ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు టీమిండియా లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంస్ ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్‌కేకు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ధోని సీఎస్‌కే మెంటార్‌గా సరికొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
తాజాగా ధోని సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. 'కొత్త సీజన్‌లో కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండి’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ధోని ఏ రోల్‌లో కనిపించనున్నాడా అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు. ధోనీ మాత్రమే కాదు.. చైన్నై సూపర్ కింగ్స్ కూడా ఓ ట్వీట్ చేసి అభిమానుల్లో సస్పెన్స్‌ను మరింత పెంచింది. `కొత్త పాత్రలో లియో` అంటూ ఓ ట్వీట్ చేసింది. దీంతో ఈ సీజన్‌లో మెంటార్‌గా ఎంఎస్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.
కాగా 42 ఏళ్ల ధోనీ గత సీజన్ లో సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. చెన్నై జట్టు ఇప్పటికే చెపాక్ స్టేడియంలో ట్రెయినింగ్ క్యాంప్‌ను ప్రారంభించింది. కానీ ధోని మాత్రం ఇంకా ఈ ట్రెయినింగ్ క్యాంప్‌లో చేరలేదు. ఇవన్నీ చూస్తుంటే ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై చెప్పే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ ధోని తప్పుకుంటే సీఎస్‌కే కెప్టెన్‌గా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. సీఎస్‌కే తొలి మ్యాచ్‌లోనే చెపాక్ వేదికగా ఆర్సీబీతో తలపడనుంది.
చదవండి: Shreyas Iyer: ‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?!
Comments
Please login to add a commentAdd a comment