సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో టీమిండియా ఓపెనర్, మహారాష్ట్ర ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో రుత్‌రాజ్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 51 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 102 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి.
గైక్వాడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 178 పరుగుల టార్గెట్‌ను మహారాష్ట్ర.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. గైక్వాడ్‌తో పాటు కెప్టెన్ కేదార్ జాదవ్(42) పరుగులతో రాణించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. విదర్భ బ్యాటర్లలో ధ్రువ్ షోరే(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహారాష్ట్ర బౌలర్లలో సత్యజిత్ బాచావ్ 4 వికెట్లు పడగొట్టగా.. సొలాంకి రెండు, దాదే, ఖాజీ, జాదవ్ తలా వికెట్ సాధించారు.
చదవండి: WC 2023: నాకు మరీ ఎక్కువ రెస్ట్ ఇచ్చేశారు.. సెలక్టర్లపై సెంచరీ ‘హీరో’ విసుర్లు
Comments
Please login to add a commentAdd a comment