
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి ఆకిబ్ జావేద్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్ ఘోర ప్రదర్శన అనంతరం జావేద్ తన పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో హెడ్ కోచ్ లేకుండానే పాక్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది.
అక్కడ కూడా అదే తీరును మెన్ ఇన్ గ్రీన్ కనబరిచింది. పాక్ జట్టు ఈ ఏడాది జూలై ఆఖరిలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ వ్యవధిలో తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. పాకిస్తాన్ హెడ్ కోచ్ రేసులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెట్ మాజీ డైరెక్టర్ మైక్ హెస్సన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అతడితో పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.హెస్సన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతడి నేతృత్వంలోనే ఇస్లామాబాద్ యునైటెడ్ గతేడాది పీఎస్‌ఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచ్‌గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గతంలో న్యూజిలాండ్ కోచ్‌గా, ఆర్సీబీ క్రికెట్ డైరక్టర్‌గా హెస్సన్ పనిచేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ హెడ్ కోచ్‌గా నియమించాలని పీసీబీ భావిస్తోందంట. అయితే హెడ్ కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ కాటిచ్, న్యూజిలాండ్ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంచిలతో కూడా పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
చదవండి: IPL 2025: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?