
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ (PC: Twiter)
వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ తప్పిదానికి రుత్‌రాజ్ గైక్వాడ్ బలైన సంగతి తెలిసిందే. బంతి ఫీల్డర్ దగ్గరగా ఉన్నప్పుడు అనవసరంగా అదనపు పరుగు కోసం పిలుపునిచ్చి గైక్వాడ్ రనౌట్ అవ్వడానికి జైశ్వాల్ కారణమయ్యాడు. దీంతో కనీసం ఒక్క బంతిని కూడా ఎదుర్కొకుండానే డైమండ్ డక్‌గా రుత్‌రాజ్ వెనుదిరిగాడు.
ఇక ఇదే విషయంపై ఆసీస్‌తో రెండో టీ20 అనంతరం స్పందించిన జైశ్వాల్.. రుత్‌రాజ్‌కు క్షమాపణ చెప్పాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ను 44 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ(25 బంతుల్లో 53)తో చెలరేగిన యశస్వీ.. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో జైశ్వాల్ మాట్లాడుతూ.. "తొలి మ్యాచ్‌లో నా తప్పు వల్ల రుతురాజ్ రనౌటయ్యాడు. ఆ తర్వాత రుతు భాయ్‌కు సారీ చెప్పాను. తప్పు నాదే అని ఒప్పుకున్నాను. రుతు భాయ్ డ్రెసింగ్ రూమ్‌లో చాలా కూల్‌గా, సైలెంట్‌గా ఉంటాడని" చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2024: హార్దిక్ ఒక్కడే కాదు.. గతంలోనూ కెప్టెన్ల ట్రేడింగ్! ఎవరెవరంటే?
Comments
Please login to add a commentAdd a comment