ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. చేతి వేలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వేగంగా కోలుకుంటున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. అయితే రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టు సమయానికి గైక్వాడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది.
మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జరగనుంది. రాజ్‌కోట్ టెస్టుకు ముందు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి గైక్వాడ్ రంజీ ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు ఏన్సీఏ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టును వచ్చే వారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది.
బ్యాకప్ ఓపెనర్‌గా భారత-ఏ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగిన ఛతేశ్వర్ పుజారాకు సెలక్టర్లు మళ్లీ పిలుపు నివ్వనున్నట్లు తెలుస్తోంది. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: IPL 2024: ఆ ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. ఆ ముగ్గురి ఆటగాళ్లకు లైన్ క్లియర్
Comments
Please login to add a commentAdd a comment