
ఐపీఎల్-2024లో వరుసగా రెండు ఓటుములు చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతోంది.
138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సీఎస్‌కే 17. 4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. సీఎస్‌కే లక్ష్య ఛేదనలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు. గైక్వాడ్ 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(28) మరోసారి అదరగొట్టాడు.కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఒక్క వికెట్ సాధించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది.సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే తలా మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ రెండు, థీక్షణ ఒక్క వికెట్‌సాధించారు.
కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.
"తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు సంతృప్తిగా ఉంది. నా తొలి ఐపీఎల్ ఫిప్టీ సాధించినప్పుడు కూడా అచ్చెం ఇటువంటి పరిస్థితే. అప్పుడు మహి(ఎంఎస్ ధోని) భాయ్ నాతో ఉన్నాడు. ఇద్దరం కలిసి మ్యాచ్‌ను మగించాము. ఈ రోజు కూడా వికెట్ అలానే ఉంది.
పిచ్ చాలా స్లోగా ఉంది. కాబట్టి కాస్త ఆచూతుచి ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ ఫినిష్ చేసేంతవరకు క్రీజులో ఉండాలనుకున్నాను. ఈ పిచ్‌పై స్ట్రైక్ రొటేట్ చేసి బౌండరీలు కొడితే 150 నుంచి 160 పరుగులు సాధించవచ్చు. కానీ మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్ధిని తక్కువే స్కోరుకే కట్టడి చేశాం.
జడ్డూ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. సహజంగా పవర్‌ప్లే తర్వాత జడ్డూనే ఎటాక్‌లోకి వస్తాడు. దాని వెనుక ఎటువంటి వ్యూహాలు లేవు. ఇక మా జట్టులో ఏ విభాగంలోనూ ఎవరికి నేను ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఒక క్లారిటీ ఉంది. మహి భాయ్ ఇంకా జట్టులోనే ఉన్నారు.
అదేవిధంగా ఫ్లెమింగ్ కూడా కోచ్‌గా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ను నేనేమి స్లోగా ప్రారంభించలేదు. టీ20లో మనం ఎదుర్కొనే తొలి రెండు మూడు బంతులు చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా సందర్భాల్లో దూకుడుగా ఆడి వికెట్ కోల్పోతాము. పరిస్ధితుల తగ్గట్టు ఆడి గెలిపించాలని నిర్ణయించకున్నా. అదే ఈ రోజు చేశా. నా స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమి మాట్లాడుకున్న నేను పట్టించుకోను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రుతు పేర్కొన్నాడు.
They are 🔙 to winning ways 👍
— IndianPremierLeague (@IPL) April 8, 2024
Chennai Super Kings 💛 remain unbeaten at home with a complete performance 👏👏
Scorecard ▶ https://t.co/5lVdJVscV0 #TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/16nzv4vt8b