. ముంబైకు శ్రేయస్ అయ్యర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు భువనేశ్వర్ కుమార్, కేరళకు సంజూ శాంసన్, బరోడాకు కృనాల్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్) లాంటి టీమిండియా స్టార్లు కూడా పాల్గొననున్నారు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
మహారాష్ట్ర జట్టు..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అంకిత్ బవానే, అర్షిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్‌కీపర్), ధన్‌రాజ్ షిండే (వికెట్‌కీపర్), దివ్యాంగ్ హింగనేకర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అథర్వ కాలే, సిద్ధార్థ్ మాత్రే, సత్యజీత్ బచ్చవ్, రాజవర్ధన్ హంగర్గేకర్, అజీమ్ కాజీ, రుషబ్ రాథోడ్, సన్నీ పండిట్
Comments
Please login to add a commentAdd a comment